Robinhood Movie : శ్రీలీల ఉంటే ఆ సినిమా ఫట్టే..

శ్రీలీలకు నిరాశను కలిగించిన రాబిన్‌హుడ్‌

On
Robinhood Movie : శ్రీలీల ఉంటే ఆ సినిమా ఫట్టే..

Actress Srileela in Robilhood Movie

శ్రీలీలకు నిరాశను కలిగించిన రాబిన్‌హుడ్‌

మూవీ డెస్క్ - ప్రభాత సూర్యుడు

తెలుగులో వరుస హిట్లతో అతి తక్కువ సమయంలోనే స్టార్‌ స్టేటస్‌ సంపాదించుకున్న యంగ్‌ హీరోయిన్‌ శ్రీలీల. బ్యాక్‌ టూ బ్యాక్‌ ఆఫర్స్‌ అందుకుంటూ టాలీవుడ్‌ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్‌ గా దూసుకుపోయింది ఈ ముద్దుగుమ్మ. ధమాకా సినిమాతో ఈ అమ్మడు క్రేజ్‌ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో తన ఎనర్జిటిక్‌ డ్యాన్సులతో అదరగొట్టింది. కానీ ఆ తర్వాత ఈ అమ్మడు ఖాతాలో అదే స్థాయిలో హిట్టు రావడం లేదు. కొన్నాళ్లుగా ఆమె చేస్తున్న ప్రతి సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడుతూనే ఉన్నాయి. sreelilaస్కంద, ఆదికేశవ, ఎక్స్‌?ట్రార్టినరీ మ్యాన్‌ ఇలా శ్రీలీల నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ప్రేక్షకులను నిరాశపరుస్తున్నాయి. ఆ తర్వాత వచ్చిన గుంటూరు కారం సినిమాతో ఓ హిట్‌ పడిరది. కానీ ఈ సినిమా శ్రీలీలకు అంతగా క్రేజ్‌ రాలేదు. ఇక గుంటూరు కారం సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్‌ తీసుకున్న శ్రీలీల.. ఇప్పుడు రాబిన్‌ హుడ్‌ సినిమాతో అడియన్స్‌ ముందుకు వచ్చింది. నితిన్‌ హీరోగా నటించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో రిలీజ్‌ రాగా.. మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సినిమాతో శ్రీలీలకు మరోసారి నిరాశే ఎదురయ్యింది. నిజానికి ఈ మూవీలో ముందుగా రష్మిక చేయాల్సింది. కానీ డేట్స్‌ అడ్జస్ట్‌ కాకపోవడంతో ఆమె స్థానంలోకి శ్రీలీల వచ్చింది. దీంతో ఇప్పుడు ఈ అమ్మడు ఖాతాలో మరో ప్లాపు వచ్చి చేరింది.

Views: 40

Latest News