Turka Yamjal Muncipality : తుర్క యంజాల్ మున్సిపాలిటీ ఇంచార్జ్ కమిషనర్ గా సింగిరెడ్డి రవీందర్ రెడ్డి*

ఇంచార్జ్ కమిషనర్ గా భాద్యతలు స్వీకరింస్తున్న సింగిరెడ్డి రవీందర్ రెడ్డి
*తుర్క యంజాల్ మున్సిపాలిటీ ఇంచార్జ్ కమిషనర్ గా సింగిరెడ్డి రవీందర్ రెడ్డి*
తుర్క యంజాల్ - ప్రభాత సూర్యుడు
తుర్క యంజాల్ మున్సిపాలిటీ ఇంచార్జ్ కమిషనర్ గా సింగిరెడ్డి రవీందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుండి ఉత్తర్వులు రావడంతో శుక్రవారం ఆయన భాద్యతలు స్వీకరించారు. పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీలో గ్రేడ్ - 2 కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న రవీందర్ రెడ్డి తుర్క యంజాల్ మున్సిపాలిటీ ఇంచార్జ్ కమిషనర్ అదనపు భాద్యతలు చేపట్టారు. ఇదే మున్సిపాలిటీలో కమిషనర్ గా విధులు నిర్వహించిన అమరేందర్ రెడ్డి సెలవులపై వెళ్లడంతో రవీందర్ రెడ్డికి ఇంచార్జ్ భాద్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా కమిషనర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల, తాజా మాజీ ప్రజాప్రతినిధుల సమన్వయంతో తుర్క యంజాల్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.