FM Nirmala Sitaranam : భారత్‌పై అమెరికా సుంకాలపై నిర్మలా సీతారామన్‌ సెన్సేషనల్ కామేంట్స్

అమెరికా సుంకాలపై అధ్యయనం చేస్తున్నాం , విూడియాతో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌

On
FM Nirmala Sitaranam : భారత్‌పై అమెరికా సుంకాలపై నిర్మలా సీతారామన్‌ సెన్సేషనల్ కామేంట్స్

అమెరికా సుంకాలపై అధ్యయనం చేస్తున్నాం
- బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా చర్చ చేస్తున్నాం
- బాధ్యతగా ఎపికి  సహకారం అందిస్తున్నాం
- విూడియాతో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌

విశాఖపట్నం - ప్రభాత సూర్యుడు

భారత్‌పై అమెరికా సుంకాల మోతపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. సుంకాల విషయమై చర్చలకు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అమెరికా వెళ్లారని తెలిపారు. అమెరికా వాణిజ్య మంత్రులతో ఆయన చర్చలు జరుపుతున్నారని చెప్పారు. భారత్‌ ఎగుమతుల విషయాన్ని దృష్టిలో ఉంచుకుని చర్చలు ఉంటాయన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న  వ్యాపారవేత్తలు, చార్టెడ్‌ అకౌంటెంట్స్‌, లాయర్లు, వ్యాపార సంఘాల నుంచి సలహాలు, సూచనలు తీసుకొని బడ్జెట్‌లో మార్పులు చేస్తామని స్పష్టం చేశారు. ఆర్థిక వేత్తలు, వివిధ వర్గాల మేధావులతో కేంద్ర బడ్జెట్‌పై విశాఖలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం విూడియాతో మాట్లాడారు. ఏపీకి కేంద్రంతో ముడిపడిన ప్రతి ప్రాజెక్టుకు ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నట్టు పునరుద్ఘాటించారు. విశాఖ ఉక్కు పూర్వ వైభవానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు.  ‘ఏటా బడ్జెట్‌ టేబుల్‌ చేశాక మధ్యలో గడువు ఉంటుంది. మళ్లీ పార్లమెంట్‌ మొదలయ్యాక ఫైనాన్స్‌ బిల్లుపై చర్చ జరుగుతుంది. ఆ తర్వాత ఆమోదం ఉంటుందన్నారు. ముఖ్యమైన అభిప్రాయాలు, సూచనలొస్తే సవరణలు చేసి బడ్జెట్‌ను ఆమోదిస్తాం. ప్రభుత్వ ఖర్చులతో రోడ్లు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు నిర్మిస్తున్నాం. జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా ఒక్కో ఇంటికి తాగునీరు అందిస్తున్నాం. మనం ఉపయోగించుకున్న వాటికే పన్ను చెల్లిస్తాం. కారు కొంటే దానిపైనే పన్ను చెల్లిస్తాం.. కొనని వారు చెల్లించరు. రోడ్డు వినియోగించుకున్న వారే టోల్‌ ట్యాక్స్‌ చెల్లిస్తారు. ప్రజలు పన్నులు చెల్లిస్తేనే రహదారులు నిర్మించగలిగేది‘ అని ఆర్థిక మంత్రి వివరించారు.BOOK

కేంద్ర ప్రభుత్వంగా కాదు.. మా బాధ్యతగా ఆంధ్రప్రదేశ్‌కు సహకారం అందిస్తున్నాం అని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌..అన్నారు.. బడ్జెట్‌  ప్రవేశ పెట్టిన తరవాత దేశ వ్యాప్తంగా చర్చలు నిర్వహిస్తున్నాం. మొదట ముంబైలో.. రెండో చర్చ విశాఖ లో నిర్వహించాం అన్నారు.. విశాఖలో బ్జడెట్‌ పై వివిధ వర్గాల ప్రజలను కలసి వారి సలహాలు, సూచనలు తీసుకున్నాం అన్నారు.. ఇక, పోలవరం ప్రాజెక్ట్‌ కి అధిక ప్రాధాన్యత ఇచ్చాం.. కేంద్ర ప్రభుత్వంగా కాదు, మా బాధ్యతగా సహకారం అందిస్తున్నాం అన్నారు.. విశాఖ స్టీల్‌ ప్లాంట్కు ఎక్కువ మొత్తం కేటాయించాం.. స్టీల్‌ ప్లాంట్ను పునరాభివృద్ది చేయడానికి 11 వేల కోట్ల సహకారం అందిస్తున్నాం.. పారిశ్రామిక కారిడార్‌ కు.. కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతి రాజధానికి కూడా సహకారం అందిస్తున్నాం. కేంద్రం, రాష్ట్రం కలిసి చేస్తున్న అన్ని ప్రాజెక్టులకు లోటు లేకుండా కేటాయింపులు చేస్తున్నాం అన్నారు. అయితే, సాంకేతిక సమస్యలు వలన పోలవరం ప్రాజెక్ట్‌ ఆలస్యం అవుతుందన్నారు నిర్మలా సీతారామన్‌.. విభజన సమయంలో పోలవరం పూర్తి చేస్తామని హావిూ ఇచ్చాము. ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్‌ ను పూర్తి చేస్తాం. అది జాతీయ ప్రాజెక్ట్‌ అని స్పష్టం చేశారు.

ఇక, 12 లక్షలు వరకు టాక్స్‌ కట్టే అవకాశం లేకుండా వెసులుబాటు ఇచ్చాము. సర్వీస్‌ సెక్టార్‌ లో నిర్దిష్టమైన ఆదాయం వస్తుంది. ఇతర దేశాలు తరహాలో మన దేశం అభివృద్ధి చెందాలి అంటే ఆదాయ వనరులు పెంచుకోవాలని సూచించారు.. మరోవైపు.. నేను పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో నివసించి అక్కడ నీటి కష్టాలు అనుభవించాను. జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా నేరుగా ఇంటికి మంచినీరు ఇచ్చే బృహత్తర ప్రాజెక్టును చేపడుతున్నాము. ఆత్మ నిర్బర్‌ భారత్‌, మేక్‌ ఇన్‌ ఇండియా లాంటి కార్యక్రమాలు చేపట్టకపోతే వినాయక చవితికి విగ్రహం తయారుచేసే మట్టిని కూడా ఇతర దేశాలు నుంచి తెచ్చుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.. విశాఖకు సవిూపంలో ఫార్మా రంగం అభివృద్దికి బల్క్‌ డ్రాగ్‌ పరిశ్రమలు విస్తృత పరిచామని వెల్లడించారు.

మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయంతో సుంకాలు పెరిగే అవకాశం ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా.. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అమెరికా వెళ్లి అక్కడ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. అమెరికా సుంకాల పెంపు ప్రభావం మన దేశ ఆర్థిక స్థితి విూద పడుతుందన్నారు.. నూతన పద్ధతులు ద్వారా ఆదాయపను చెల్లింపు విధానం అనేది పన్ను చెల్లింపుదారులకు సులభతరమైన మార్గంగా చేశామని తెలిపారు.. మూడు కోట్ల మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారు.. కొత్త పన్ను వెసులుబాటు ద్వారా ఈ సంఖ్య మరింత తగ్గుతుందని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు.

Views: 31

Latest News