Hydra : కబ్జాకు గురవుతున్నఇందిరమ్మ సాగర్, వేముల కత్వలను రక్షించాలి

ఇందిరమ్మ సాగర్, వేముల కత్వలను పరిశీలించిన సీపీఐ నేతలు

On
Hydra : కబ్జాకు గురవుతున్నఇందిరమ్మ సాగర్, వేముల కత్వలను రక్షించాలి

కబ్జాకు గురైన వేముల కత్వ, ఇందిరమ్మ సాగర్ చెరువులను పరిశీలిస్తున్న సిపియం నాయకులు

కబ్జాకు గురవుతున్నఇందిరమ్మ సాగర్, వేముల కత్వలను రక్షించాలి
 
- రంగారెడ్డి జిల్లా సీపీఐ ప్రధాన కార్యదర్శి పగడాల యాదయ్య 
- ఇందిరమ్మ సాగర్, వేముల కత్వలను పరిశీలించిన సీపీఐ నేతలు 

అబ్దుల్లాపూర్ మెట్ - ప్రభాత సూర్యుడు

చెరువులు, కుంటలు యదేఛ్చగా కబ్జాలకు గురవుతున్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సీపీఎం రంగా రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల యాదయ్య, అబ్దుల్లాపూర్మెట్ మండల కార్యదర్శి ఏర్పుల నరసింహ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని అనాజ్ పూర్ గ్రామంలో ఉన్న వేముల కత్వ, ఇంద్రమ్మ సాగర్ లను శుక్రవారం జిల్లా నాయకులు పరిశీ లించారు. రెండు చెరువుల  రియల్ ఎస్టేట్ వ్యా పారస్తులు అక్రమంగా వేస్తున్న రోడ్లను గుర్తించి సిపియం నాయకులు ఇరిగేషన్ అధికారులను పిలిపించి పనులను నిలిపివేయించారు.WhatsApp Image 2025-04-11 at 4.45.32 PM (1)

ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య మాట్లాడుతూ.. పర్యావరణాన్ని రక్షించి చెరువు కత్వను కబ్జాదారుల నుంచి కాపాడాలన్నారు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి 300 ఎకరాల భూమిని చదును చేస్తూ నాలా కన్వెన్షన్, హెచ్ఎండీఏ, మైనింగ్, ఇరిగేషన్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా విల్లాస్ నిర్మిస్తున్నారని ఆరోపించారు. అనాజ్పూర్ గ్రామానికి జీవనాధారమైన ఇందిరమ్మ సాగర్, వేముల కత్వను ఇప్పటికే ఓ పక్క కొందరు ప్రహరీ నిర్మించారన్నారు. ప్రస్తుతం చదును చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎఫ్ టి ఎల్,  బఫర్ జోన్లలో గుట్టలను ధ్వంసం చేసి రాళ్లను చెరువులో వేస్తూ పూడ్చివేస్తున్నారని అన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా భారీ రోడ్డు వేస్తున్నా అధికా రులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.WhatsApp Image 2025-04-11 at 4.45.32 PM

ఈ వెంచర్ యాజమాన్యం ప్రభుత్వ అండతో విచ్చలవిడిగా కబ్జాలు చేస్తూ అటువైపు ఎవ రైనా వస్తే బెధిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. బఫర్జోన్లో అక్రమంగా రోడ్డు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి నర్సింహ, నాయకులు ముత్యాలు, జంగయ్య, శివకుమార్, మహే శ్వరం లింగస్వామి, శ్రీనివాస్, రైతులు వెంకటేశ్, మహేశ్, బాల్ రాజ్, ఐలయ్య, ప్రణయ్ ఉన్నారు. 

Views: 251

Latest News