Elections : త్వరలోనే స్థానిక ఎన్నికలంటూ ప్రచారం
మండుటెండల్లో రాజకీయ నేతలకు పరీక్ష

త్వరలోనే స్థానిక ఎన్నికలంటూ ప్రచారం
మండుటెండల్లో రాజకీయ నేతలకు పరీక్ష
త్వరలోనే స్థానిక ఎన్నికలంటూ ప్రచారం
హైదరాబాద్-ప్రభాత సూర్యుడు
త్వరలోనే స్థానిక ఎన్నికలంటూ ప్రచారం సాగుతోంది. అలాగే మంత్రివర్గ విస్తరణ కూడా జరుగనుందని ప్రచారం సాగుతోంది. అనేక హావిూలను అమలు చేశామని చెప్పుకుంటున్న అధికార కాంగ్రెస్ స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది. మొన్నటి ఫిబ్రవరిలో అని ఊరించారు. బిసి, ఎస్పీ రిజర్వేలషన్లపై హావిూలను నెరవేర్చామని అంటున్నారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది. ఇప్పుడు రాజకీయ వాతావరణం తమకు అనుకూలంగా
ఉందని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న భావనలో బిఆర్‌ఎస్, బిజెపి నేతలు ఉన్నారు. అందుకే ఏప్నిల్, మేలో స్థానిక ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్దం చేస్తున్నాయి.
మండుటెండలు తెలంగాణతో పాటు ఎపిలోనూ వివిధ పార్టీల కార్యకర్త లకు పరీక్ష పెట్టబోన్నాయి. అన్ని పార్టీలు కూడా ఆందోళనలకు సిద్దం అవుతున్నాయి. స్థానపిక ఎన్నికలు రాబోతున్న తరుణంలో అందుకు అనుగుణంగా రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఇందుకోసం
వివిధ కార్యక్రమాలను రూపొందించుకుంటున్నాయి. వచ్చే నెలలో బిఆర్‌ఎస్ వార్షికోత్సవం ఉంది. అలాగే కెటిఆర్ పాదయాత్రను ప్రకటించారు. కాంగ్రెస్ కూడా ప్రజల్లోకి వెళ్లాలని యోచిస్తోంది. ఎపిలో టిడిపి కూడా అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో పలు కార్యక్రమాలు చేయనుంది. ఈ క్రమంలో పార్టీల్లో ఉన్న కార్యకర్తలంతా ఎండల్లో పడి పోరాడాల్సి ఉంటుంది. ఎండలు ఆందోళనకరంగా పెరుగుతున్న దశలో పార్టీల కార్యక్రమాలుమరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రజలు ఇంటిపట్టున ఉండి దూరంగా ఉందా మనుకున్నా రాజకీయాల కారణంగా బయటకు రాక తప్పని పరిస్థితులు వస్తున్నాయి. వరుస ఆందోళనతో అధికార పార్టీతో పాటు అనేక పార్టీల కార్యకర్తలు నానాయాతన పడుతున్నారు. మార్చి ఎండలే కదా అని సర్దుకున్నా ఇప్పుడు మండుటెడల్లో ఆందోళనలకు దిగాల్సి వస్తోంది. ఎక్కడ వెనకబడి పోతామో అన్న భయంతో నేతలు కార్యకర్తలను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. దీనికితోడు రేపటి రాజకీయ పోరాటాలకు ఇప్పటి నుంచే అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు రూపొందిస్తున్నాయి. అన్ని పార్టీలు మళ్లీ పోటీకి సమాయత్త మవుతున్నాయి. స్థానిక గెలుపు గుర్రాలను బరిలో దించి పాగా వేసేందుకు వ్యూహారచన చేస్తున్నాయి. ఇప్పటి నుంచే పట్టుపెంచు కునేందుకు కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపిలు ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు. ఆయా పార్టీల అధిష్ఠానాలు రాబోయే ఎన్నికలపై ప్రత్యేక దృష్టిపెట్టాయి. మరోవైపు ఎండలతో కార్యకర్తలు వాపోతున్నారు. వేసవిని తలచుకుంటేనే భయం వేస్తోందని అంటున్నారు. మొత్తంగా రాజకీయాపార్టీలు తమాందోళనా కార్యక్రమాలతో ఎండలకు మించి పరీక్ష పెడుతున్నాయి. మళ్లీ పార్టీల హడావిడితో తెలుగు రాష్టాల్ల్రో అప్పుడే ఎన్నికల వేడి మొదలు కానుంది. సర్పంచ్ ఎన్నికలంటే జిల్లాల్లో రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కుతోంది. వామపక్ష నేతలు కూడా మెల్లగా తమ గళాన్ని పెంచారు. ఒకేసారి అన్ని పార్టీలు రోడ్లపైకి వస్తుండడంతో రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. అధికార పార్టీకి ధీటుగానే మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రతిపక్ష పార్టీలైన బిఆర్‌ఎస్, బీజేపీలు సిద్ధమవుతు న్నాయి. రాష్ట్ర నేతలు, మంత్రులు కావాలనే కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోటీగా జిల్లాల్లో సమావేశాలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు పార్టీల నేతలు రైతులను మోసం చేసాయని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. మరిన్ని కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లను చేసుకుంటున్నారు. మొత్తంగా అన్ని పార్టీల కార్యకర్తలు రానున్న ఎన్నికలు ఎండలను లెక్క చేయకుండా రోడ్డెక్కాల్సిన ఆగత్యం ఏర్పడిరది.