GANGS OF KUMBH MELA :మహాకుంభమేళలో తొక్కిసలాట...
పెను విషాదం
మహాకుంభమేళలో తొక్కిసలాట...
లక్పో - ప్రభాత సూర్యుడు
మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్‌రాజ్‌లోని సెక్టార్ 2 సంగమం దగ్గరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఒక్కసారిగా భక్తుల తాకిడి పెరగడంతో.. అక్కడ బారికేడ్లు విరిగిపోయాయి. దీంతో తొక్కిలాసట జరిగి పలువురు భక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, పోలీసులు స్పందించి.. వారిని అంబులెన్సుల్లో సవిూప ఆస్పత్రులకు తరలించారు. ఎంతమంది గాయపడ్డారనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. సంగమం దగ్గర రద్దీ పెరగడంతో తొక్కిసలాట జరిగిందని భక్తులు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత పుణ్యస్నానాలను రద్దు చేస్తున్నట్లు అఖండ పరిషత్ ప్రకటించింది.ఈ ఘటన గురించి సమావేశం తెలిసిన వెంనటే ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడారు. మహా కుంభమేళాలో పరిస్థితి గురించి ఆరా తీశారు.. అక్కడి పరిణామాలపై వెంటనే సవిూక్షించి, అవసరమైన తక్షణ సహాయక చర్యలకు ఆదేశించారు. ఇదిలా ఉంటే.. అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందని స్పెషల్
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆకాంక్ష రాణా తెలిపారు. క్షతగాత్రులకు ఆస్పత్రుల్లో వైద్యం కొనసాగుతోందన్నారు.ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళాలో మౌనీ అమావాస్యకు ప్రత్యేకత ఉంది. ఈ క్రమంలో భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో యూపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. జనవరి 13 నుంచి కుంభమేళా మొదలుకాగా.. ఇప్పటి వరకు 15కోట్లమంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు చెబుతున్నారు. అయితే మౌనీ అమావాస్య సందర్భంగా బుధవారం ఒక్కరోజే 10 కోట్లకుపైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా.. అందుకే త్రివేణీసంగమ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్‌గా ప్రకటించారు అధికారులు. మౌనీ అమావాస్య సందర్భంగా రైల్వేశాఖ మొత్తం 360 రైళ్లను కూడా నడుపుతున్నారు.
ఈ క్రమంలో యూపీ ప్రభుత్వం 1 నుంచి 8 తరగతుల స్థానిక విద్యార్థులకు మూడు రోజులు సెలవులు ప్రకటించింది. అంతేకాదు మౌనీ అమావాస్యకు అలహాబాద్ హైకోర్టు సైతం బుధవారం సెలవుగా ప్రకటించింది. ఈ సందర్భంగా అధికారులు భక్తులకు కొన్ని ప్రత్యేక సూచనలు చేశారు. భక్తులు నిర్దేశించిన మార్గాల్లోనే ఘాట్‌లకు వెళ్లాలని, స్నానాల తర్వాత గుంపులుగా గుమికూడి ఎక్కువసేపు ఉండవద్దని రిక్వెస్ట్ చేశారు. భద్రతా నియమాలు పాటించి తమతో సహకరించాలి అన్నారు.