RabinHood : డెవిడ్ వార్నర్ కు శ్రీలీల ** పాఠాలు
నితిన్ సినిమాలో డేవిడ్ వార్నర్

నితిన్ సినిమాలో డేవిడ్ వార్నర్
వార్నర్‌కు తెలుగు క్లాసులు చెప్పిన శ్రీలీలమూవీ డెస్క్ - ప్రభాత సూర్యుడు
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు తెలుగు క్లాసులు తీసుకున్నారు నటులు నితిన్, శ్రీలీల. వీరిద్దరు జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మువీ మేకర్స్ నిర్మిస్తుంది. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, డేవిడ్ వార్నర్, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల హైదారాబాద్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు క్రికెటర్ డేవిడ్ వార్నర్ ముఖ్య అతిథిగా వచ్చి సినిమా విజయవంతం కావాలని కోరుకోవడంతో పాటు తెలుగులో మాట్లాడి అందరిని అలరించారు. అయితే డేవిడ్ తెలుగులో మాట్లాడటానికి నితిన్, శ్రీలీల ఏ విధంగా సాయం చేశారో చూపిస్తూ.. ఒక ఫన్నీ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. తెలుగు నేర్చుకుంటున్న డేవిడ్ వీడియోను మీరు చూసేయండి.