Nothing but selling lands during the Congress rule :మంత్రి పొంగులేటిపై ఎమ్మెల్యే మాధవరం మండిపాటు
మంత్రి పొంగులేటిపై ఎమ్మెల్యే మాధవరం మండిపాటు
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు
తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై కూకట్ పల్లి బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు నిప్పులు చెరిగారు. హౌసింగ్ బోర్డు స్థలాలను అమ్మి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ జీ ఓ 6 ప్రకారం ఇండ్ల వేలం లో ఇంటీ పక్కన వారికే స్థలాన్ని అమ్మాలి అని ఉండగా వాటిని తుంగలో తొక్కి లక్ష 25 వేల రూపాయలకు పైగా గజం పేరిట అమ్ముతున్నారు అని తెలిపారు. మాస్టర్ ప్లాన్ ఉన్న ఉన్న విదంగా కాకుండా అమ్మకాలు జరుగుతున్నాయి అని తాము చెపుతుంటే పోలీసులను ఉపయోగించి తెల్లవారుజామున నుండి హౌస్ అరెస్ట్ చేయడం ఏమిటి అని ప్రశ్నించారు. తాను కూడా వేలం పాటలో పాల్గొనేందుకు గాను డిడి సైతం తీశానని ప్రస్తుతం పోలీసులు తనని వేలంపాటలో పాల్గొనేందుకు అనుమతించడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో భూములను అమ్ముకోవడమే తప్ప కాపాడే పరిస్థితి లేదని అన్నారు. అధికారులు సైతం ప్రజలను మోసం చేసే విధంగా మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా అమ్మకాలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వారి పైన కూడా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు