Environment Damages : పర్యావరణ విధ్వంసం !
గ్రామాల్లో ఇంటిముందున్న చెట్లు నరికివేత

cutting trees and damaging environment
పర్యావరణ విధ్వంసం !
గ్రామాల్లో ఇంటిముందున్న చెట్లు నరికివేత
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు
దేశంలో ఎండలు ముదరుతున్నాయి. పట్టణాల్లో ఎండల తీవ్రత తీవ్రంగా ఉంటోంది. గ్రామాల్లోనూ ఎండలు మంటపుట్టిస్తున్నాయి. కోతుల బెడద కారణంగా గ్రామాల్లో ఇంటిముందున్న చెట్లను నరికి వేస్తున్నారు. కోతుల బెడ నుంచి ఇప్పటికి రక్షణకు కార్యాచరణ కానరావడం లేదు. అడవులను వదిలి అవి గ్రామాల్లో తిష్టవేశాయి. ఇక ప్రజలు మొక్కల పెంపకాన్ని వదిలి చల్లదనం కోసం కూలర్లు, ఎసిలు వాడుతున్నారు. దీంతో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఇదే సందర్భంలో కాలుష్యాన్ని కొని తెచ్చకుంటున్నాం. మొక్కలు నాటడం,పర్యావరణాన్ని కాపాడుకోవడం అన్న విషయాలను పక్కన పెట్టారు. ఇదంతా ప్రభుత్వాల పని అన్నట్లుగా ప్రజల భావన ఉంది. అందమైన ఇల్లు కట్టుకుంటున్న వారు సైతం నాలుగు మొక్కలు నాటాలన్న స్పృహ లేకుండా పోతున్నది. మొక్కలు నాటేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలు ఫోటోలకు పోజులిచ్చే కార్యక్రమంగా మారింది. తమ ఇళ్లల్లోనే ఓ మొక్కను నాటి గ్రీన్ ఛాలెంజ్ అంటూ ఇంతకాలం ప్రచారం చేసుకున్నారు. నిజానికి గ్రీన్ ఛాలెంజ్ అంటే గ్రామాల రూపురేఖలు మారాలి. కానీ అలా జరగడం లేదు.
హరితహారంలో 200 కోట్లమొక్కలు నాటామిన ఘనంగా చెప్పిఉకున్న బిఆర్‌ఎస్ పాలకులు వాటి ఆనవాళ్లు ఎక్కడో చూపితే బాగుండేది. అలా జరిగితే కనీస మార్పు వచ్చి ఉండేది. చంద్రబాబు ఉమ్మడి ఎపిలో ఇలాంటి ప్రచారాలే చేసినా ఎక్కడా మొక్కల జాడలేదు. ప్రస్తుత పరిస్తితులు చూస్తుంటే ఇదంతా మనకుగా మనం చేసుకున్న పర్యావరణ విధ్వంసానికి ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పు కోవాలి. అడవులను నరకడం, కాంక్రీట్ జంగల్‌ను పెంచడం, మొక్కల పెంపకాన్ని విస్మరించడం, భూగర్భ జలాలను తోడేయడం, ఇసుకను తవ్వితీయడం వంటి అనేకానేక చర్యలు పర్యావరణ విధ్వంసానికి కారణ మవుతున్నాయి. వాగులూవంకల జాడలేకుండా పోయింది. కొండలు, గుట్టలను తవ్వేస్తున్నాం. దీనికితోడు పర్యావరణ విధ్వంసానికి తోడ్పడే ప్లాస్టిక్ విపరీతంగా వినియోగిస్తున్నాం. ప్లాస్టిక్ ఎంతటి విధ్వంసం సృష్టిస్తుందో ఎండలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏటా విధ్వంసం జరుగుతున్నా దానిని అడ్డుకునే కఠిన చర్యలను అవలంబించడం లేదు. ఎవరికి వారు మాకేంటిలే అన్న ధోరణిలో ఉన్నారు. ఇవే మనలను అనేకానేక రోగాలకు కారణం చేస్తున్నాయి.
అంటువ్యాధుల నివారణకు పరిశుభ్రత ముఖ్యమని హెచ్చరి స్తున్నా ప్రజలు చలించడం లేదు. దశాబ్దాలుగా దేశంలో పర్యావరణ హితమైన చర్యలకు పాలకులు కట్టుబడకపోవడం వల్ల పచ్చదనం మాయమయ్యింది. పచ్చదనం అన్నది లేకుండా పల్లెల్లో ఉన్న చెట్లను ఎక్కడిక్కడ నరికి వేశారు. గతంలో ఇంటిముందు ఉండే చెట్లను కూడా డబ్బుకోసం అమ్ముకుంటున్నారు. ఇప్పుడు చాలా గ్రామాల్లో కోతుల బెడద కారణంగా చెట్లను తెగనరికి వేస్తున్నారు. అందుకే తెలుగు రాష్టాల్రు ఎండవేడిమికి అతలాకుతలం అవుతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగి పోతున్నాయి. మండే ఎండలకు తోడు పలు రాష్టాల్ల్రోను తాగునీటికి కటకట ప్రారంభం అయింది. మూడునుంచి నాలుగు డిగ్రీలు సాధారణ ఉష్ణోగ్రతలకు అదనంగా నమోదవు తుండటంతో ప్రజలు బేజారెత్తుతున్నారు. ఉదయం నుండే మొదలవుతున్న ఎండవేడిమి సాయంత్రం అయినా ఎక్కడా తగ్గకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో మన వాతావరణంలో మార్పులు రావడం లేదు. అకాల వర్షాలు..తట్టుకోలేని ఎండలు..తట్టుకోలేని చలిగాలులు మనలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పాలకులకు ఇవేవీ పట్టడం లేదు. ఎందుకంటే ఉన్నన్నాళ్లూ పదవి అనుభవించి.. తదుపరి ఏమైతే మాకేంటన్న ధోరణిలో ఉన్నారు. కోట్లాదిమంది చేస్తున్న విధ్వంసం అంటే ప్లాస్టిక్ వాడిపడేం, చెత్తాచెదారం తీసివేయడం వేలల్లో ఉన్న పారిశుద్య సిబ్బందికి సాధ్యం కాదు. కనీసం ఇక్కడైనా ప్రజలను కట్టుబాట్లు పెట్టివుంటే బాగుండేది. ప్రజలు పారిశుధ్య పనులు లాంటివి ఎందుకనో చేయడం లేదు. దీంతో కాలుష్యం మళ్లీ పెరుగుతోంది. ఎక్కడిక్కడ చెత్తకుప్పలు పేరుకు పోతున్నాయి. ప్లాస్టిక్ వాడకంతో కాలువల్లో అవన్నీ నిండి మురుగునీటి పారుదల అస్తవ్యస్తంగా తయారయ్యింది. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజలు కూడా చెత్తను బయటకు విసిరేసి చోద్యం చూస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ తమ బాధ్యత కాదన్న రీతిలో కాలం గడిపేస్తున్నారు. చెత్త పేరుకుపోయిందని ..అందుకు ప్రభుత్వానిదే బాధ్యతన్నట్లుగా దీరాలు తీస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిషేధం లాంటి విషయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా పట్టింపు లేకుండా ఉన్నాయి. అందుకే ఏటా మొక్కలు నాటుతున్నా..భూగర్బ జలాలు ఇంకేలా చేస్తున్నా.. ఏయేటికాయేడు దేశంలో ఎండలు మండి పోతున్నాయి. పర్యావరణ విధ్వంసం పై దృష్టి పెట్టకపోవడంతో భానుడు చెలరేగిపోతున్నాడు. ఎండ వేడిమి, వడగాడ్పులతో ప్రజలు అల్లాడి పోతున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ యేడు చలికాలం వణికిస్తే..ఎండాకాలం ఉడికిస్తోంది. ఇలాంటి విపరీత వాతావరణ పరిస్థితులకు మనం చేస్తున్న విధ్వంసం కారణమని గుర్తించడం లేదు. పాలకులతో పాటు.. ప్రజలు కూడా ఇందుకు బాధ్యులే. కొన్ని రోజులుగా క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. గాలిలో తేమ శాతం తగ్గిపోతోంది. మేఘాలు తొలగిపోయి పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడడంతో సూర్యుని కిరణాలు నిటారుగా తాకుతుం డటంతో రేడియేషన్ పెరిగి భూమి బాగా వేడెక్కి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మే వరకు ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. దీనిని కనీసం కొంతయినా తగ్గించడానికి కొంతమేరకు అయినా పరిసరాల పరిశుభ్రతను అలవాటు చేసుకోవాలి. ఇందుకోసం నిరంకుశంగా అయినా ప్రభుత్వాలు ప్రజలను హెచ్చరించాలి. ప్రచండ భానుడి ప్రతాపానికి దేశం అల్లాడుతోందని ఊరుకుంటే ఇకముందు కూడా ఇలాగే ఉంటుంది. ప్రధానంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మంచినీటి సమస్య కూడా తీవ్రం అయ్యింది. ఇలాగే మనం ముందుకు సాగితే దేశం ఎడారిగా మారుతుందనడంలో సందేహం లేదు. ఏటా ఎండాకాలం బాధలను వానాకాలంటో గుర్తుంచుకోక పోవడం వల్ల మంచినీటి సమస్యలు పునరావృతం అవుతున్నాయి. తాగునీరు కాదుకదా రోజువారీ వాడకానికి సరిపడా నీటికి కూడా కటకట తప్పడం లేదు. ప్రధాన జలాశయాలు అడుగంటి పోవడంతో భూగర్భ జలాలు పాతాళానికి చేరుకుంటున్నాయి. పాలకులు కూడా కఠినంగా చర్యలు తీసుకుని పర్యావరణ విధ్వంసాన్ని ఆపకపోతే రానున్న రోజులు మరింత భయంకరంగా ఉండడం ఖాయమని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తు న్నారు. కనీసం ఒక్కొక్కరు ఒక్కో మొక్క నాటుతూ పోయినా కొంతయినా ఉపశమనం లభించేది. ప్రభుత్వాలను తిడుతూ కూర్చునే బదులు మన ఇంటినుంచే పరిశుభ్రత అన్నది అలవాటు కావాలి.