Telangna Politics : కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాత పెట్టారు

- ఎమ్మెల్సీల విజయంతో మా బాధ్యత పెరిగింది, విూడియా సమవేశంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

On
Telangna Politics : కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాత పెట్టారు

కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాత పెట్టారు

- ఇప్పటికైనా ఇచ్చిన హావిూలు నెరవేర్చండి
- ఎమ్మెల్సీల విజయంతో మా బాధ్యత పెరిగింది
- ప్రజా సమస్యలపై ఇక చట్టసభల్లో నిలదీస్తాం
- సిఎం రేవంత్‌ గాలి మాటలకు సమాధానం చెప్పాలా
- విూడియా సమవేశంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించి అఖండ విజయాన్ని కట్టబెట్టిన తెలంగాణ సమాజానికి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు . బీజేపీ రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఈ విజయం తెలంగాణ సమాజానికి, ఉపాధ్యాయులకు అంకితం ఇస్తున్నామని అన్నారు.రెండు ఎమ్మెల్సీలు ఏక కాలంలో రావడం చాలా సంతోషం. గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీని ఆదరించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన కొద్దీ నెలల్లోనే కాంగ్రెస్‌ తో సమానంగా తెలంగాణ సమాజం బీజేపీకి ఎంపీ సీట్లు కట్టబెట్టింది . మూడు స్థానాల్లో  రెండు కీలకమైనవి. కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానంలో బీజేపీని గెలిపించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మోసం చేశాయని గ్రహించే రాష్ట్ర ప్రజలు బీజేపీని గెలిపించారని కిషన్‌ రెడ్డి అన్నారు. రెండు ఎమ్మెల్సీల విజయంతో బీజేపీ బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి బీజేపీపైన ఆనేక తప్పుడు ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.BJLP కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన రెండు ఎన్నికల్లో బీజేపీని గెలిపించారని.. కాంగ్రెస్‌ కు కర్రు కాల్చి వాత పెట్టారని  కిషన్‌ రెడ్డి అన్నారు. శాసన మండలి, సభలో ప్రజల సమస్యలపైన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం అన్నారు. శాసన మండలి, సభలో తెలంగాణ ప్రజల గుండె చప్పుడు వినిపిస్తాం. తెలంగాణలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావాల్సిన అవసరం ఉంది. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ వస్టే తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు.  ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పాలనకు రెఫరండమని తాము అనడం లేదు. కాంగ్రెస్‌ ఇచ్చిన హావిూలను ఇప్పటివరకైనా నెరవేర్చాలని గుర్తు చేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్‌ గిప్ట్‌ మాకు అవసరం మాకు లేదు.. రాహుల్‌ గాంధీకి ఇచ్చుకోండి. తెలంగాణ ప్రజలు మాకు గిప్ట్‌ ఇస్తున్నారు.. ఇస్తారు. హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని కిషన్‌ రెడ్డి కాంగ్రెస్‌ను విమర్శించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గాలి మాటలకు సమాధానం చెప్పాలా అని షన్‌రెడ్డి ప్రశ్నించారు.BJP1 సీఎం గాలి మాటలకు సమాధానం, సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి నాపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ఆ ఆరోపణలకు ప్రజలే సరైన సమాధానం ఇచ్చారు. ప్రజా తీర్పు.. కాంగ్రెస్‌ పాలనకు చెంపపెట్టులాంటిదన్నారు. ప్రజలకు ఇచ్చిన హావిూలను కాంగ్రెస్‌ నెరవేర్చాలి. రైతులకు ఎకరాకు రూ.15 వేలు, యువతకు నిరుద్యోగ భృతి, ఆడబిడ్డలకు నెలకు రూ.2,500, దళితులకు రూ.12 లక్షలు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని ఆ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హావిూలు అమలు చేయాలని కోరుతున్నాం. జీవో 317 కారణంగా ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికైన ఇద్దురు ఎమ్మెల్సీలను కిషన్‌ రెడ్డి అభినందించారు. 

Views: 26

Latest News