It will be decided only after the results:ఆ ముగ్గురు అలా అయిపోయేరేం
ఆ ముగ్గురు అలా అయిపోయేరేం
గుంటూరు-ప్రభాత సూర్యుడు
పాపం.. అధికారంలో లేనప్పుడే ఈ బ్యాచ్ హవా పార్టీలో మామూలుగా లేదు. కానీ ఇప్పుడు కేంద్రంలో, ఏపీలో అధికారంలో ఉన్నప్పటికీ పట్టించుకునే వారే లేరు. పూర్తిగా పాత బ్యాచ్ ను పక్కన పెట్టేసినట్లే కనపడుతుంది. 2014 రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి 2024 వరకూ సోము వీర్రాజు బ్యాచ్ హవా బీజేపీలో ఒక మాదిరిగా ఉండేది. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు సోము వీర్రాజు ఎమ్మెల్సీ అయ్యారు. తర్వాత కన్నా లక్ష్మీనారాయణను తప్పించి బీజేపీ అధ్యక్ష పదవిని తాను చేపట్టారు. కానీ ఇప్పుడో అస్సలు సోము వీర్రాజు అనే వ్యక్తి ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితులు ఏపీ బీజేపీలో నెలకొన్నాయి. పార్టీ పదవులతో పాటు ప్రభుత్వ పదవులు కూడా కనుచూపు మేరలో వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.నాడు కీలకభూమిక పోషించి... సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహరావు వంటి వారు నాడు ఏపీ బీజేపీలో కీలక భూమిక పోషించారు. అయితే వీరికి వైసీపీ ముద్ర పడిరది. నాడు కూటమి ఏర్పాటు కాకుండా అడ్డుపడటానికి కూడా వీరు ప్రయత్నించారన్న ఆరోపణలున్నాయి. చంద్రబాబు పై ఆగ్రహావేశాలు... వైఎస్ జగన్ పై సాఫ్ట్ కార్నర్ తో వెళుతుండటంతో వారికి సహజంగానే ఆ ముద్ర పడిరది. ఆ ముద్ర నుంచి బయటపడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు. భవిష్యత్ లోనూ వస్తాయన్న ఆశలే?దు. నమ్మకం లేదు. తమ స్థానాలను కొందరు హైజాక్ చేసుకుని వెళుతున్నారన్న సత్యాన్ని వారు గ్రహించినట్లే కనపడుతుంది. అందుకే సైలెంట్ గా ఉండిపోతూ కలసి వచ్చే కాలం కోసం ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది నెలలవుతుంది. అయితే ఇప్పటి వరకూ భర్తీ అయిన పోస్టుల్లో వీరితో పాటు వీరి వర్గానికి చెందిన వారికి ఎవరికీ ప్రాధాన్యత దక్కలేదు. చంద్రబాబు అవసరం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అవసరం కావడంతో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వారిని సహజంగా కేంద్ర నాయకత్వం కూడా పట్టించుకోదు. ఎందుకంటే గత ఐదేళ్ల పాటు చంద్రబాబు పై ఒంటికాలు విూద లేచి వాళ్లందరినీ ఇప్పుడు పరోక్షంగా చంద్రబాబు అణిచివేస్తున్నారన్న టాక్ బీజేపీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఏపీలో బీజేపీ ఒంటరిగా బలోపేతం అయ్యే అవకాశాలు లేవని గ్రహించిన కేంద్ర నాయకత్వం కూడా ఎన్నో కొన్ని సీట్లు కూటమితో కలసి వెళితేనే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చినట్లుంద పవన్ కల్యాణ్. పార్టీ నేతలకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటేనే ఎక్కువ గురి. అందుకే పవన్ కల్యాణ్ పైనే ఎక్కువ ఆధారపడి బీజేపీ తన ప్రయాణాన్ని ఏపీలో సాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతే తప్ప ఈ అవుట్ డేటెడ్ లీడర్లను మళ్లీ అందలం ఎక్కించాలని ఎంత మాత్రం అనుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నాలుగేళ్లలో ఈ బ్యాచ్ కు మాత్రం ఎలాంటి అవకాశాలు దక్కే ఛాన్స్ కనిపించడం లేదు. దీంతో వీరు వచ్చే ఎన్నికల వరకూ వెయిట్ చేసి రెచ్చిపోవాలా? లేక మౌనంగా ఉండాలా? అన్నది రిజల్ట్ తర్వాత మాత్రమే డిసైడ్ అవుతుంది. కానీ ఈనాలుగేళ్లలో మాత్రం వీరికి ప్రాధాన్యత దక్కే అవకాశం లేదనే ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయనడంలో సందేహం లేదు.