Ranga Reddy : తెలంగాణ మంత్రి పదవి కోసం ఏకంగా అమెరికా తాజా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో రికమండేషన్
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కమలా హారిస్ తో పైరవీ
.jpg)
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కమలా హారిస్ తో పైరవీ
- కమలా హారిస్ నుంచి రికమండేషన్ లేఖ కూడా రావడంతో రాహూల్ గాంధీ షాక్
- రికమండ్ చేయించిన ఘనుడు ఎవరా అని కాంగ్రేస్ వర్గాల్లో సీరియస్ డిస్కషన్
మంత్రి పదవి కోసం కమలా హారిస్ రికమండేషన్
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కమలా హారిస్ తో పైరవీ
- కమలా హారిస్ నుంచి రికమండేషన్ లేఖ కూడా రావడంతో రాహూల్ గాంధీ షాక్
- రికమండ్ చేయించిన ఘనుడు ఎవరా అని కాంగ్రేస్ వర్గాల్లో సీరియస్ డిస్కషన్
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు
తెలంగాణ మంత్రి పదవి కోసం అమెరికా రికమండేషన్..ఏంటీ ఆశ్చర్యపోతున్నారా? అవును.. సీఎం రేవంత్ మంత్రివర్గంలో బెర్త్ కోసం అమెరికా తాజా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కాంగ్రెస్ కీలక నేత రాహూల్ గాంధీకి సిఫారసు చేశారట. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇప్పించాలని కమలా హారిస్ నుంచి రికమండేషన్ లేఖ కూడా రావడంతో రాహూల్ గాంధీ అవాక్కయ్యారని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో తెగ చర్చ జరుగుతోందట.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ డైలీ సీరియల్ ను తలపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 16 నెలలు దాటిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఆయన మంత్రివర్గంలో మొత్తం 12 మంది ఉన్నారు. క్యాబినెట్ లో ఇంకా ఆరుగురికి అవకాశం ఉంది. దీంతో చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. లోక్ సభ ఎన్నికల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఊరిస్తూ వస్తున్న కాంగ్రెస్ అధిష్టానం అప్పటి నుంచి వాయిదాల విూద వాయిదాలు వేస్తూనే వస్తోంది. మంత్రి పదవిని ఆశిస్తున్న ఆశావహులు అధికం కావడంతో ఇటీవల మంత్రివర్గ విస్తరణను కాంగ్రెస్ అధిష్టానం నిరవధికంగా వాయిదా వేసినట్లు గాంధీభవన్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. క్యాబినెట్ విస్తరణ ఇదిగో అదిగో ఇన్నాళ్లూ ఊరిస్తూ వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం చివరకు ఇప్పట్లో లేదనే సంకేతాలు ఇవ్వడంతో ఆశావహుల ఎమ్మెల్యేలంతా ఊసురుమంటున్నారు. పార్టీ అధిష్టాన తీరుపై కాస్తా గుర్రుగానే ఉన్నారట. అలా కొంతమంది ఎమ్మెల్యే అలకపాన్పు ఎక్కారంట. మంత్రి పదవులు మాకు ఇస్తారా లేదా ఏదో ఒకటి తేల్చిచెప్పాలని డిమాండ్ సైతం చేస్తున్నారంట.మంత్రివర్గ విస్తరణను కాంగ్రెస్ అధిష్టానం నిరవధికంగా వాయిదా వేసినప్పటికీ..తగ్గేదేలే అంటూ అమాత్య పదవులను ఆశిస్తున్న వాళ్లంతా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారంట. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ రెడ్డి నుంచి మొదలు ఢిల్లీ లెవల్లో ఎవరికి వారు మంత్రి పదవుల కోసం తెగ పైరవీలు చేస్తున్నారంట. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్పప్పటికీ తమకు మంత్రి పదవి దక్కుతుందో లేదోనన్న ఆందోళన సైతం వారిని వెంటాడుతోందట. ఇటువంటి సమయంలో ఇక్కడ ప్రయత్నిస్తే వర్కవుట్ అవుతుందో లేదో అన్న అనుమానంతో ఓ సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏకంగా అమెరికా నుంచి రికమండేషన్ చేయించడం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో సంచలనంగా మారింది. మంత్రి పదవి ఆశిస్తున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే.. ఏకంగా అమెరికా తాజా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానానికి సిఫారసు చేయించారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన మిగతా ఆశావహులంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారంట. మంత్రి పదవి కోసం ఏకంగా అమెరికా నుంచే రికమండేషనా అంటూ ఆశ్చర్యపోతున్నారంట. సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇచ్చేలా చొరవ తీసుకోవాలని అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్? ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి రికమెండ్ చేశారట. ఈ మేరకు రాహూల్ కు ఆమె ఓ లేఖ కూడా రాశారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తెలంగాణ క్యాబినిట్ లో మంత్రి పదవి కోసం ఏకంగా అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నుంచి లేఖ రావడంతో రాహూల్ గాంధీ సైతం అవాక్కయ్యారట. మంత్రి పదవి కోసం అమెరికా నుంచి రికమండేషన్ చేయించుకున్న ఆ ఎమ్మెల్యే ఎవరా అని పార్టీ నేతల ద్వారా ఆరా తీస్తున్నారట రాహూల్ గాంధీ. ఇప్పుడీ విషయం ఏఐసీసీతో పాటు ఢిల్లీ రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. ఓ రాష్ట్ర మంత్రి పదవి కోసం ఏకంగా అమెరికా నుంచి రికమండేషన్ చేయించుకోవడం కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే బహుశా ఇదే మొదటిసారి కావొచ్చన్న చర్చ జరుగుతోంది. యూఎస్ రికమండేషన్ విషయం కాస్తా? విపక్ష పార్టీ అయిన బీఆర్‌ఎస్ కీలకనేతల చెవిన పడిరదట. దీంతో ఇప్పుడు ఈ అంశంపై అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్‌ఎస్ లోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట. ఇంతకీ కమలా హారిస్ సిఫారసు చేసిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కుతుందా లేదా అన్నదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఉత్కంఠ రేపుతోందట.
అగ్రరాజ్యం అమెరికా నుంచి రికమండేషన్ చేయించుకున్నా.. అసలు మంత్రివర్గ విస్తరణ ఎప్పుంటుందా అని ఆశావహులంతా కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురుచూస్తున్నారంట. పార్టీ తీరుపై అలకబూనిన సదరు ఆశావహ ఎమ్మెల్యేలంతా పార్టీ కీలక సమావేశాలకు సైతం డుమ్మాలు కొడుతూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారన్న టాక్ సైతం కాంగ్రెస్ వర్గాల్లో విన్పిస్తోంది.