Big Breaking : హీరోయిన్ తమన్నా, కాజల్ అగర్వాల్ అరెస్ట్ ?

భారీ ఎత్తున క్రిప్టో కరెన్సీ స్కాం | ఎరక్కపోయి ఇరుక్కున్నారు

On
Big Breaking : హీరోయిన్ తమన్నా, కాజల్ అగర్వాల్ అరెస్ట్ ?

వాణిజ్య ప్రకటనలను తెచ్చిన కష్టాలు
కాజల్‌, తమన్నాలను విచారించనున్న పోలీసులు

ప్రభాత సూర్యుడు - పొదుచ్చేరి

కాసులకు ఆశపడి స్టార్స్‌ చేసే కొన్ని ప్రకటనలు వారికి ఊహించని కష్టాలను కొని తెచ్చిపెడతాయి. ఇప్పటికే పలువురు హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్‌ ఆర్టిస్టులు కూడా ఇలాంటి సమస్యలలో చిక్కుకున్నారు. తాము ప్రచారం చేసే ప్రాడక్ట్‌తో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ముందు ఊహించుకోకుండా వీరు ఆయా ప్రకటనల్లో పాల్గొనడమే ఇందుకు కారణం.hq720 (12) నిజానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ గా అంగీకార పత్రాన్ని సమర్పించేప్పుడే ఆ ప్రొడక్స్ట్‌ లేదా ప్రాజెక్ట్‌ వల్ల వినియోగదారులు నష్టపోతే తమకు సంబంధం లేదనే క్లాజ్‌ ను చేర్చికానీ కొందరు సైన్‌ చేయడం లేదు. కానీ అంతలోతుగా వివరాలను అధ్యయనం చేయకుండా చాలామంది హీరోయిన్లు రెమ్యూనరేషన్‌ కు ప్రాధాన్యం ఇచ్చి... వాణిజ్య ప్రకటనలు చేసేసి ఆపైన ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఆ జాబితాలోకి కాజల్‌ అగర్వాల్‌, తమన్నా భాటియా పేర్లు కూడా చేరాయి. పుదుచ్చేరికి చెందిన ఓ సంస్థ క్రిప్టో కరెన్సీ లో పెట్టుబడులు పెడితే అధిక లాభం పొందవచ్చంటూ కొందరిని తన బుట్టలో వేసుకుంది. దాదాపు పదిమంది ఈ సంస్థలో 2.40 కోట్లను మదుపు చేశారు.Tamannaah_Bhatia_Kajal_Aggarwal_1709534262038_1709534270952 అయితే ఆ తర్వాత తాము మోసపోయామంటూ ఘొల్లుమంటున్నారు. ఈ విషయమై లాస్‌ పేట్టైకు చెందిన అశోకన్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సంబంధిత వ్యక్తులను పోలీసులు విచారించడం మొదలు పెట్టారు. ఈ సంస్థ 2022లో కోయంబత్తూరులో కార్యాలయం ప్రారంభించినప్పుడు అతిథిగా తమన్నా హాజరైంది. అలానే ఆ తర్వాత మహాబలిపురంలోని ఓ స్టార్‌ హోటల్‌ లో జరిగిన ప్రోగ్రామ్‌ కు కాజల్‌ వెళ్ళింది. ఇంతేకాకుండా ముంబైలోని ఒక ఓడలో భారీ పార్టీని సదరు సంస్థ నిర్వహించి, అక్కడ కూడా వేలాది మంది నుండి బోలెడంత డబ్బును సేకరించింది.tammana and kajol ఇప్పటికే ఈ సంస్థకు చెందిన నితీశ్‌ జెయిన్‌, అరవింద్‌ కుమార్‌ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందులో భాగంగా సంస్థ కార్యక్రమాలలో పాల్గొన్న కాజల్‌, తమన్నాలనూ కూడా విచారించాలని పోలీసులు భావిస్తున్నారట. తమ సమయాన్ని లక్షల రూపాయల్లోకి మార్చేసుకుని, సొమ్ము చేసుకుంటున్న కథానాయికులు... ఇప్పుడు పోలీసుల విచారణ కోసం సమయం కేటాయించాల్సిన రావడం చిత్రమే.

Views: 106

Latest News