RBI : బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు
యధావిధిగా ఆన్‌లైన్ సేవలు

బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు
యధావిధిగా ఆన్‌లైన్ సేవలు
న్యూఢిల్లీ - ప్రభాత సూర్యుడు
బ్యాంకులు వరుసగా నాలుగు రోజుల పాటు మూతపడనున్నాయి. వారాంతంతో పాటు బ్యాంకుల సమ్మె ఇందుకు కారణం. వచ్చే వారం దేశవ్యాప్తంగా బ్యాంకులు సమ్మెబాట పట్టనున్నాయి. తమ డిమాండ్ల పరిష్కారం కోసం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపునిచ్చింది. మార్చి 23వ తేదీన అర్థరాత్రి నుంచి మార్చి 25 వరకు సమ్మె కొనసాగనుంది. దీంతో ఆ రెండు రోజుల పాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. డిమాండ్ల పరిష్కారం కోసం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తో జరిగిన చర్చలు విఫలమవడంతో యూఎఫ్‌బీయూ సమ్మెకు పిలుపునిచ్చింది . రెండు రోజుల పాటు బ్యాంకుల సమ్మెతో భారత ఆర్థిక రంగం స్తంభించిపోనుంది ఈ సమ్మెలో ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకులతో పాటు- ప్రాంతీయ, గ్రావిూణ బ్యాంకు సిబ్బంది కూడా పాల్గొననున్నారు. అయితే వచ్చే వారంలో బ్యాంకుల సమ్మె అయినప్పటికీ ముందు నుంచే అంటే మార్చి 22 నుంచే బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి.
మార్చి 22న నాల్గవ శనివారం, తరువాత ఆదివారం బ్యాంకులకు సెలవులు. ఆపై మార్చి 24, 25 సోమ, మంగళవారం బ్యాంకుల సమ్మె నేపథ్యంలో దాదాపు నాలుగు రోజుల పాటు- బ్యాంకు సేవలకు అంతరాయం కలుగనుంది. బ్యాంకు సేవలు నిలిచిపోనున్నప్పటికీ ఆన్‌లైన్ సేవలు మాత్రం అందుబాటు-లో ఉండనున్నాయి. అలాగే ఏటీఎం సేవలు కూడా అందుబాటులో ఉంటాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. రెండు రోజుల పాటు సెలవులు, రెండు రోజుల పాటు- సమ్మె కారణంగా నగదు లావాదేవీలు, చెల్లింపులు, అడ్బాన్సులు వంటి బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. తాత్కాలిక ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించడం, అన్ని బ్యాంకులకు ఐదు రోజుల పని దినాలను అమలు చేయడం, పనితీరు సవిూక్షలను ఉపసంహరించుకోవడం, దాడుల నుంచి బ్యాంకు అధికారులు, సిబ్బందికి భద్రత కల్పించడం. గ్రాచ్యుటీ చట్టాన్ని సవరించడం వంటి డిమాండ్లతో బ్యాంకులు సమ్మె బాట పడుతున్నాయి.