MIRACLE IN ANNAMAYYA DISTRICT :అన్నమయ్య జిల్లాల్లో పురాతన విగ్రహాలు

On
MIRACLE IN ANNAMAYYA DISTRICT :అన్నమయ్య జిల్లాల్లో పురాతన విగ్రహాలు

An ancient idol was found in a field in Annamayya district

అన్నమయ్య జిల్లాల్లో పురాతన విగ్రహాలు
కడప  - ప్రభాత సూర్యుడు

అన్నమయ్య జిల్లాలో పొలంలో పురాతన విగ్రహం బయటపడిరది. తంబళ్లపల్లె మండలం కోటకొండ పంచాయతీ ఏటగడ్డపల్లె సవిూపంలో ఓ రైతు బుధవారం పొలం దున్నుతున్నాడు. ఈ క్రమంలో పొలంలో మహా విష్ణువు విగ్రహం బయటకు వచ్చింది.. దానిపై ఉన్న మట్టిని తొలగించి బయటకు తీశారు. ఈ విషయం తెలియడంతో స్థానికులు భారీగా తరలివచ్చారు.. స్వామివారి విగ్రహాన్ని పూజించి దర్శించుకున్నారు. ఈ విషయం స్థానిక తహసీల్దార్‌, పోలీసులకు తెలియడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు.. పొలంలో బయటపడిన ఆ విగ్రహాన్ని పరిశీలించారు. ఈ మహా విష్ణువు విగ్రహం దాదాపు మూడు అడుగుల ఎత్తు ఉంది.మహా విష్ణువు విగ్రహం బయటపడిన పొలాన్ని ఎవరూ దున్నకూడదని తహసీల్దార్‌ రైతులను ఆదేశించారు. అయితే నాలుగు రోజుల క్రితం కూడా ఆ సవిూపంలోనే మరో రెండు విగ్రహాలు బయటపడ్డాయి. దీంతో ఆ పొలం ఉన్న ప్రాంతంలో పురాతన ఆలయ అవశేషాలు ఉంటాయని అనుమానిస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించేందుకు పురావస్తు శాఖ అధికారులను పిలిపించనున్నారు. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపడతామని తహసీల్దార్‌ తెలియజేశారు. పొలంలో బయటపడిన ఈ మహా విష్ణువు విగ్రహం ఏ కాలం నాటిదో పురావస్తు అధికారులు తేల్చాల్సి ఉంది. ఈ విగ్రహం బయటపడిన అంశం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది.మరోవైపు మండలంలోని కోటకొండలోనే నాలుగు రోజుల క్రితం రైతు పొలంలో రెండు పురాతన రాతి దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. మద్దిరాళ్లపల్లెకు చెందిన రంగారావు పొలాన్ని వెంకటేష్‌ అనే రైతు కౌలుకు తీసుకున్నాడు. ఆయన ఆదివారం రోజు ఆ పొలాన్ని ట్రాక్టర్‌తో దున్నించగా.. వెంకటేష్‌ సోమవారం ఉదయం ఆ పొలం చూసేందుకు వెళ్లాడు. అక్కడ మట్టితో కప్పి రెండు రాళ్లులా కనిపించాయి. వెంటనే ఆ మట్టి తొలగించి చూడగా.. రెండు పురాతన రాతి విగ్రహాలుగా గుర్తించారు. వెంటనే ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తెలిసింది.. వెంటనే అక్కడికి చేరుకుని.. ఆ రెండు రాతి విగ్రహాలను పరిశీలించి ప్రత్యేక పూజలు చేశారు. తాజాగా మరో విగ్రహం కూడా బయటపడిరది.

Views: 41

Latest News

ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి
అక్రమవలసదారులను పంపించేయండి గౌహాతి-ప్రభాత సూర్యుడు అస్సాం రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడ్డ వారిని వారి స్వస్థలాలకు పంపించి...
AP POLITICS 2025 :మున్సిపాల్టీల్లో పట్టించుకోని కేడర్‌
TG RATION CARD UPDATE :కొత్త కార్డులతో పెరిగిన బియ్యం కోట...
TELANGANA AIRLINE UPDATE 2025 :కొత్తగూడెం ఎయిర్‌ పోర్టుకు లైన్‌ క్లియర్‌
AMARAVATHI NEWS 2025 :లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ!
DELHI ELECTION UPDATE : ఢిల్లీ ఎలక్షన్స్
AP HEALTH ALRET 2025 : ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి