Teenmar Mallanna Suspend : కాంగ్రెస్ పార్టీ నుండి తీన్మార్ మల్లన్న సస్పెండ్

TPCC Suspends MLC Teenmar Mallanna | MLC Teenmar Mallanna Suspend From Congress Party

On
Teenmar Mallanna Suspend : కాంగ్రెస్ పార్టీ నుండి తీన్మార్ మల్లన్న సస్పెండ్

కాంగ్రెస్ పార్టీ నుండి తీన్మార్ మల్లన్న సస్పెండ్

హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు

కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కు బిగ్ షాక్ తగిలింది. తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ శిక్షణ కమిటీ షోకాస్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులకు మల్లన్న వివరణ ఇవ్వకపోవడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేసింది. WhatsApp Image 2025-03-01 at 12.48.58 PM

తెలంగాణ రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వే నివేదికపై తీన్మార్ మల్లన్న.. ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ సర్వే తప్పుల తడక, దొంగ సర్వే అంటూ..దీన్ని ఉచ్చపోసి తగుల పెట్టాలంటూ..తీవ్ర పదజాలాన్ని వాడాడు. అంతటితో ఊరుకోకుండా..సర్వే నివేధికను తన స్టూడియోలోనే తగుల బెట్టాడు. 

అంతే కాకుండా వరంగల్లో జరిగిన బీసీ సభలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడంపై పీసీసీకి ఫిర్యాదులు అందాయి. రెడ్డి కులాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన అతనిపై చర్యలు తీసుకోవాలని పలువురు పార్టీ శ్రేణులు కోరారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించి మల్లన్నను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 

వీటన్నింటిపై వివరణ కోరుతూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి మలన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరణపై సంత్రుప్తి చెందని క్రమశిక్షణ కమిటీ నేడు తీన్మార్ మల్లన్నను  సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

Views: 163

Latest News