AP News : అవసరం లేకున్నా ఎక్స్ రే, సిటీ- స్కానింగ్, ఎంఆర్‌ఐ స్కానింగ్ టెస్టులు
వైద్యం వ్యాపారంగా మారింది..ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్

Health Minister Satyakumar participated in the oath-taking ceremony of nominated members of the AP Medical Council
వైద్యం వ్యాపారంగా మారింది
దాని పవిత్రతను కొనసాగించాలి
ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్
విజయవాడ - ప్రభాత సూర్యుడు
గతంలో పోలిస్తే.. ఇప్పుడు వైద్యం వ్యాపారంగా మారిందని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన ఏపీ మెడికల్ కౌన్సిల్ లో నామినేటెడ్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఆంధప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఆరుగురు సభ్యులను నామినేటెడ్ పోస్టుల్లో ఎన్నుకున్నాం.. వారందరికీ అభినందనలు తెలియ జేస్తున్నాను... మంచి అనుభవం కలిగిన డాక్టర్లను ప్రభుత్వం ఎన్నుకుందన్నారు.. తరతరాలుగా వైద్యుల్ని దేవుడు పోల్చేవారు.. ఇదివరకు పోలిస్తే ఇప్పుడు వైద్యం వ్యాపారంగా మారిందన్న ఆయన.. డాక్టర్లు రోగులను మానవత దృష్టితో చూడాలని సూచించారు.
వైద్యవృత్తి విలువలు పల్చబడ్డాయి.. అవసరం లేకుండానే ఎక్సరేలు, సిటీ- స్కానింగ్, ఎంఆర్‌ఐ స్కానింగ్ లు తీస్తున్నారు.. అలాగే నార్మల్ డెలివరీ చేయడం మానేశారు.. అవసరం లేకపోయినా ఆపరేషన్ చేస్తున్నారు.. ప్రభుత్వ డాక్టర్లు గానీ.. ప్రైవేట్ డాక్టర్లు గానీ నార్మల్ డెలివరీస్ చేస్తే బాగుంటుందన్నారు.. ప్రజలు కూడా రకరకాల టెస్టులు రాస్తేనే మాకు సరిగ్గా డాక్టర్లు చూశారని అపోహలో ఉన్నారని వ్యాఖ్యానించారు మంత్రి సత్యకుమార్.. అటు వంటి వారికి అవగాహన కల్పించాలి.. వచ్చిన పేషెంట్ ను చిరునవ్వుతో డాక్టర్లు స్వాగతం పలకాలని సూచించారు.. డాక్టర్లు సర్టిఫికెట్లను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి.. కొత్త కౌన్సిల్, ఏపీఎంసీ సర్టిఫికెట్స్ రెన్యువల్ విూద ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు.. ఫారెన్ రిటర్న్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువగా రిజిస్టేష్ర్రన్ చేసుకోవడం లేదు.. నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఎపీఎంసీ సభ్యులుగా డాక్టర్ గోగినేని సుజాత, డాక్టర్ కె.వి.సుబ్బానాయుడు, డాక్టర్ డి.శ్రీహరిబాబు, డాక్టర్ స్వర్ణగీత, ఎస్.కేశవరావు బాబు, డాక్టర్ సి.మల్లీశ్వరి ప్రమాణస్వీకారం చేయగా వారికి అభినందనలు తెలిపారు.. రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడానికి, నైతిక ప్రమాణాలను కాపాడటానికి ప్రభుత్వం కట్టు-బడి ఉందని చెప్పడానికి నిపుణులైన వైద్యులను ఏపీఎంసీ సభ్యులుగా నియమించడమే నిదర్శనం. అందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కృషి చేయాలని, వైద్య రంగాన్ని ఆదర్శనీయంగా నిలపాలని కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన సభ్యులను ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ కోరారు.
