Chennai News: ముఖ్యమంత్రి ఎమ్‌కె స్టాలిన్‌ గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిపై తీవ్ర విమర్శలు

రాష్ట్ర అభివృద్ధిని చూసి గవర్నర్‌ జీర్ణించుకోలేక పోతున్నారు

On
Chennai News: ముఖ్యమంత్రి ఎమ్‌కె స్టాలిన్‌ గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిపై తీవ్ర విమర్శలు

రాష్ట్ర అభివృద్ధిని చూసి గవర్నర్‌ జీర్ణించుకోలేక పోతున్నారు
             ముఖ్యమంత్రి ఎమ్‌కె స్టాలిన్‌ తీవ్ర విమర్శలు
చెన్నయ్‌ - ప్రభాత సూర్యుడు

డీఎంకె నేతృత్వం లోని తమిళనాడు ప్రభుత్వం , గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి మధ్య కొంతకాలంగా బేధాభిప్రాయాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమం లోనే మరోసారి గవర్నర్‌పై ముఖ్యమంత్రి ఎమ్‌కె స్టాలిన్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఆయన జీర్ణించుకోలేక పోతున్నారని వ్యాఖ్యానించారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగిన తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ గవర్నర్‌ అసెంబ్లీకి వచ్చినా ప్రసంగించకుండానే మధ్యలో వెళ్లిపోయారు. ఆయన తీరు చిన్నపిల్లల చేష్టల మాదిరిగా ఉంది.రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ బాధ్యతను నిర్వర్తించలేకపోయారు. తమిళనాడు అభివృద్ధి చూసి ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు ‘’ అని సీఎం తీవ్ర విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా, ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించలేదని ఆరోపిస్తూ గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి , ప్రసంగం చేయకుండానే వెళ్లిపోయారు. ‘‘ రాజ్యాంగం, జాతీయ గీతానికి మరోసారి అవమానం జరిగింది. జాతీయ గీతాన్ని గౌరవించడం రాజ్యాంగం ప్రకారం మన ప్రాథమిక విధి. అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నాయి. ‘’ అంటూ ఇటీవల ఎక్స్‌ లో పోస్టు పెట్టారు. ఈ పరిణామంతో అధికార డీఎంకె ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య మరోసారి విభేదాలు ఏర్పడ్డాయి. రాష్ట్ర ప్రజలను , ప్రభుత్వాన్ని ఆయన ఎప్పుడూ అవమానిస్తున్నారని ఆరోపించిన స్టాలిన్‌, గవర్నర్‌ చర్యపై మరోసారి విమర్శలు చేశారు.

Views: 2

Latest News

AMARAVATHI NEWS 2025 :లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ! AMARAVATHI NEWS 2025 :లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ!
లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ! అమరావతి  - ప్రభాత సూర్యుడు తమిళనాడుకు చెందిన బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామిని అందరూ లాయర్ అనుకుంటారు....
DELHI ELECTION UPDATE : ఢిల్లీ ఎలక్షన్స్
AP HEALTH ALRET 2025 : ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి
AP NEWS UPADTE : డయాగ్నొస్టిక్ సెంటర్‌లో దారుణం.
AP Government Introduces New Guidelines :భవన నిర్మాణాలపై కొత్త మార్గదర్శకాలు
TELANGANA NEWS UPDATE 2025  :రీజనల్‌ రింగ్‌ రొడ్‌ కోసం నిధుల కసరత్తు
TG NEWS 2025:తెలంగాణ గట్టుపై ఆసక్తికర రాజకీయాలు