corporators are pouring crores upon crores.తెలంగాణలో పెట్టుబడులు...మరి ఏపీ సంగతేంటో...

On
corporators are pouring crores upon crores.తెలంగాణలో పెట్టుబడులు...మరి ఏపీ సంగతేంటో...

తెలంగాణలో పెట్టుబడులు...మరి ఏపీ సంగతేంటో...
హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు

16 ప్రముఖ సంస్థలు.. 1,64, 050 కోట్ల పెట్టుబడులు..(1.79 లక్షల కోట్లు అని కాంగ్రెస్‌ చెబుతోంది) 47,550 ఉద్యోగాలు.. పరోక్షంగా అంతకుమించి.. తెలంగాణ రైజింగ్‌ అనే నినాదాన్ని నిజం చేసి చూపించాం.. పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాదును నెలకొల్పాం.. కాంగ్రెస్‌ సోషల్‌ విూడియా గురువారం ఉదయం నుంచి ఇవే లెక్కలు చెబుతోంది.సన్‌ పెట్రో కెమికల్స్‌ అనే సంస్థ 45,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. ఈ కంపెనీ భారీపంప్డ్‌ స్టోరేజీ విభాగంలో కార్యకలాపాలు సాగిస్తుంది. జల విద్యుత్తు, సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. నాగర్‌ కర్నూల్‌, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది.. 3400 మెగా వాట్ల పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో విద్యుత్‌ ను ఉత్పత్తి చేస్తుంది. 5,440 మెగా వాట్ల సోలార్‌ విద్యుత్‌ ను ఉత్పత్తి చేస్తుంది.అమెజాన్‌ కంపెనీ వెబ్‌ సర్వీసెస్‌ విభాగంలో పెట్టుబడులు పెట్టనుంది. ఆర్టిఫిషల్‌ ఇంటెలిజెన్స్‌, క్లౌడ్‌ సర్వీసెస్‌ డేటా సెంటర్‌ విభాగంలో 60 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.కంట్రోల్‌ ఎస్‌ అనే సంస్థ అత్యాధునిక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ డేటా సెంటర్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయనుంది. 400 మెగాబట్ల సామర్థ్యంతో డాటా సెంటర్‌ నిర్మించనుంది. ఇందులో భాగంగా 10 వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది. దీని ద్వారా 3,600 మందికి ఉపాధి లభిస్తుంది.
ఏూచి సంస్థ మానవ రహిత ఏరియల్‌ సిస్టం తయారీ యూనిట్‌ నెలకొల్పనుంది. రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తులను తయారుచేస్తుంది.. ఈ ప్రాజెక్టు తెలంగాణ అభివృద్ధిలో కీ రోల్‌ ప్లే చేస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ కంపెనీ 800 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. 200 మందికి ఉద్యోగాలు అందిస్తుంది.స్కై రూట్‌ ఏరో స్పేస్‌ అనే సంస్థ తెలంగాణలో ఇంటిగ్రేటెడ్‌ ప్రైవేట్‌ రాకెట్‌ లను తయారు చేయనుంది. ఇంటిగ్రేషన్‌, టెస్టింగ్‌ యూనిట్‌ కోసం 500 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.మేఘా(కంపెనీ మూడు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. 2,160 మెగా వాట్ల పంప్డ్‌ స్టోరేజ్‌ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టును నిర్మించనుంది. అనంతగిరిలో వరల్డ్‌ క్లాసు లగ్జరీ వెల్నెస్‌ రిసార్టును నిర్మించనుంది 15వేల కోట్ల పెట్టుబడులను పెట్టడం ద్వారా 5,250 మందికి ఉపాధి కల్పిస్తుంది.ఊఅఒ కంపెనీ హైటెక్‌ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్‌ ఏర్పాటు చేయనుంది. దీనిద్వారా 5000 మందికి ఉపాధి లభిస్తుంది.విప్రో కంపెనీ గోపనపల్లి క్యాంపస్‌ లో కొత్త ఐటీ సెంటర్‌ ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా 5,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.ఇన్ఫోసిస్‌ పోచారంలో క్యాంపస్‌ ను విస్తరించనుంది. 750 కోట్లు పెట్టుబడులు పెడుతుంది. దీని ద్వారా 17,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తుందికామారెడ్డి జిల్లాలో యూనిలీవర్‌ కంపెనీ పామాయిల్‌ ఫ్యాక్టరీ రిఫైనింగ్‌ యూనిట్‌ ను ఏర్పాటు చేస్తుంది. బాటిల్‌ క్యాప్‌ లను ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త తయారీ యూనిట్‌ ద్వారా 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.టిల్మాన్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌.. ఈ కంపెనీ హైదరాబాదులో అత్యధిక డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. మూడువేల మెగా వాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్‌ ను నిర్మిస్తుంది. 15వేల కోట్లను దశలవారీగా పెట్టుబడులుగా పెడుతుంది.. వేలాది మందికి ఈ కంపెనీ ఉద్యోగాలు ఇస్తుంది.ఉర్సా క్లస్టర్స్‌: ఈ కంపెనీ అమెరికన్‌ చెందింది. ఇది అత్యాధునిక ఆర్టిఫిషియల్‌ డేటా సెంటర్‌ హబ్‌ ను ఏర్పాటు చేయనుంది. 5000 కోట్లను పెట్టుబడులుగా పెడుతుంది..బ్లా

112454550

క్‌ స్టోన్‌: ఈ కంపెనీ ప్రపంచ అగ్రగామి సంస్థగా ఉంది.. ఇది 150 మెగా వాట్ల డేటా సెంటర్‌ ను ఏర్పాటు చేయనుంది..4,500 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఈ కంపెనీ వేలాది మందికి ఉపాధి కల్పిస్తుందిఅక్షత్‌ గ్రీన్‌ టెక్‌: ఈ కంపెనీ అత్యధిక సోలార్‌ సెల్స్‌, మాడ్యూల్స్‌ తయారు చేస్తుంది. దీనికోసం 7000 కోట్లను పెట్టుబడులుగా పెడుతోంది.
ఎక్లాట్‌ హెల్త్‌ సొల్యూషన్స్‌: ఈ కంపెనీ ఆరోగ్య సంరక్షణలో పేరుపొందింది.. ఇది 800 మందికి ఉద్యోగాలు అందించేలాగా హైదరాబాదులో కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తోంది.సుహానా మసాలా: సంగారెడ్డిలో ప్రస్తుతం సుహాన ప్లాంట్‌ ఉంది. దీని పక్కనే ఎక్స్‌ లెన్స్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేయనుంది.
మరీ ఏపీలో..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబు, ఐటీ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ వెళ్లినట్టుగానే.. చంద్రబాబు, నారా లోకేష్‌, ఇతర అధికారులు దావోస్‌ వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ కో కంపెనీతో ఒప్పందం మినహా.. మిగతా కంపెనీలతో ఎం ఓ యు లు, పెట్టుబడులు కుదుర్చుకున్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ ఈ ప్రశ్నను గనుక టిడిపి లేదా దాని అనుకూల విూడియాను వేస్తే.. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులు కేవలం కనెక్టింగ్‌ ప్లాట్‌ ఫారం లాగానే ఉపయోగపడతాయి. అంతే తప్ప అక్కడే అన్ని కుదిరిపోవాలని లేదు. గతంలో మాత్రం దావోస్‌ విజయాలంటూ టిడిపి అనుకూల విూడియా ఊదరగొట్టింది. మరి ఇప్పుడు పెట్టుబడులు రాకపోవడానికి జగన్‌ నీచ విధానాలు.. నికృష్ట పరిపాలనే కారణమని ఆల్రెడీ మొదలుపెట్టారు. లోకేష్‌ ఆల్రెడీ అదే తిరుగా మాట్లాడుతున్నాడు. అధికారంలోకి జగన్‌ మరోసారి రాడని చెబితే తప్ప కార్పొరేటర్లు పెట్టుబడులు పెట్టరని అంటున్నాడు.. కనీసం ప్రచారం కోసమేనాచంద్రబాబు నాలుగు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెబితే విూడియా ఎలాగూ డబ్బాలు కొడుతుంది కదా..తెలంగాణ ను కెసిఆర్‌ మస్తు అభివృద్ధి చేశాడు.. అందువల్లే ఈ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. కోట్లకు కోట్లను కార్పొరేటర్లు కుమ్మరిస్తున్నారని గులాబీ నాయకులు.. గులాబీ అనుకూల విూడియా ఇంకా ప్రచారం మొదలుపెట్టలేదనుకుంటా..

 

Views: 0

Latest News

ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి
అక్రమవలసదారులను పంపించేయండి గౌహాతి-ప్రభాత సూర్యుడు అస్సాం రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడ్డ వారిని వారి స్వస్థలాలకు పంపించి...
AP POLITICS 2025 :మున్సిపాల్టీల్లో పట్టించుకోని కేడర్‌
TG RATION CARD UPDATE :కొత్త కార్డులతో పెరిగిన బియ్యం కోట...
TELANGANA AIRLINE UPDATE 2025 :కొత్తగూడెం ఎయిర్‌ పోర్టుకు లైన్‌ క్లియర్‌
AMARAVATHI NEWS 2025 :లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ!
DELHI ELECTION UPDATE : ఢిల్లీ ఎలక్షన్స్
AP HEALTH ALRET 2025 : ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి