AP POLITICS : ముదురుతున్న వాకింగ్‌ వివాదం

Walkers War For Walking in Amaravathi Layola Collage | ఆంధ్రా లయోలా కాలేజీలో వాకింగ్‌ చేయడానికి అనుమతి కోసం వాకర్‌ సంఘాలఆందోళన

On
AP POLITICS  : ముదురుతున్న వాకింగ్‌ వివాదం

ముదురుతున్న వాకింగ్‌ వివాదం

విజయవాడ - ప్రభాత సూర్యుడు

విజయవాడలో లయోలా గ్రౌండ్స్‌లో వాకింగ్‌ వివాదం ముదురుతోంది. నగరం మధ్యలో ఉన్న ఆంధ్రా లయోలా కాలేజీలో వాకింగ్‌ చేయడానికి అనుమతి కోసం వాకర్‌ సంఘాలు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నాయి. సున్నితమైన ఈ వ్యవహారంలో ప్రభుత్వం నెలల తరబడి ఉదాసీనంగా వ్యవహరించడంతో ఇది కాస్త రాజకీయ రగడగా మారింది. నగరం మధ్యలో ఉన్న ఈ కాలేజీ దాదాపు 100ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది.1950వ దశకంలో మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం అవతరించే సమయంలో లయోలా కాలేజీకి అంకురార్పణ జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటైన ఈ విద్య సంస్థ ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యుత్తమ కళాశాలల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. క్యాథలిక్‌ మైనార్టీ విద్యా సంస్థగా.. జెస్యూట్‌ మిషనరీల ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా నడుస్తున్న లయోలా అనుబంధ సంస్థల్లో ఆంధ్రా లయోలా కాలేజీ ఒకటి. ఈ సంస్థకు దేశ వ్యాప్తంగా 391  పాఠశాలలు, 62 కాలేజీలు, 4 యూనివర్శిటీలు ఉన్నాయి. దేశంలో నాలుగు లక్షల మంది విద్యార్థులు లయోలా విద్యా సంస్థల్లో చదువుతున్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్నత విద్యాభ్యాసం కోసం మద్రాసు వెళ్లాల్సిన రోజుల్లో విజయవాడ కేంద్రంగా తెలుగు ప్రజల కోసం ఈ కాలేజీని ఏర్పాటు చేశారు. అప్పట్లో విద్య ప్రాధాన్యతను గుర్తించిన విజయవాడ నగరానికి చెందిన ప్రముఖులు, భూస్వాములు ఈ సంస్థకు భూములను సేకరించడానికి సహకరించారు. కాలేజీ నిర్మాణానికి దేశవిదేశాల నుంచి ఎంతోమంది దాతలు ఉదారంగా విరాళాలు ఇచ్చారు.స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన విద్యా వ్యాప్తిలో లయోలా కాలేజీ గణనీయమైన గుర్తింపు ఉంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కాలేజీలో చదువుకున్నారు. ఉమ్మడి ఏపీలో ప్రైవేట్‌ కాలేజీల హవా మొదలు కాక ముందు లయోలాలో అడ్మిషన్‌ పొందడాన్ని గౌరవంగా భావించేవారు. దీనికి తీవ్రమైన పోటీ ఉండేది.ఒకప్పుడు విజయవాడ నగరానికి దూరంగా ఉన్న లయోలా కాలేజీ పట్టణీకరణ నేపథ్యంలో ప్రస్తుతం విజయవాడ నగరం మధ్యలోకి చేరింది. చెన్నై`కోల్‌కత్తా జాతీయ రహదారిపై దాదాపు 100ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కాలేజీలో ఇంటర్‌, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌, సాంస్కృతిక కేంద్రాలు ఉన్నాయి. అధ్యాపకులకు శిక్షణ ఇచ్చే కేంద్రం కూడా ఉంది. కాలేజీ ఆవరణలో ఇంటర్‌, డిగ్రీ, పీజీ విద్యార్థులకు వేర్వేరుగా హాస్టళ్లు ఉన్నాయి. డిగ్రీ, పీజీ విద్యార్థినులకు కూడా హాస్టళ్లు ఉన్నాయి. విద్యార్థినుల భద్రతా కోణంలో కూడా లయోలా వాకర్ల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తోంది.నగరం నడి బొడ్డున ఉన్న కాలేజీకి చెందిన విలువైన స్థలాలను కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు చాన్నాళ్లుగా ఉన్నాయి. ఇప్పటికే కాలేజీ స్థలాన్ని లీజుకు తీసుకున్న సంస్థలు వాటిని ఖాళీ చేయకుండా వివాదాలు సృష్టించడంతో? కాలేజీ ప్రాంగణంలో ప్రైవేట్‌ కార్యక్రమాలను కట్టడి చేయడం మొదలైనట్టు లయోలా యాజమాన్యం చెబుతోంది.లయోలా కాలేజీ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న స్థానిక ప్రజలు కొన్నేళ్లుగా కాలేజీ ప్రాంగణంలో వాకింగ్‌ చేస్తున్నారు. మొదట్లో పదుల సంఖ్యలో ఉన్న వాకర్లు ఇప్పుడు వందల సంఖ్యకు చేరుకున్నారు. కోవిడ్‌ 19 ప్రబలిన తర్వాత కాలేజీ ప్రాంగణంలో వాకింగ్‌ చేయడంపై కాలేజీ యాజమాన్యం ఆంక్షలు విధించింది.ఈ క్రమంలో కాలేజీలో వాకింగ్‌కు అనుమతించాలంటూ వాకర్ల సంఘాలు కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. కాలేజీలోకి తమను అనుమతించాలని వాకర్‌ అసోసియేషన్లు కొన్ని నెలలుగా కాలేజీ ఎదుట నిరసనలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో కాలేజీ గేట్లను ధ్వంసం చేయడం, బలవంతంగా ప్రవేశించడం, కాలేజీ ఎదుట నిరసనలకు దిగడ వంటి చర్యలకు పాల్పడ్డారని కాలేజీ యాజమాన్యం చెబుతోంది. vjkvg-walk 4

