TELANGANA FILM NEWS : మారుతోన్న టాలీవుడ్
Rajamouli's Pan World movie with Mahesh Babu is the focus of everyone's attention.

మారుతోన్న టాలీవుడ్
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు
ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఎంతమంది ఎన్ని విజయాలు సాధించినా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి అనేది పెరగాలంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మన వైపు తిప్పుకోవాల్సిన అవసరమైతే ఏర్పడిరది. సరిగ్గా ఇదే సమయంలో రాజమౌళి లాంటి దర్శకుడు బాలీవుడ్ ప్రేక్షకులను మన వైపు తిప్పే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. ఇక ఆయన వేసిన బాటలోనే ప్రతి దర్శకుడు నడుస్తూ ముందుకు సాగడమే కాకుండా భారీ విజయాలను కూడా అందుకోవడం విశేషం?ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగింది. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాల హవా ఏంటో చూపించిన రాజమౌళి ఆ తర్వాత చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు. ఇక రీసెంట్ గా పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ నుంచి వచ్చే సినిమాల స్టామినా ఏంటో బాలీవుడ్ వాళ్లకు మరోసారి తెలిసేలా సైతం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ చేశాడు. ఇక సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా 1850 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి తెలుగు సినిమా హవా ఎలా ఉంటుందో రుచి చూపించాడు. తెలుగు సినిమా అంటే ఇప్పుడు ఒక స్టాండర్డ్ అయితే ఉంది. పాన్ ఇండియాలో మన సినిమాల కోసం ఎదురుచూసే అభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి సందర్భంలో కొంతమంది దర్శకులు మాత్రం మన తెలుగు సినిమాలు రొటీన్ రొట్ట కామెడీ సినిమాలే అంటూ ఇప్పుడు కూడా అవే కమర్షియల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.ఒకవైపు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకోవడానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందుకు దూసుకెళ్తుంటే, వీళ్ళు ఇంకా రొటీన్ కమర్షియల్ సినిమాలను చేస్తూ ఇండస్ట్రీని మరోసారి వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం ఆ దర్శకుల మండి పడుతున్నారు.ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో మనవాళ్లకు ఒక గొప్ప గుర్తింపైతే ఉంది. ఇక విూదట కూడా అదే గౌరవాన్ని కాపాడుకుంటూ వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందించినట్టైతే ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలేది మనమే అని గర్వంగా చెప్పుకోవడంలో ఎంత మాత్రం సందేహమైతే లేదు.ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా విూదనే అందరి దృష్టి అయితే ఉంది. సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంలో ఈ సినిమా కోసంఈ సినిమా 2027 వ ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా కనుక 3,000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టినట్టైతే ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆపేవారు మరెవరు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు?
Related Posts
Latest News
