Nara Lokesh campaigned for the post of Deputy CM :నారా లోకేష్‌ కు డిప్యూటీ సీఎం పదవి ప్రచారం

పవన్‌కు టీడీపీ భయపడుతోంది.. బీజేపీ ?

On
Nara Lokesh campaigned for the post of Deputy CM :నారా లోకేష్‌ కు డిప్యూటీ సీఎం పదవి ప్రచారం

నారా లోకేష్‌ కు డిప్యూటీ సీఎం పదవి ప్రచారం
విజయవాడ, - ప్రభాత సూర్యుడు

రాజకీయ పార్టీలు ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం పొత్తులు పెట్టుకుంటాయి. పైస్థాయి నాయకులు చర్చలతో చాలా ఈజీగా కలిసిపోతారు. కానీ.. గ్రౌండ్‌ లెవల్‌ క్యాడర్‌ అంతా ఈజీగా కలిసిపోరు. కానీ.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఓడిరచాలనే ఏకైక లక్ష్యంతో ఓట్లు చీలకుండా కూటమికి పడ్డాయి. అక్కడి దాకా బాగానే ఉన్నా.. తాజాగా నేతలను పోల్చి చూసే పరిస్థితి ఏర్పడిరది.చంద్రబాబు రాజకీయ, పాలన అనుభవం ఉన్న నాయకుడు. ఆయనను ఇటు జనసేన, అటు బీజేపీ క్యాడర్‌, నాయకులు గౌరవిస్తున్నారు. చంద్రబాబుతో ఇష్యూ ఏం లేదు. కానీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పవన్‌, లోకేష్‌ను పోల్చి చూస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ఈగో వార్‌ స్టార్ట్‌ అయ్యిందనే టాక్‌ వినిపిస్తోంది. ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి హోదాలో కొన్నిసార్లు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారుగతంలో మహిళలపై జరుగుతున్న దాడులు, తాజాగా తిరుపతి తొక్కిసలాట ఘటనపై పవన్‌ వ్యూహాత్మకంగా స్పందించారు. ఇది టీడీపీకి కాస్త ఇబ్బందిగా ఉన్నా.. చంద్రబాబు తన అనుభవంతో ఇష్యూ పెద్దది కాకుండా జాగ్రత్తపడి సమస్యను పరిష్కరించారు. అయితే.. పవన్‌కు టీడీపీ భయపడుతోంది.. బీజేపీ జనసేనానికి అండగా ఉంటోందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. లోకేష్‌తో పోలిస్తే.. పవన్‌ కూటమి ప్రభుత్వంలో నెంబర్‌ 2గా ఉంటున్నారనే విశ్లేణలు వినిపిస్తున్నాయి. నారా లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని.. అప్పుడే పవన్‌తో సమాన హోదా ఉంటుందనే అభిప్రాయాన్ని తెలుగు తమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కొన్నిచోట్ల గొడవలు కూడా జరిగాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల టీడీపీ నాయకుల నుంచి ఈ డిమాండ్‌ ఎక్కువగా వస్తోంది. దీన్ని అగ్ర నాయకులు పెద్దగా పట్టించుకోకపోయినా.. క్యాడర్‌ మాత్రం బలంగా కోరుకుంటోంది.వాస్తవానికి ఉప ముఖ్యమంత్రి పదవి అనేది చట్టబద్ధం కాదు. కానీ.. కూటమిలో పవన్‌ కళ్యాణ్‌కు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం ఏకంగా ఐదుగురికి డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. అంతకుముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒకరికంటే ఎక్కువ మందే ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ.. ఇప్పుడు మాత్రం పవన్‌ ఒక్కరికే ఆ పదవి దక్కిందిఇటు పవన్‌ కళ్యాణ్‌ కూడా జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. కామెంట్స్‌ చేస్తున్నారు. పార్టీ శ్రేణులను కూడా క్షేత్రస్థాయిలో అన్ని విషయాల్లో ఇన్వాల్వ్‌ చేస్తున్నారు. దీంతో కొన్నిచోట్ల టీడీపీ` జనసేన మధ్య వార్‌ జరుగుతోంది. పవన్‌ కూడా ఇటు పాలనలో స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో జనసేన క్యాడర్‌ అప్పర్‌ హ్యాండ్‌ సాధిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. టీడీపీ క్యాడర్‌ లోకేష్‌ను పవన్‌తో పోలుస్తోంది.లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే.. భవిష్యత్తులో టీడీపీ రాజకీయంగా ఇబ్బందులు తప్పవనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కానీ.. ఇటు చంద్రబాబు, అటు లోకేష్‌ ఉప ముఖ్యమంత్రి పదవిని పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. కానీ.. లోకేష్‌ మాత్రం పార్టీపై తన పట్టును క్రమంగా పెంచుకుంటున్నారు. కార్యకర్తలకు తానున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు

Views: 1

Latest News