What happened when you got there: మిస్టరీగా మారిన మునీరాబాద్ మర్డర్ కేసు
మిస్టరీగా మారిన మునీరాబాద్ మర్డర్ కేసు
హైదరాబాద్-ప్రభాత సూర్యుడు
హైదరాబాద్‌లో వరుస దారుణ హత్యలు కలకలం రేపుతున్నాయి. మహిళలపై హత్యలు నగరవాసులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తరుచుగా మహానగరంలో ఎక్కడో ఓ చోట మహిళలపై దారుణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. రెండ్రోజుల క్రితం భార్యను కిరాతకంగా హతమార్చి కుక్కర్లో ఉడికించిన ఘటన మరువకముందే? మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో జరిగిన యువతి దారుణ హత్య కలవరపెడుతోంది. బండరాళ్లతో కొట్టి, ఆపై పెట్రోల్ పోసి బాడీని తగలబెట్టడం భయానికి గురిచేస్తోంది.చనిపోయింది వివాహితే అంటున్నారు పోలీసులు. నిర్మానుష్య ప్రదేశం కాబట్టి.. ఇష్టంతోనే వచ్చి ఉంటుందని చెబుతున్నారు. మరి ఆ మహిళ ఎవరితో వచ్చిన్నట్లు?? అక్కడి వచ్చాక ఏం జరిగింది?? పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన మర్డరా..? లేక గొడవ వల్లే హత్య జరిగిందా?? అసలు హత్య మాత్రమేనా?? లేక అత్యాచారం చేసి హత్య చేశారా?? అంటే ఇప్పటివరకూ నో ఇన్ఫర్మేషన్‌అతికిరాతకంగా చంపి.. డెడ్‌బాడీని గుర్తుపట్టలేనంతగా కాల్చేశారు దర్మార్గులు. ఏ ఒక్క క్లూ దొరక్కుండా చేశారు. అయితే ఆమె చేతిపై రెండు టాటూలుండటం? అదీ ఇద్దరు అబ్బాయిల పేర్లు ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. మరి ఆ పేర్లు ఎవరివో కనుక్కునే పనిలో పడ్దారు పోలీసులు. అంతేకాదు? మృతురాలి వయస్సు కూడా 25ఏళ్ల లోపేనని అంచనా వేస్తున్నారు.ఇక ఈ మర్డర్ 2019 దిశ ఘటనను పోలి ఉంది. ఒకటి రెండు విషయాలు మినహా మాగ్జిమమ్ అదే సీన్ రిపీట్ అయ్యింది. అప్పుడూ అంతే ఓ వెటర్నరీ డాక్టర్‌ను అత్యాచారం చేసి? ఆ తర్వాత హత్య చేశారు. పోలీసులకు దొరక్కుండా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తగలబెట్టారు. అప్పట్లో ఆ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇప్పుడూ అదే తరహాలో ఓ యువతిని హతమార్చడం కలవరపెడుతోంది.ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్‌ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ సాయంలో ఇప్పటికే ఆధారాలు సేకరించారు. ఎక్కడైనా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయేమోనని పరిశీలిస్తున్నారు. బాధితురాలికి చెందిన కొన్ని నగలను ఘటనాస్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివాహిత ఎడమ చేతికి నరేంద్ర, కుడి చేతికి శ్రీకాంత్ రోహిత్ పేరుతో టాటూలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే మరిన్ని కీలక విషయాలు బయటకొస్తాయంటున్నారు. మొత్తంగా? మునీరాబాద్ మర్డర్ మిస్టరీగా మారింది. ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో పడ్డారు పోలీసులు.https://youtu.be/ZHAM8fggYPc