AP POILITICS : మెగా ఫ్యామిలీకా.... నల్లారి వారికా....
Who owns the seat| రాజ్యసభ సీటు ఖాళీ అయ్యింది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాల నేపథ్యంలో ఆ సీటు కూటమిలోని పార్టీకే దక్కే ఛాన్స్ ఉంది.
మెగా ఫ్యామిలీకా.... నల్లారి వారికా....
తిరుపతి - ప్రభాత సూర్యుడు
విజయసాయి రెడ్డి రాజీనామాతో ఏపీ నుంచి ఓ రాజ్యసభ సీటు ఖాళీ అయ్యింది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాల నేపథ్యంలో ఆ సీటు కూటమిలోని పార్టీకే దక్కే ఛాన్స్ ఉంది. దీంతో టీడీపీ, జనసేన, టీడీపీ నుంచి ఒకరికి రాజ్యసభ పదవి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎవరికి ఈ ఛాన్స్ దక్కుతుందోనన్న చర్చ ఏపీ పాలిటిక్స్ లో జోరుగా సాగుతోంది. అయితే.. కూటమి నుంచి బీజేపీకి ఈ సీటు కేటాయించడం దాదాపు ఖాయమైందన్న టాక్ వినిపిస్తోంది. అయితే.. చిరంజీవి లేదా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిలో ఒకరిని రాజ్యసభకు పంపించాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవికి ఇస్తే జనసేన కూడా ఫుల్ హ్యాపీ అవుతుందన్న చర్చ బీజేపీలో సాగుతుందని సమాచారం.ఏపీలో ఎన్నికల నాటి నుంచి చిరంజీవి బీజేపీకి చాలా దగ్గర అవుతున్నారు. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను గెలిపించాలని స్వయంగా వీడియో విడుదల చేశారు మెగాస్టార్. సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి కోసం కూడా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు ఆయన. ఇటీవల ఢల్లీిలోని కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరైన చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. దీంతో చిరంజీవి బీజేపీలోకి లోకి ఖాయమన్న ప్రచారం మొదలైంది. ప్రస్తుతం రాజ్యసభ సీటు ఖాళీ అయిన నేపథ్యంలో ఆయనకు ఛాన్స్ పక్కా అన్న చర్చ సాగుతోంది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సైతం రాజ్యసభ ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాజంపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఒక వేళ ఆయన గెలిస్తే కేంద్ర మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం కూడా సాగింది. అయితే.. రాష్ట్రంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఆయనను రాజ్యసభకు పంపించే ఛాన్స్ ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది. దీంతో చిరంజీవికి రాజ్యసభ అవకాశం వరిస్తుందా? లేక కిరణ్ కుమార్ వైపు బీజేపీ మొగ్గుచూపుతుందా? లేదా మరో కొత్త వ్యక్తికి ఛాన్స్ వస్తుందా? అన్న అంశం మరికొద్ది రోజుల్లో తేలనుంది