Gorugathupalli Village : భూపాలపల్లి అటవీ ప్రాంతంలో చిరుత సంచారం
చిరుత సంచారాన్ని ధృవీకరించని అటవీశాఖ

భూపాలపల్లి అటవీ ప్రాంతంలో చిరుత సంచారం
- ఆందోళనలో స్థానిక ప్రజానీకం
- చిరుత సంచారాన్ని ధృవీకరించని అటవీశాఖ
జయశంకర్ భూపాలపల్లి - ప్రభాత సూర్యుడు
వామ్మో.. పులి సంచరిస్తోందంటూ జిల్లాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎక్కడిదో వీడియో తెలియదుకానీ సోషల్ విూడియాలో మాత్రం వైరల్ అవుతోంది. గోరుగత్తుపల్లి శివారులోని బొక్కిచెరువు సవిూపంలో చిరుత పులి సంచరిస్తుందని పుకార్లు జోరుందు కున్నాయి. మొక్కజొన్న చేను వద్ద చిరుత పులి తిరుగుతున్న వీడియోను ఓ మహిళ రికార్డు చేసిందంటూ సోషల్ విూడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం పులి పాదముద్రలు గుర్తించాకే స్పష్టత ఇస్తామని చెబుతున్నారు. స్థానికులు మాత్రం చిరుత పులి వార్తలపై ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా చిరుత సంచారం వార్త జిల్లాలో తీవ్రం భయాందోళనకు గురిచేస్తోంది.అయితే జిల్లాలో గత 15 రోజులుగా పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఓ చోట కనిపించిందంటూ అటవీ అధికారులకు సమాచారం అందడం, వారు అక్కడకు చేరుకుని పాదముద్రలు గుర్తించేలోగా వేరే ప్రదేశానికి వెళ్లిపోవడం జరుగుతూ వస్తోంది.
గత పది రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది జిల్లాలో. ఈ క్రమంలో గోరుగత్తుపల్లికి సంబంధించిన ఓ వీడియో మాత్రం సామాజిక మాద్యమాల్లో తెగ వైరల్‌గా మారింది. ఆ గ్రామానికి చెందిన ఓ మహిళా రైతు ఈ వీడియోను చిత్రీకరించినట్లు చెబుతున్నారు. మొక్కజొన్న చేను గట్టుపై నుంచి చిరుత వెళ్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. అయితే ఈ వీడియోను చూసిన అటవీ శాఖ అధికారులు మాత్రం.. పులి సంచారాన్ని ఇంకా ధృవీకరించలేదు. ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ పులి పాదముద్రలు గుర్తించాకే నిర్దారిస్తామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. అయితే వీడియో తమ ఊరిదే అని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విషయాన్ని స్థానికులు కన్ఫామ్ చేస్తున్నప్పటికీ అటవీ శాఖ అధికారులు మాత్రం నిర్దారించడం లేదు. గత మూడు వారాలుగా ఈ ప్రాంతంలో పులి సంచరిస్తోంది. భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ్‌పూర్, కాటారం అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తూ.. వరంగల్ జిల్లా నల్లబెల్లి, మహబూబాబాద్ జిల్లా గంగారం వరకు వెళ్లి అదే పులి తిరిగి వస్తోందన్నది అక్కడి వారు చెబుతున్నారు. పులి సంచారంపై స్థానికులు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో పులి సంచారం ఉంది, అటువైపు వెళ్లవద్దని డప్పు చాటింపు వేయిస్తున్నారు. అలాగే అడవిలోకి వెళ్లే రైతులు, పశువులకాపర్లు జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.