Temperature in Telangana 2025 : ఈ సమ్మర్‌ చాలా హాట్‌ గురూ

Summer effect Heat in peaks in February and hot effect start in Telangana Andhra Pradesh

On
Temperature in Telangana 2025 : ఈ సమ్మర్‌ చాలా హాట్‌ గురూ

ఈ సమ్మర్‌ చాలా హాట్‌ గురూ

హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు

తెలంగాణకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ లో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేసింది. వడగాలులు, అత్యధిక ఉష్ణోగ్రతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.తెలంగాణలో ముందుగానే వేసవి కాలం ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ మహా నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 36 నుంచి 38 డిగ్రీలకు చేరుకోవచ్చని.. అలాగే రాష్ట్రంలోనే పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 24 గంటల్లో నగరంలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీ ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 48 గంట్లలో గరిష్ట ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 21 డిగ్రీలు ఉండొచ్చని తెలిపింది.రాబోయే ఏడు రోజుల్లో హైదరాబాద్‌ లో గరిష్ట ఉష్ణోగ్రతలు 34 నుంచి 36 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని పేర్కొంది. 2017 లో వీచిన భారీ వడగాలులు వచ్చే మార్చి, ఏప్రిల్‌ నెలల్లో వీయొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. 2017లో తెలంగాణలో రికార్డు స్థాయిలో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అప్పుడు 23 రోజుల పాటు వడగాలులు వీచాయి. కాబట్టి ప్రజలు ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.తీవ్రమైన వడగాలులు, ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని తగు జాగ్రత్తలు, సూచనలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.హైడ్రేటెడ్‌ గా ఉండడానికి పుష్కలంగా నీరు తాగాలి.ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరమైతేనే బయటకు రావాలి.భారీ వడగాలులు, ఉష్ణోగ్రతల నుంచి బయటపడడానికి తేలికైన తెలుపు రంగు దుస్తులను ధరించాలి. పిల్లలు, వృద్ధులు బయటకు రాకుండా ఉంటే మంచిది.ఈ ఏడాది భారత రుతుపవనాలపై ఎల్‌ నినో ప్రభావం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి టీ. బాలాజీ పేర్కొన్నారు. అయితే హిందూ మహాసముద్రం డైపోల్‌ అండ్‌ మాడెన్‌ జూలియన్‌ ఆసిలేషన్‌ వంటి అంశాలు భారీ ఉష్ణోగత్రలు కారణమయ్యే అవకాశం ఉండొచ్చు.హైదరాబాద్‌ ఏయిర్‌ క్వాలిటి ఇండెక్స్‌ 160 వద్ద ఉంటుంది. అయితే ఇది శ్వాసకోశ సమస్యలు ఉన్న వారికి ప్రాణానికే ముప్పు కలిగే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతల ఎక్కువగా ఉన్న సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఫిబ్రవరి నెలలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు ఉక్కపోతకు లోనవుతున్నారు. ఉదయం 9 గంటలకే ఎండలు దంచికొడుతుండడంతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు.ఇప్పటి నుంచి ఏప్రిల్‌ 15 వరకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మార్చి నెల మధ్యలో వరకు 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఏప్రిల్‌ చివర్లో ప్రజలకు ఎండలు, ఉక్కుపోత నుంచి కాస్త ఉపశమనం పొందే అవకాశం ఉందని వివరించింది.రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ లో భారీ ఉష్ణోగ్రతలు, వడగాలులు వీచే అవకాశం ఉన్నందున నగర వాసులు వాతావరణ శాఖ సూచనలు పాటించడం ముఖ్యం. ఎప్పటికప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా.. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచిస్తున్నారు. వృద్ధులు ఇంటికే పరిమితమైన మంచిదని చెబుతున్నారు. వాతావరణ శాఖ అధికారులు సూచనలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు.

Views: 2

Latest News