Venu Swamy : త్వరలో సమంత, విజయ్‌ దేవరకొండ సూసైడ్‌ చేసుకోవడం ఖాయం

ప్రభాస్‌కు ఒళ్లంతా గాయాలే..అందుకే రాజా సాబ్‌ సినిమా రిలీజ్‌ ను పోస్ట్‌ పోన్‌

On
Venu Swamy : త్వరలో సమంత, విజయ్‌ దేవరకొండ సూసైడ్‌ చేసుకోవడం ఖాయం

సమంతపై వేణుస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు

మూవీ డెస్క్ - ప్రభాత సూర్యుడు

వేణు స్వామి.. పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేని పేరు ఇది. సినిమా సెలబ్రెటీల జాతకాలు చెప్పడం, రాజకీయ నాయకుల జాతకాలు చెప్పడంతో చాలా పాపులర్‌ అయ్యారు ఈయన. సెలబ్రెటీలు జాతకాలు చెప్పడంతో ఆయన సోషల్‌ మీడియాలో బాగా ట్రోల్‌ అయ్యాడు. ఇకపై సెలబ్రిటీల జాతకాలను చెప్పనంటూ కొన్ని నెలల క్రితం సంచలన ప్రకటన చేసిన వేణు స్వామీ.. మొన్నామధ్య నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంపై జోస్యం చెప్పారు. దీంతో అక్కినేని అభిమానులు గురూజీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు జర్నలిస్టు సంఘాలు కూడా స్వామీజీ పై ఫైర్‌ అయ్యాయి. ఇప్పటికే ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న వేణు స్వామి ఇప్పుడు మరోసారి వివాదాస్పద కామెంట్స్‌ చేశాడు.

తాజాగా వేణు స్వామికి సంబంధించిన ఓ ఆడియో లీక్‌ అయ్యింది. ఆ వీడియోలో మరోసారి ఆయన టాలీవుడ్‌ సెలబ్రెటీల పై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. విజయ్‌ దేవరకొండ, ప్రభాస్‌, సమంత గురించి మరోసారి ఆయన నోరు పారేసుకున్నాడు. సినిమా వాళ్లు ముగ్గురు త్వరలోనే చనిపోతారు. వారిలో ఓ హీరో, ఓ హీరోయిన్‌ కూడా ఉన్నారు అంటూ వివాస్పద కామెంట్స్‌ చేసింది. వాళ్లలో విజయ్‌ దేవరకొండ, ప్రభాస్‌, సమంత ఉంటారు అని చెప్పుకొచ్చాడు. శాస్త్రం ప్రకారం సమంత, విజయ్‌ దేవరకొండలో ఎవరో ఒకరు సూసైడ్‌ చేసుకోవడం ఖాయం.. ఈ విషయం బయటికి రావడానికి టైం పడుతుంది అంటూ నోటికొచ్చినట్టు వాగాడు. అలాగే ప్రభాస్‌ గురించి మాట్లాడుతూ.. ప్రభాస్‌కు ఒళ్లంతా గాయాలే ఆ విషయం ఎవరికి చెప్పడం లేదు. అందుకే రాజా సాబ్‌ సినిమా రిలీజ్‌ ను పోస్ట్‌ పోన్‌ చేసుకుంటూ వస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో ఈ వీడియో సోషల్‌ మీడియాతో పాటు సినీ సర్కిల్స్‌ లోనూ హాట్‌ టాపిక్‌ గా మారింది. దాంతో నెటిజన్స్‌ వేణు స్వామిపై మండిపడుతున్నారు.

Views: 112

Latest News