Betting App Case : పోలీసులకు సహకరించని రీతు చౌదరి
పోలీసు విచారణకు రీతుచౌదరి గైర్హాజరు

Rithu Choudary Promoting Betting Apps
పోలీసు విచారణకు రీతుచౌదరి గైర్హాజరు
కోర్టును ఆశ్రయించిన విష్ణుప్రియ
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు
బెట్టింగ్ యాప్స్‌పై విచారణ కొనసాగుతుంది. ఈక్రమంలో బెట్టింగ్ యాప్స్ వ్యవహారానికి సంబంధించి తమ ఎదుట విచారణకు రావాలంటూ రీతూ చౌదరి, విష్ణుప్రియకు ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చారు. గత గురువారం ఇద్దర్నీ కూడా పోలీసులు విచారించి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. అలాగే మరోసారి విచారణకు రావాలని ఇద్దరికి సమాచారం ఇచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు హాజరుకావాలంటూ చెప్పగా... ఇప్పటి వరకు విష్ణుప్రియ, రీతూ చౌదరి విచారణకు రాలేదు. https://youtu.be/LICNLgSOkS4 ఓవైపు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ యాంకర్ విష్ణుప్రియ మాత్రం హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై మియాపూర్ పోలీస్‌స్టేషన్‌తో పాటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో బెట్టింగ్ వ్యవహారానికి సంబంధించి రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయని, ఈ రెండిరటినీ క్వాష్ చేయాలంటూ హైకోర్టులో యాంకర్ పిటిషన్ వేశారు.
మంగళవారం మధ్యాహ్నం తర్వాత విష్ణుప్రియ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు విష్ణుప్రియ విషయంలో ముందుకు వెళ్లాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే యూట్యూబర్ రీతూ చౌదరిని కూడా విచారణకు రావాల్సిందిగా పంజాగుట్ట పోలీసులు స్పష్టం చేయగా.. ఇప్పటి వరకు కూడా ఆమె విచారణకు రాలేదు. గతంలో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినప్పుడు కూడా రీతూ చౌదరి మూడు గంటలకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని చెప్పినప్పటికీ రీతౌ చౌదరి గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో ఆమెకు మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.