వాకింగ్‌కు అనుమతించకపోవడంతో వాకర్‌ అసోసియేషన్లు? పోలీసులకు, ప్రభుత్వ శాఖలకు, స్థానిక రాజకీయ నాయకులకు ఫిర్యాదు చేయడంతో కాలేజీలో వాకింగ్‌ చేయడానికి అనుమతించాలని తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదురైనట్టు లయోలా చెబుతోంది. ఈ క్రమంలో కాలేజీ యాజమాన్యం కళాశాల ప్రాంగణంలోకి ప్రైవేట్‌ వ్యక్తులను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. దీంతో వివాదం మొదలైంది. క్రమంగా ఇది కాస్త రాజకీయ రగడగా మారింది.ఆంధ్రా లయోలా గ్రౌండ్స్‌లోకి వాకర్లను అనుమతించాల్సిందేనని విజయవాడ పోలీస్‌ ఉన్నతాధికారులతో పాటు , స్థానిక రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు ఎదురైనా సంస్థ వెనక్కి తగ్గలేదు. విద్యాబోధన, సాంకేతిక పరిశోధనలు, సామాజిక సేవకు మాత్రమే కాలేజీ కట్టుబడి ఉంటుందని, కాలేజీ నిర్వహణలో ప్రైవేట్‌ వ్యక్తుల జోక్యాన్ని కాలేజీలో అనుమతించేది లేదని స్పష్టం చేయడంతో వివాదం ముదిరింది. వాకర్‌ అసోసియేషన్లు రాజకీయ అనుబంధ కార్యక్రమాలకు పాల్పడుతున్నారని కాలేజీ వాదనగా ఉంది.కాలేజీలో నడిచే వారి సంఖ్య పెరగడంతో పాటు తమకు సంబంధం లేకుండా కాలేజీ పేరుతో వాకర్ల అసోసియేషన్‌ ఏర్పాటు చేసుకుని, వారే సభ్యత్వ రుసుములు వసూలు చేయడం, ఉప సంఘాల ఏర్పాటు, వ్యవస్థీకృత కార్యక్రమాలు నిర్వహించడం, కాలేజీ ప్రాంగణాన్ని పబ్లిక్‌ పార్క్‌గా మార్చేయడం, రాజకీయ కార్యక్రమాలకు వేదికగా మార్చడంతో సంస్థ ఆశయాలు, లక్ష్యాలకు ప్రతిబంధకంగా మారిందని కాలేజీ చెబుతోంది.ఇటీవల కాలేజీలో నడక కోసం కొందరు సామాజిక బల ప్రయోగానికి పాల్పడటం, రాజకీయ బలంతో బెదిరింపులకు దిగారని కాలేజీ చెబుతోంది. భద్రతా కారణాలతో ఉన్నత హోదాలో ఉన్న ప్రభుత్వ అధికారులను మాత్రమే ప్రస్తుతం కాలేజీలో వాకింగ్‌కు అనుమతించినట్టు చెబుతున్నారు.2024 జూన్‌ నుంచి స్థానిక రాజకీయ నాయకులు, ఇతర వాకర్లు కాలేజీలోకి వాకింగ్‌కు అనుమతించాలని సిఫార్సు చేయడం మొదలైందని లయోలా ఆరోపిస్తోంది. వాకింగ్‌కు అనుమతించక పోవడంతో పోలీసుల సహకారంతో కాలేజీ ఆస్తులకు నష్టం కలిగిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని, కాలేజీ సీసీ కెమెరాలు తొలగించి దౌర్జన్యం చేశారని, జిల్లా యంత్రాంగం, పోలీసులు వాకర్లతో కలిసి కాలేజీపై ఒత్తిడి చేశాయని చెబుతోంది. ఇప్పటికే లీజుకు ఇచ్చిన లయోలా ఆస్తులపై వివాదాలు తలెత్తడంతో, వాకర్ల డిమాండ్ల వెనుక దురుద్ధేశాలను గుర్తించి అనుమతించడం లేదని ఆ సంస్థ చెబుతోంది.