Local MLA Madhavaram Krishna Rao's demand:కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు
![Local MLA Madhavaram Krishna Rao's demand:కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు](https://www.prabhathasuryudu.com/media-webp/2025-01/hq720-(12).jpg)
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు
శుక్రవారం నాడు కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ స్థలాల వేలంపాటలో భాగంగా వేలంపాటను అడ్డుకుంటాం అన్న మాధవరం కృష్ణారావును కూకట్పల్లి పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు.
హౌసింగ్ బోర్డ్ స్థలాలు ఇప్పటికే 24 ఫ్లాట్లను వేలం వేస్తున్నట్లుగా ప్రకటించారు. అందులో రెండు ప్లాట్లు 2008 సంవత్సరంలో హెచ్‌ఎండిఏ 200 ఫీట్ల రోడ్డుగా నిర్ధారించింది. అదే రోడ్డును హౌసింగ్ బోర్డ్ అధికారులు 80 ఫీట్ల రోడ్డుగా చూపుతూ వేలం నిర్వహిస్తున్నారు. వేలంలో ఆ రెండు ఫ్లాట్ లను కొనుగోలు చేసిన వారు నష్టపోతారని వాటిని ఎట్టి పరిస్థితుల్లో వేలం వెయ్యోద్దని స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేసారు. వేలంలో కొనుక్కున్న వాళ్లు 200 ఫీట్లా రోడ్డు విస్తరణలో నష్టపోతారు కాబట్టి ఆ రెండు ఫ్లాట్ల వేలాన్ని నింపేయాలని లేకపోతే వేలం అడ్డుకుంటానని చెప్పారు. ఏం చెప్పినా వినకుండా వేలం వేస్తానని హౌసింగ్ బోర్డ్ అధికారులు చెబుతున్నారు. ఉదయం 10:30కు వేలం నిర్వహిస్తుండడంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
ప్రజలను అన్యాయం చేస్తూ వేలం వేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిర్యాదు చేసారు.