Telangana Politics : కాంగ్రెస్‌ పాలనలో రైతుల కళ్లల్లో నీళ్లు

రజతోత్సవ సభపై వరంగల్‌ నేతలో కేసిఆర్‌ చర్చ

On
Telangana Politics : కాంగ్రెస్‌ పాలనలో రైతుల కళ్లల్లో నీళ్లు

EX KCR Discusses Silver Jubilee Celebration with Warangal Leader

కాంగ్రెస్‌ పాలనలో రైతుల కళ్లల్లో నీళ్లు

ఇలాంటి దుస్థితి వస్తుందనుకోలేదు

రజతోత్సవ సభపై వరంగల్‌ నేతలో కేసిఆర్‌ చర్చ

గజ్వెల్‌ - ప్రభాత సూర్యుడు

కాంగ్రెస్‌ పాలన అంటేనే వింతైన పాలన అని.. రాష్ట్రంలో మార్పు కోరుకున్న రైతుల కళ్లలో కన్నీళ్లే మిగిలాయని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రైతులకు ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని.. ప్రభుత్వ చర్యలతో రైతులు, వివిధ వర్గాల ప్రజలు మనోధైర్యం కోల్పోతున్నారని విమర్శించారు.KCR తెలంగాణ ప్రజానీకానికి మనోధైర్యం ఇచ్చే విధంగా బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ ఉండాలని అన్నారు. వరంగల్‌ బహిరంగ సభ తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్టా స్థాయి వరకు పార్టీ కమిటీలు వేసి.. ఆ తర్వాత శిక్షణ తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. భారాస రజతోత్సవ సభ కోసం జనం ఆతృతతో ఎదురుచూస్తున్నారని భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు.KCW పార్టీ బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారని చెప్పారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పార్టీ నేతలతో కేసీఆర్‌ మంగళవారం సమావేశమయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఎల్కతుర్తిలో బహిరంగ సభకు భూమిపూజ చేయనున్నట్లు కేసీఆర్‌ వెల్లడిరచారు. సభకు వచ్చే జనానికి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు- చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశర చేశారు. KCRTకాంగ్రెస్‌ పాలన వింతంగా ఉందని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. మార్పు కోరుకున్న రైతుల కళ్లల్లో కన్నీళ్లే మిగిలాయన్నారు. రైతులకు ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా తాను ఊహించలేదని చెప్పారు. ప్రభుత్వ చర్యలతో రైతులు, వివిధ వర్గాల ప్రజలు మనోధైర్యం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.KCRC

Views: 32

Latest News