కాలేజీలోకి బలవంతంగా ప్రవేశిస్తున్న వారిపై ప్రభుత్వ యంత్రాంగాలకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలేజీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు లయోలా సంస్థలకు భూములను విరాళంగా ఇవ్వలేదని, 1952`53లో లయోలా కాలేజీ సొసైటీ కృష్ణా`గుంటూరు జిల్లాల పేరిట కొనుగోలు చేసి వాటిని రిజిస్ట్రేషన్‌ చేసినట్టు పేర్కొన్నారు. కాలేజీకి భూముల కొనుగోలుకు సహకరించిన దాతల కుటుంబాలతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని, కళాశాల భవనాలను దేశవిదేశాల్లో ఉన్న దాతల సాయంతో నిర్మించినట్టు చెబుతున్నారు. కేవలం వ్యక్తిగత కారణాలతోనే వివాదాన్ని పెద్దది చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.వాకర్లను అనుమతించక పోవడం వెనుక పార్టీల ప్రమేయం ఉందనే ఆరోపణల్ని కాలేజీ తోసిపుచ్చింది. ఏ రాజకీయ పార్టీతో తమకు సంబంధం లేదని వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎయిడెడ్‌ కాలేజీలపై తీసుకున్న నిర్ణయాలను న్యాయస్థానంలో సవాలు చేసినట్టు పేర్కొన్నారు. అడ్మిషన్లు, స్కాలర్‌షిప్‌లు, పరిపాలనా వ్యవహారాల్లో మైనార్టీ విద్యా సంస్థల హక్కుల్ని కాపాడాలని కోర్టుల్లో సవాలు చేసినట్టు చెబుతున్నారు.వాకర్ల నుంచి తాము ఎలాంటి ప్రవేశ రుసుము వసూలు చేయలేదని లయోలా స్పష్టం చేసింది. వాకర్లు నిర్వహించే కార్యక్రమాలు, ఉప సంఘాలు ఏర్పాటు, కుల సమావేశాలు, పార్టీల వారీగా విభజన తీసుకురావడం సంస్థ ఆశయాలకు భంగం కలిగించేదిగా ఉండటంతోనే వాకర్లను అనుమతించడం లేదని చెబుతున్నారు.ప్రస్తుత వివాదానికి బయటకు కనిపించని కారణాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. లయోలా కాలేజీ విడుదల చేసిన వీడియోతో ఆ కాలేజీ పూర్వ విద్యార్థుల నుంచి మద్దతు లభిస్తోంది.వాకింగ్‌ సదుపాయాల కోసం ప్రభుత్వాలను డిమాండ్‌ చేయకుండా వేల మంది విద్యార్థులు చదువుకునే కాలేజీ ఎదుట నిరసనలు, దౌర్జన్యాలకు పాల్పడటాన్ని ప్రశ్నిస్తున్నారు. సున్నితమైన ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పూర్వ విద్యార్థులు కోరుతున్నారు. లయోలా విద్యా సంస్థల విషయంలో జరుగుతున్న పరిణామాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Views: 16

Latest News

ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి
అక్రమవలసదారులను పంపించేయండి గౌహాతి-ప్రభాత సూర్యుడు అస్సాం రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడ్డ వారిని వారి స్వస్థలాలకు పంపించి...
AP POLITICS 2025 :మున్సిపాల్టీల్లో పట్టించుకోని కేడర్‌
TG RATION CARD UPDATE :కొత్త కార్డులతో పెరిగిన బియ్యం కోట...
TELANGANA AIRLINE UPDATE 2025 :కొత్తగూడెం ఎయిర్‌ పోర్టుకు లైన్‌ క్లియర్‌
AMARAVATHI NEWS 2025 :లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ!
DELHI ELECTION UPDATE : ఢిల్లీ ఎలక్షన్స్
AP HEALTH ALRET 2025 : ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి