TELANGANA LATEST NEWS : కాసులు కురిపిస్తున్న ఫ్యాన్సీ నెంబర్లు
Ranga Reddy District RTA Office received a revenue of Rs 37 lakh 29,690 in a single day

కాసులు కురిపిస్తున్న ఫ్యాన్సీ నెంబర్లు
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు
రంగారెడ్డి జిల్లా ఆర్టిఏకు ఒక్కరోజే 37 లక్షలకుపైగా ఆదాయం వచ్చింది. టీజీ 07 పి 9999 రిజిస్ట్రేషన్ నెంబర్‌కు 9 లక్షల 87 వేల అత్యధిక ధరకు పలికింది. ఫిలిం స్టార్లు, డబ్బున్న బడ వ్యాపారులు, పెద్ద పెద్ద కంపెనీలు ఫ్యాన్సీ నెంబర్లను ఇష్టపడటం మనం చూస్తుంటాం. ఇప్పుడు ఫ్యాన్సీ నెంబర్లు కోసం మధ్య తరగతి వాళ్లు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.తమ వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్లు ఉంటే రీసెల్లో కూడా మంచి ధర వస్తుందని ఆలోచన చేస్తుంటారు.మణికొండలోని రంగారెడ్డి జిల్లా ఆర్టిఏ ఆఫీస్‌కు ఒక్కరోజులోనే 37 లక్షల 29,690 రూపాయల ఆదాయం వచ్చింది. అది కూడా ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా. స్వతహాగా ఫ్యాన్సీ నెంబర్ల కోసం జనం ఎగబడుతూ ఉంటారు. సెంటిమెంట్, జాతకరీత్యా, పేరు బలంతో ,సంఖ్యాబలంతో తమ వాహనాలకు నెంబర్ ప్లేట్లు తమకు కావాల్సిన సిరీస్‌లో తీసుకోవడం సాధారణంగా చూస్తూ ఉంటాం. అయితే ఆ నెంబర్లు ఫ్యాన్సీగా ఉంటే వాటికి అత్యధిక డిమాండ్ ఉంటుంది. కేవలం వాహనాలకే కాదు మొబైల్ నెంబర్లలో కూడా ఫాన్సీ నెంబర్ల కోసం ఎక్కువ డబ్బు చెల్లించి కొనుగోలు చేస్తుంటారు. అయితే మణికొండ లో ఉన్న రంగారెడ్డి జిల్లా ఆర్టిఏ ఆఫీస్ కి రోజు నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్లు వేలంపాట లో అంత ధనం వచ్చి పడిరదిఅయితే టీజీ 07 పి 9999 నెంబర్ నీ ముష్ప ప్రాజెక్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కొనుగోలు చేసింది. వేలంలో పాల్గొన్న ఈ సంస్థ ఆ నెంబర్ కి ఏకంగా 9,86,999 రూపాయలను వేలంలో పాడి సొంతం చేసుకుంది. ఆ తర్వాత క్రమంలో టీజీ 07 ఆర్ 0009 అనే నెంబర్ నీ కే ఎల్ ఎస్ ఆర్‌న్ఫ్ఫ్రాటెక్ లిమిటెడ్ అనే సంస్థ 7.50 లక్షలకు వేలంపాటిలో దక్కించుకుంది. ఇది మాత్రమే కాదు మొత్తం మణికొండలో 106 మంది ఫాన్సీ నెంబర్ల వేలం పాటలో పాల్గొన్నారు. ఈ ఫాన్సీ నెంబర్ లు కొంతమందికి సెంటిమెంట్ అయితే మని కొంత మందికి హోదా కోసం కొనుగోలు చేస్తుంటారు.