Big Shock To TDP: తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ
చాట్రాయి మండలంలో పలువురు టిడిపి నేతల రాజీనామా
చాట్రాయి మండలంలో పలువురు టిడిపి నేతల రాజీనామా
ఏలూరు - ప్రభాత సూర్యుడు
నూజివీడు నియోజకవర్గం లో 200 మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి ఆదివారం రాత్రి రాజీనామా చేశారు. దీంతో చాట్రాయి మండలం నరసింహారావు పాలెం తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. గత 20 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని పార్టీ కోసం కష్టపడితే వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి నాయకులు పెద్దపీట వేస్తున్నారని ఆరోపణలు చేశారు. గ్రామ పార్టీ ప్రెసిడెంట్, అందేకృష్ణ. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.గత 20 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులకే పెద్దపీట వేస్తున్నారి ఆరోపించారు. పార్టీ అధికారంలో లేకపోయినా గ్రామస్థాయిలో సొంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీని బ్రతికించామని అన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారికి లోన్లు ఇల్లు ఇస్తున్నారని ఆవేదనతో ముకుమ్మడిగా రాజీనామా చేసారు.