ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి

Supreme Court's anger against Assam state government

On
ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి

అక్రమవలసదారులను పంపించేయండి

గౌహాతి-ప్రభాత సూర్యుడు

అస్సాం రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడ్డ వారిని వారి స్వస్థలాలకు పంపించి వేయకుండా చాలా కాలంగా నిర్బంధించడం పట్ల ఫైర్‌ అయింది. వారందరినీ తిరిగి పంపించేందు కోసం శుభ ముహూర్తం కోసం వేచి చూస్తున్నారా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరింది. వెంటనే వారందరినీ వారి స్వస్థలాలకు పంపించి వేయమంటూ ఆదేశాలు జారీ చేసింది. అందుకోసం రెండు వారాల సమయం కూడా కేటాయించింది. అస్సాం సహా మరికొన్ని రాష్ట్రాల్లోకి విదేశాల నుంచి అనేక మంది వలసగా వస్తున్నారు. ఇటీవల కాలంలో అక్రమ చొరబాట్లు ఎక్కువ కాగా.. అస్సాం సర్కారు చర్యలు చేపట్టింది. ఈక్రమంలోనే మొత్తం 270 మంది అక్రమ వలసదారులను అరెస్ట్‌ చేసింది. ఆపై వారిని నిర్బంధ కేంద్రాల్లో బంధించింది. అయితే గతేడాది డిసెంబర్‌ 9వ తేదీన ఇందులో అనేక మందిని వారి స్వస్థలాలకు పంపించి వేసింది. కానీ 63 మందిని మాత్రం అలాగే ఉంచింది. ఇప్పటికీ వీరంతా నిర్బంధ కేంద్రాల్లోనే ఉంటున్నారు. దీనిపై ఇప్పటికే సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు అయిందిఅక్రమంగా అస్సాం రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న వారిని దేశాలకు పంపాలంటూ వచ్చిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. ఈక్రమంలోనే సుప్రీం కోర్టు అస్సాం రాష్ట్ర సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరైనా దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని తెలిసిన వెంటనే వారిని తిరిగి వారి స్వస్థలాలకు పంపించి వేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే నిర్బంధంలో ఉన్న విదేశీయులను వారి దేశాలకు పంపమని చెబితే.. వారు చిరునామా తెలియదని చెప్పి.. తరలింపు ప్రక్రియ ప్రారంభించడానికి నిరాకరిస్తున్నారంటూ మండి పడిరది.చిరునామాలు తెలియవనే కారణంతో వారిని జీవితాంతం నిర్బంధ కేంద్రాల్లోనే ఉంచలేము కదా అంటూ అస్సాం సర్కారుకు తెలిపింది. వారికి వారి చిరునామాలు తెలిసిన తెలియకపోయినా.. అవి మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. చొరబాటు దార్లను పంపడం కోసం విూరేవిూ ముహూర్తం చూడడం లేదు కదా అంటూ ప్రశ్నించింది. అలాగే నిర్బంధ కేంద్రాల్లో ఉంచిన 63 మంది విదేశీయులను రెండు వారాల్లోగా పంపించి వేయాలంటూ జస్టిస్‌ అభయ్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది.

Views: 1

Latest News

ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి
అక్రమవలసదారులను పంపించేయండి గౌహాతి-ప్రభాత సూర్యుడు అస్సాం రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడ్డ వారిని వారి స్వస్థలాలకు పంపించి...
AP POLITICS 2025 :మున్సిపాల్టీల్లో పట్టించుకోని కేడర్‌
TG RATION CARD UPDATE :కొత్త కార్డులతో పెరిగిన బియ్యం కోట...
TELANGANA AIRLINE UPDATE 2025 :కొత్తగూడెం ఎయిర్‌ పోర్టుకు లైన్‌ క్లియర్‌
AMARAVATHI NEWS 2025 :లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ!
DELHI ELECTION UPDATE : ఢిల్లీ ఎలక్షన్స్
AP HEALTH ALRET 2025 : ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి