ISRO News : రేపే ఇస్రో మిషన్ @100 ప్రయోగం

ISRO's 100th launch tomorrow | ISRO's 100th Launch | NVS-02

On
ISRO News : రేపే ఇస్రో మిషన్ @100 ప్రయోగం

రేపే ఇస్రో మిషన్ @100 ప్రయోగం!

- మన ఇస్రో కి 100 నంబర్ 

హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు

స్వదేశీ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పేంపొందించుకుంటూ, అత్యంత్తమ భారత అంతరిక్ష పరిశోధన సంస్థగా ఎదిగిన ఇస్రో.. తన 100వ ప్రయోగాన్ని రేపు బుధవారం చేపట్టనుంది.  ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం ఉదయం 6.23 గంటలకు జీఎస్ ఎల్వీ-ఎఫ్15 రాకెట్ నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి ఎగరనుంది. 

దేశీయంగా తయారు చేసిన ఈ క్రయోజనిక్ రాకెట్ ద్వారా.. ఎన్వీఎస్-02 అనే శాటిలైట్‌ను ఇస్రో అంతరి క్షంలోకి పంపించనుంది. అయితే ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ మంగళవారం తెల్లవారు జామున 2.52 గంటలకు ప్రారంభం అయింది.  27 గంటల పాటు కొనసాగ నున్న ఈ కౌంట్‌డౌన్.. రేపు ఉదయం 6.23 గంటలకు ముగిసిన తర్వాత నింగి లోకి ప్రవేశించనుంది. 

ఈ జీఎస్ఎల్వీ-ఎఫ్ 15 రాకెట్ ప్రయోగం కోసం ఇప్పటికే దాన్ని షార్‌లోని రెండో లాంచ్ ప్యాడ్ వద్దకు తరలించారు. జీఎస్‌ఎల్వీ సిరీస్‌లో ఈ జీఎస్‌ఎల్వీ- ఎఫ్‌15 రాకెట్‌.. 17వది కాగా.. దేశీయ క్రయోజెనిక్‌ స్టేజ్‌ కలిగిన 11వ రాకెట్‌ కావడం గమనార్హం.  ఈ ప్రయోగం ద్వారా ఎన్వీఎస్‌-02.. ఉపగ్రహాన్ని జియోసింక్రనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌లోకి ఇస్రో శాస్త్ర వేత్తలు ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం ద్వారా దేశీయ నావిగేషన్‌ వ్యవస్థ.. నావిక్‌ మరింత విస్తృతం కానుందని సైంటిస్ట్‌లు వెల్లడించారు.

Views: 13
Tags:

Latest News

ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి
అక్రమవలసదారులను పంపించేయండి గౌహాతి-ప్రభాత సూర్యుడు అస్సాం రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడ్డ వారిని వారి స్వస్థలాలకు పంపించి...
AP POLITICS 2025 :మున్సిపాల్టీల్లో పట్టించుకోని కేడర్‌
TG RATION CARD UPDATE :కొత్త కార్డులతో పెరిగిన బియ్యం కోట...
TELANGANA AIRLINE UPDATE 2025 :కొత్తగూడెం ఎయిర్‌ పోర్టుకు లైన్‌ క్లియర్‌
AMARAVATHI NEWS 2025 :లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ!
DELHI ELECTION UPDATE : ఢిల్లీ ఎలక్షన్స్
AP HEALTH ALRET 2025 : ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి