Telangana News : ఒక్క ఎకరం భూమి 80 కోట్లు..ఎక్కడో తెలుసా ?
మల్టీ నేషనల్ కంపెనీల రాకతో అమాంతం పెరిగి పోతున్న భూముల రేట్లు

80 కోట్లకు చేరిన కోకాపేట భూముల విలువ
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు
హైదరాబాద్ నేలకు విలువ.. కుంచములతో బంగారం కొలువ’ అంటారు తెలంగాణ పెద్దలు. ఇది అక్షరాల నిజం అవుతోంది. భాగ్యనగరంలోని కొన్ని ప్రాంతాల్లో భూముల విలువ బంగారం కంటే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా వెస్టర్న్ హైదరాబాద్‌లో భూముల ధరలు ఆకాశాన్నంటాయి.హైదరాబాద్ అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు, పెట్టుబడులు, కంపెనీల స్థాపనల కారణంగా భాగ్యనగరం ప్రపంచపటంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక్కడి పాలకులు కూడా మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాయి. ఫలితంగా మన భాగ్యనగరం భూములు బంగారం అయ్యాయి.ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ నగరాలతో పోటీపడుతోంది.
ఈ క్రమంలో శివారు ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకోని ఉన్న కోకాపేట, గచ్చిబౌలి, రాయదుర్గం, నానక్ రాంగూడ, నార్సింగి ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అక్కడ పరిస్థితులు చూస్తే.. మనం హైదరాబాద్‌లోనే ఉన్నామా.. లేక దేశం దాటి వచ్చామా అనే అనుభూతి కలగుతుందివెస్టర్న్ హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలు ఉపాధికి కేంద్ర బిందువుగా మారాయి. ఆకాశాన్ని తాకే భవనాలు, ప్రముఖ కంపెనీలతో ఈ ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయి. వ్యాపారులు, విదేశీ కంపెనీలు కూడా హైదరాబాద్ శివారు ప్రాంతాల వైపే మొగ్గుచూపుతున్నాయి. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శివారు ప్రాంతాల్లో ఊహించని రీతిలో భూముల ధరలు పెరిగాయి. కోకాపేటలో భూముల ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతం హైదరాబాద్ నగరంలో ఒక ప్రధానమైన వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ ఐటీ కంపెనీలు, మల్టీ నేషనల్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు వేగంగా పెరుగుతున్నాయి. దీనితో పాటు కోకాపేటకు మంచి రోడ్డు మార్గాలు ఉండటం కూడా ఇక్కడి భూముల ధరలు పెరగడానికి ఒక ముఖ్య కారణంగా చెబుతారు.కోకాపేట ప్రాంతం హైదరాబాద్ ఐటీ హబ్‌గా రూపాంతరం చెందుతోంది. ఇక్కడ అనేక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రభుత్వం కూడా కోకాపేట అభివృద్ధికి కృషి చేస్తోంది. దీనివల్ల మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాల వ్యాపారులు, సంపన్నులు, కంపెనీల నిర్వాహకులు ఇక్కడ భూములు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఒక్క ఎకరం ధర రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఉందిఇక హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు.. భూముల ధరలపై ప్రభావం చూపుతోంది. రీజినల్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు బాగా పెరుగుతున్నాయి. ప్రధానంగా ఇంటర్ఛేంజ్‌ల దగ్గర భూములకు ఎక్కువ డిమాండ్ ఉంది. కమర్షియల్ ల్యాండ్, రెసిడెన్షియల్ ప్లాట్, విల్లా.. ఇలా విభజించి భూములను అమ్ముతున్నారు. గతంలో పోలిస్తే.. ఎకరానికి కోటి రూపాయల నుంచి రూ.2 కోట్ల వరకు ధరలు పెరిగాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు.