It is winter now. The cold continues to be severe:విచిత్రమైన వాతావరణం... వ్యాధులకు అవకాశం

On
It is winter now. The cold continues to be severe:విచిత్రమైన వాతావరణం... వ్యాధులకు అవకాశం

విచిత్రమైన వాతావరణం... వ్యాధులకు అవకాశం
హైదరాబాద్‌-ప్రభాత సూర్యుడు


కాలుష్యం కాలాలను మర్చేస్తోంది. పెరుగుతున్న పొల్యూషన్‌తో ఏ సీజన్‌లో ఉండాల్సిన వాతావరణం ఆ సీజన్‌లో ఉండడంతో వేసవిలో వానలు కురుస్తున్నాయి. వానాకాలం, చలికాలంలో ఎండదు కొడుతున్నాయి. దీంతో మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. వ్యాధులు ముసురుకుంటున్నాయి.ప్రస్తుతం శీతాకాలం. చలి తీవ్రత కొనసాగుతోంది. అయితే ఇదే సమయంలో మధ్యాహ్నం ఎండ దంచి కొడుతోంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెల్లవారు జాము వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకన్నా తక్కువగా నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల వరకు పొగ మంచు కురుస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో తెల్లవారాక కూడా లైట్లు వేసుకుని వెళ్తున్నారు. ఇక ఉదయం 9 గంటలు దాటగానే మళ్లీ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా శీతాకాలంలో 25 నుంచి 30 డిగ్రీలలోపే నమోదు కావాలి. కానీ, వారం పది రోజులుగా తెలంగాణలో భిన్నంగా ఉంటున్నాయి. 30 నుంచి 32 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 34 డిగ్రీల వరకు పెరుగుతున్నాయి. దీంతో ఎండ తీవ్రత ఎక్కువగా అనిపిస్తోంది. చిరు వ్యాపారులు, మధ్యాహ్నం బయటకు వచ్చిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాత్రి చలికి గజగజ వణుకుతున్న జనాలు.. పగలు ఎండలు చూసి ఇప్పుడే ఇంత ఎండలా అని ఆశ్చర్యపోతున్నారు.తెలంగాణలో ప్రస్తుతం భిన్న వాతావరణం నెలకొంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాత్రి ఉష్ణోత్రలు కొన్ని జిల్లాలో 10 డిగ్రీలకు దిగువన నమోదవుతున్నాయి. సంగారెడ్డిలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలుగా నమోదైంది. కుమురంభీం ఆసిఫాబాద్‌లో 7, రంగారెడ్డిలో 8, వికారాబాద్‌లో 9, కామారెడ్డి, రాజన్న సిరిసల్ల, మహబూబ్‌నగర్‌లో 10, నిర్మల్‌, ఆదిలాబాద్‌లో 12 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యా. జీహెచ్‌ఎంసీ పరదిలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాజేంద్రనగర్‌లో 9 డిగ్రీలు, పటాన్‌చెరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.ఇక పగలు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్‌, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 32 డిగ్రీలుగా నమోదైంది. ఆదిలాబాద్‌, జగిత్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్‌, సంగారెడ్డి తదితర జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి.మారుతున్న వాతావరణం వ్యాధులకు కారణమవుతోంది. తోంది. రాత్రి వేళ.. చలి చంపేస్తోంది. అయితే తెలంగాణ వాసులకు చలి గాలుల నుంచి ఇప్పుడిప్పుడే ఉపశమనం ఉండేలా లేదు. అలాంటి వేళ.. భారత వాతావరణ విభాగం కీలక అప్‌ డేట్‌ ఇచ్చింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. హైదరాబాద్‌ నగర ప్రజలకు శీతాకాలపు చలి గాలుల నుండి ఉపశమనం లభించే అవకాశం లేదట. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ సైతం ప్రకటించింది.ఇక ఉష్ణోగ్రతలు రాత్రి పూట 11 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, కొమరం భీమ్‌, మంచిర్యాలు, నిర్మల్‌, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌, ములుగు, సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, ఉమ్మడి వరంగల్‌ జిల్లా, వికారాబాద్‌, మేడ్చల్‌ ? మల్కాజిగిరి, హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది.అలాగే రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగాం, మహబూబాబాద్‌, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు సైతం ఇదే వాతావరణం వర్తిస్తోందని స్పష్టం చేసింది. అయితే తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలో బుధవారం అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 9.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. మరోవైపు తెలంగాణలో ఉదయం పూట భారీగా చలి వేస్తోంటే.. మధ్యాహ్నం మాత్రం ఎండలు మాత్రం మండిపోతున్నాయి. ఇంకా ఉదాహరణగా చెప్పాలంటే.. ఉదయం పూట ఉష్ణోగ్రతలు10 డిగ్రీల లోపే ఉంటున్నాయి. కానీ మధ్యాహ్నం కాగానే ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న పరిస్థితి ఉంది.మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో కనిష్టంగా16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతోంటే.. గరిష్టంగా 32 డిగ్రీలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. అయితే ఈ భిన్న వాతావరణం వల్ల ప్రజలు.. సీజనల్‌ వ్యాధులతోపాటు ఇతర ఇబ్బందులకు గురయ్యే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడిరచింది..చలి, ఎండ కారణంగా శరీరం మార్పులకు లోనవుతోంది. దీంతో దగ్గు, జలుబు. జ్వరం కేసులు పెరుగుతున్నాయి. ఇక ఉష్ణోగ్రతలు పెరిగితే డెంగీ కేసులు పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఇలాంటి వాతావరణం దోమలు వృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటుందని పేర్కొంటున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం ఎండ కారణంగా శీతల పానీయాలు తీసుకోవడం, రాత్రి చలికి దుప్పట్లు కప్పుకోవడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయని సూచిస్తున్నారు. చల్లని పదార్థాలు తీసుకోవద్దని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఈ వాతావరణ పరిస్థితులు మరో పది రోజులు ఇలాగే ఉంటాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.

Views: 0

Latest News

ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి
అక్రమవలసదారులను పంపించేయండి గౌహాతి-ప్రభాత సూర్యుడు అస్సాం రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడ్డ వారిని వారి స్వస్థలాలకు పంపించి...
AP POLITICS 2025 :మున్సిపాల్టీల్లో పట్టించుకోని కేడర్‌
TG RATION CARD UPDATE :కొత్త కార్డులతో పెరిగిన బియ్యం కోట...
TELANGANA AIRLINE UPDATE 2025 :కొత్తగూడెం ఎయిర్‌ పోర్టుకు లైన్‌ క్లియర్‌
AMARAVATHI NEWS 2025 :లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ!
DELHI ELECTION UPDATE : ఢిల్లీ ఎలక్షన్స్
AP HEALTH ALRET 2025 : ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి