IPL 2025 : క్రికెట్ ల‌వ‌ర్స్‌కి గుడ్ న్యూస్.. పీవీఆర్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు

ప్ర‌ముఖ‌ మల్టీప్లెక్స్‌ సంస్థ పీవీఆర్‌ సినిమాస్ మూవీ ల‌వ‌ర్స్‌కి అదిరిపోయే ఆఫర్‌

On
IPL 2025 : క్రికెట్ ల‌వ‌ర్స్‌కి గుడ్ న్యూస్.. పీవీఆర్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు

IPL Team with Tropy

క్రికెట్ ల‌వ‌ర్స్‌కి గుడ్ న్యూస్.. పీవీఆర్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు

హైదరాబాద్  - ప్రభాత సూర్యుడు

ప్ర‌ముఖ‌ మల్టీప్లెక్స్‌ సంస్థ పీవీఆర్‌ సినిమాస్ మూవీ ల‌వ‌ర్స్‌కి అదిరిపోయే ఆఫర్‌లు ప్రకటిస్తు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇక తాజాగా ఐపీఎల్ ప్రారంభ‌మ‌వుతుండ‌డంతో క్రికెట్‌ను ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల కోసం మ‌రో ఆఫ‌ర్‌తో ముందుకు వ‌చ్చింది. నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండ‌టంతో లైవ్ మ్యాచ్‌ల‌ను పీవీఆర్‌లో వీక్షించ‌వ‌చ్చ‌ని తెలిపింది. దీనికోసం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో ఒప్పందం చేసుకున్న‌ట్లు తెలిపింది. దేశంలోనే 30 న‌గ‌రాల్లో ఈ సేవ‌లు అందుబాటులో ఉండ‌గా.. వీకెండ్ మ్యాచ్‌ల‌తో పాటు ప్లేఆఫ్‌లను మ్యాచ్‌ల‌ను థియేట‌ర్‌ల‌లో ప‌దర్శించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.1200-675-21473518-thumbnail-16x9-t20-pvr

ఈ విష‌యంపై పీవీఆర్‌ ఐనాక్స్‌ రెవెన్యూ మరియు ఆపరేషన్స్‌ సీఈఓ గౌతమ్‌ దత్తా మాట్లాడుతూ.. అత్యుత్తమ విజువల్స్, సౌండ్, సీటింగ్ వ్యవస్థతో మ్యాచ్‌ను స్టేడియంలో చూసినట్లే అనుభూతిని అందిస్తామని తెలిపాడు. సినిమాను క్రికెట్‌ను ఒక వేదిక‌పై తీసుకురావ‌డం ఎంతో ఆనందంగా ఉందని గత సంవత్సరం క్రికెట్‌ మ్యాచ్‌ల ప్రసారానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, అందువల్ల ఈ ఏడాది కూడా ప్రీమియం క్వాలిటీ అనుభవాన్ని అందించేందుకు ప్రసారం చేయాలని నిర్ణయించామని వివరించారు. ఇండియాలోని ప్ర‌ధాన మెట్రో న‌గ‌రాల‌తో పాటు టైర్‌-2, టైర్‌-3 నగరాల్లోనూ ఈ స్క్రీనింగ్‌లు జరగనున్నట్లు పీవీఆర్‌ ఐనాక్స్‌ తెలిపింది. మ‌రిన్ని వివ‌రాల కోసం పీవీఆర్ వెబ్‌సైట్‌ను విజిట్ చేయ‌డంటూ సీఈఓ గౌతమ్‌ దత్తా వెల్ల‌డించాడు. ఐపీఎల్ 18వ సీజ‌న్ దాదాపు 2 నెల‌ల పాటు జ‌ర‌గ‌నుంది.. గ‌త ఏడాది కేకేఆర్ ఛాంపియ‌న్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. ఈ సీజ‌న్‌లో మొద‌టి మ్యాచ్ కేకేఆర్‌, ఆర్‌సీబీ మ‌ధ్య నేడు సాయంత్రం 7గంట‌ల‌కు ప్రారంభం కానుంది. 

Views: 5

Latest News