Nerella Sharada : సమిష్టిగా మహిళలు ముందుకు సాగాలి
Telangana State Chairperson of Women's Commission Nerella Sharada About Womens Mege Conclave
సమిష్టిగా మహిళలు ముందుకు సాగాలి
- మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు
ఒకరికొకరు సహకరించుకుంటూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద సూచించారు. బంజారాహిల్స్ పార్క్ హయ్యత్ హోటల్లో వైశ్య బిజినెస్ నెట్వర్క్ (వి బి ఎన్) ఆధ్వర్యంలో ఉమెన్స్ మెగా కాంక్లేవ్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేరెళ్ల శారద, టిడిపి నేషనల్ స్పోక్స్ పర్సన్ జోత్స్న లు హాజరై సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రో అండ్ లెట్ గ్రో అనే నినాదంతో విబిఎన్ పనిచేయడం అభినందన ఏమని అన్నారు. మహిళ సాధికారత కోసం కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రస్తుతం మహిళలు పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారని అన్నారు. వ్యాపార కార్యకలాపాల నిర్వహణలో కూడా అవకాశాలను అందిపుచ్చుకొని మరింత మహిళా శక్తిని చాటాలని సూచించారు.