Pedda Ambarpet : పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పండుగల జయశ్రీ రాజు

మున్సిపల్ కమిషనర్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డికి పుష్పగుఛ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నపెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ తాజా మాజీ చైర్ పర్సన్ పండుగల జయశ్రీ రాజు
పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పండుగల జయశ్రీ రాజు
అబ్దుల్లాపూర్ మెట్ - ప్రభాత సూర్యుడు
పదోన్నతి పొందిన పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డికి తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పండుగల జయశ్రీ రాజు శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీలో గ్రేడ్ - 3 కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న సింగిరెడ్డి రవీందర్ రెడ్డి గ్రేడ్ - 2 కమిషనర్ గా పదోన్నతి పొందారు. అదేవిధంగా తుర్క యాంజాల్ మున్సిపాలిటీ ఇంచార్జ్ కమిషనర్ గా అదనపు భాద్యతలు చేపట్టిన సందర్భంగా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ తాజా మాజీ చైర్ పర్సన్ పండుగల జయశ్రీ రాజు శుక్రవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం శాలువా కప్పి సన్మానించారు. అదేవిధంగా గత కొన్ని రోజులుగా సెలవులపై వెళ్లిన మున్సిపాలిటీ డీఈ శివానందం తిరిగి విధులకు హజరైన సందర్భంగా పండుగల రాజు జయశ్రీ ఆయనకు స్వాగతం పలికారు.