ఓ వైపు చలి.. మరో వైపు వైరస్‌

On
ఓ వైపు చలి.. మరో వైపు వైరస్‌

ఓ వైపు చలి... మరో వైపు వైరస్‌

హైదరాబాద్‌, జనవరి 8, ప్రభాత సూర్యుడు

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత తగ్గలేదు. రోజురోజురోకూ కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.మరోవైపు హెచ్‌ఎంపీవీ వైరస్‌ భయపెడుతుంది. చలికాలంలో వైరస్‌ వ్యాప్తి చెందుతుందన్న భయంతో ఈ చలి ఎప్పుడు తగ్గుతుందా? అని అందరూ వెయిట్‌ చేస్తుంటారు. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు వణికిపోతున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి ఉదయం పది గంటల వరకూ చలి తీవ్రత అస్సలు తగ్గడం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. ఉదయం విధులకు వెళ్లాల్సిన వారు సయితం చలి తీవ్రతకు ఇబ్బంది పడుతున్నారు. గీజర్ల వాడకం పెరిగిపోయింది. కరెంట్‌ బిల్లు కూడా తడిసి మోపెడవుతుంది. తెలంగాణలో చలి తీవ్రత బాగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మెదక్‌ లో అత్యల్పంగా 9.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారుల తెలిపారు. పటాన్‌చెరులో 11.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఆదిలాబాద్‌, కుమురం భీం జిల్లాల్లోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. చలి మంటలతో చలి నుంచి అనేక మంది కాపాడుకుంటున్నారు. అయితే చలి తీవ్రత కారణంగా అనేక మంది వ్యాధుల బారిన పడుతున్నారు.https://www.prabhathasuryudu.com/politics-politics/now-the-reins-of-brs-belong-to-harish-rao/article-194 జలుబు, దగ్గు, జ్వరం వంటి రోగాలతో ఆసుపత్రులకు వస్తున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులన్నీ ఇటువంటి రోగాలతో వస్తున్న వారితో కిటకిట లాడుతున్నాయని వైద్యనిపుణుల చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఏజెన్సీ ఏరియాలోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలి చంపేస్తుంది. ఏపీలోని ఏజెన్సీల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో పాటు హెచ్‌ఎంపీవీ వైరస్‌ ఈ కాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని భావించి ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. హైదరాబాద్‌ వంటి నగరంలో ఉదయం పది గంటల వరకూ వీధులన్నీ నిర్మానుష్యంగాకే కనిపిస్తున్నాయి. చలి దెబ్బకు వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయని చిరు వ్యాపారులు చెబుతున్నారు. చలికి పండ్ల విక్రయాలు కూడా తగ్గాయంటున్నారు. మరో నాలుగు రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నా, శివరాత్రి వరకూ చలి ఇలాగే ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు.

Views: 18
Tags:

Latest News

AMARAVATHI NEWS 2025 :లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ! AMARAVATHI NEWS 2025 :లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ!
లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ! అమరావతి  - ప్రభాత సూర్యుడు తమిళనాడుకు చెందిన బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామిని అందరూ లాయర్ అనుకుంటారు....
DELHI ELECTION UPDATE : ఢిల్లీ ఎలక్షన్స్
AP HEALTH ALRET 2025 : ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి
AP NEWS UPADTE : డయాగ్నొస్టిక్ సెంటర్‌లో దారుణం.
AP Government Introduces New Guidelines :భవన నిర్మాణాలపై కొత్త మార్గదర్శకాలు
TELANGANA NEWS UPDATE 2025  :రీజనల్‌ రింగ్‌ రొడ్‌ కోసం నిధుల కసరత్తు
TG NEWS 2025:తెలంగాణ గట్టుపై ఆసక్తికర రాజకీయాలు