AP POLITICS : నామినేటెడ్‌ పోస్టులకు కండిషన్స్

On
AP POLITICS : నామినేటెడ్‌ పోస్టులకు కండిషన్స్

నామినేటెడ్‌ పోస్టులకు కండిషన్స్‌..

విజయవాడ- ప్రభాత సూర్యుడు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచిపోయింది. ఇప్పటికే రెండు విడతల్లో దాదాపు 80 పోస్టులను భర్తీ చేసిన సీఎం చంద్రబాబు..ఇప్పుడు మిగిలిన నామినేటెడ్‌ పోస్టులు, పార్టీ పదవుల భర్తీపై ఫోకస్‌ పెట్టారు. జూన్‌లోపు ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్‌ పదవులు భర్తీ చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.ఇతర పార్టీల నుంచి నిన్న మొన్న వచ్చి చేరిన వారి కంటే ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారిని నేతలు ప్రోత్సహించాలన్నారు. మొదటి నుంచి పార్టీని నమ్మకున్న వారికే పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని తేల్చిచెప్పారు. 214 మార్కెట్‌ కమిటీలు, 11వందల ట్రస్ట్‌ బోర్డులు ఉన్నాయని, రానున్న రోజుల్లో ఈ నియామకాలు పూర్తి చేస్తామన్న చంద్రబాబు..పదవి పొందినవాళ్ల రెండేళ్ల పనితీరుపై సవిూక్ష చేస్తామని..పనితీరు ఆధారంగా మళ్లీ నిర్ణయాలు, భవిష్యత్‌ అవకాశాలు ఉంటాయని వివరించారు.వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, దేవాలయ కమిటీల నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు చంద్రబాబు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, దేవాలయ కమిటీల్లో పదవి ఆశిస్తున్న వాళ్లు పార్టీ..క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌, సెక్షన్‌ విభాగాల్లో సభ్యులుగా ఉండాలన్నారు. కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేసేలా నామినేటెడ్‌ పదవులు ఇస్తామని హావిూ ఇచ్చారు చంద్రబాబు.టీడీపీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ ఇంఛార్జ్‌లతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు సీఎం. టీడీపీ సభ్యత్వ నమోదులో బాగా చేసిన వారికి పదవుల్లో ప్రోత్సాహం ఇస్తామన్నారు. ఇక ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు సీఎం. ఎమ్మెల్యేలం..ఎంపీలం అయిపోయాం కాబట్టి ఇక కార్యకర్తలతో పనిలేదని అనుకోవద్దని.. కష్టపడిన క్యాడర్‌, లీడర్‌కు న్యాయం జరిగేలా నామినేటెడ్‌ పదవులు భర్తీ ఉండాలన్నారు.ఇప్పటికే రెండు విడతల్లో నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేసింది కూటమి సర్కారు. అయితే ఆ రెండుసార్లు కూడా..కొందరికి అవకాశం దక్కలేదు. ప్రధానంగా టీడీపీ నుంచి చాలామంది ఆశావహులు ఉన్నారు. ఎన్నికల సమయంలో సీట్లు వదులుకుని..పార్టీ కోసం త్యాగం చేసినవారిలో చాలామంది నామినేటెడ్‌ పోస్ట్‌ కోసం ఎదురు చూస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, నాగుల్‌ విూరా సహా..దేవినేని ఉమా, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వంటివారు వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నారు. వీరికితోడు నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కూడా..అనంతపురం జిల్లాకు చెందిన యామినీ బాల కుటుంబం కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.ఇక గుంటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ కళ్లుకాయలు కాచేలా పదవి కోసం చూస్తున్నారు. ఈయన గత ఎన్నికల్లో టికెట్‌ను త్యాగం చేశారు. అదేవిధంగా పిఠాపురం సీటును త్యాగం చేసిన వర్మ కూడా ఈ జాబితాలోనే ఉన్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా చాలామంది చంద్రబాబు చల్లటి చూపు కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపుగా ఇంకా 60 కార్పొరేషన్ల పదవులను భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో పలు కీలక శాఖల కార్పొరేషన్లు ఉన్నాయి. అలాగే అధికార భాషా సంఘం, సాహిత్య అకాడవిూ, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ఫ్రా కార్పొరేషన్‌, నెడ్‌ క్యాప్‌, ప్రణాళిక సంఘం, స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, కనీస వేతనాల కార్పొరేషన్ల పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇవి కాకుండా పలు కుల సంఘాల కార్పొరేషన్‌ కూడా పెండిరగ్‌లోనే ఉన్నాయి.ఈసారి భర్తీ చేసే పోస్టుల్లో తెలుగు యువతలో కీలకంగా పనిచేసిన నాదెండ్ల బ్రహ్మం చౌదరి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అలాగే గన్ని ఆంజనేయులు, బూరుగుపల్లి శేషారావు, కనపర్తి శ్రీనివాసరావు, సాహెబ్‌, మాల్యాద్రి, దారపునేని నరేంద్ర, ఏవీ సుబ్బారెడ్డి, ప్రభాకర్‌ చౌదరి, సుగుణమ్మ, పరుచూరి కృష్ణ, బండారు హనుమంతరావు, గంటాగౌతమ్‌, పెందుర్తి వెంకటేశ్‌, నల్లపాటి రాము, చిరుమామిళ్ల మధు, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు పదవులు ఆశిస్తున్నారు. జనసేన నుంచి కూడా అమ్మిశెట్టి వాసు, రాయపాటి అరుణ, రామకృష్ణ, బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌, బీజేపీ నుంచి పాతూరు నాగభూషణం, అన్నం సతీష్‌, బాజీ, కోలా ఆనంద్‌ నామినేటెడ్‌ పోస్టుల రేసులో ఉన్నారుఇలా ఆశావహులు లిస్ట్‌ చాలా పెద్దగా ఉంది. కూటమిలోని మూడు పార్టీల నుంచి నామినేటెడ్‌ పోస్ట్‌ కోసం పోటీ పడుతున్న నేతలు..ఎవరికి ఏ కార్పొరేషన్‌ పదవి దక్కుతుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలు, టికెట్‌ త్యాగం చేసిన లీడర్లు అయితే కార్పొరేషన్‌ పదవుల కంటే..ఎమ్మెల్సీ బెర్తుల కోసమే పట్టుబడుతున్నారట. ఎవరికి నామినేటెడ్‌ పోస్టులు దక్కబోతున్నాయి. ఏ నేతలు ఎమ్మెల్సీలు కాబోతున్నారు..పార్టీ పదవుల్లో కీలక పోస్టులు దక్కించుకునేదెవరో మరికొన్ని రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది

Views: 1

Latest News

ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి
అక్రమవలసదారులను పంపించేయండి గౌహాతి-ప్రభాత సూర్యుడు అస్సాం రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడ్డ వారిని వారి స్వస్థలాలకు పంపించి...
AP POLITICS 2025 :మున్సిపాల్టీల్లో పట్టించుకోని కేడర్‌
TG RATION CARD UPDATE :కొత్త కార్డులతో పెరిగిన బియ్యం కోట...
TELANGANA AIRLINE UPDATE 2025 :కొత్తగూడెం ఎయిర్‌ పోర్టుకు లైన్‌ క్లియర్‌
AMARAVATHI NEWS 2025 :లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ!
DELHI ELECTION UPDATE : ఢిల్లీ ఎలక్షన్స్
AP HEALTH ALRET 2025 : ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి