Thala Telugu Movie : గ్రాండ్‌గా 'తల’ ట్రైలర్ లాంచ్
Thala Movie Trailer Launch | Nora Ester | Amma Raagin Raj | S.S. Thaman | AMMA Rajashekar
హీరోలు సొహైల్, అశ్విన్ బాబు చేతుల మీదుగా గ్రాండ్‌గా 'తల’ ట్రైలర్ లాంచ్
మూవీ డెస్క్ - ప్రభాత సూర్యుడు
అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఆయన తనయుడు అమ్మ రాజ్ హీరోగా రూపొందిన చిత్రం అంకిత నాన్సర్ హీరోన్ నటించింది. పి. శ్రీనివాస్ గౌడ్ నిర్మాతగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ రాధ రాజశేఖర్ వ్యవవహరించారు. రోహిత్ మిస్టర్ నోరో, సత్యం రాజేష్, ముక్కు అవినాశ్, విజ్జి చంద్రశేఖర్ రాజీవ్ కనకాల, ఇంద్రు కీలక పాత్రలు పోషించారు. మంగళవారం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ గాండ్ ఈవెంట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్లో జరిగింది. సోహైల్ హీరో అశ్విన్ ట్రైలర్ విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ఎడిటర్ శివ స్వామి మాట్లాడుతూ.. ట్రైలర్ ఎంత బావుందో సినిమా అంతకు మించి ఉంటుంది. . ప్రతి సీన్ లో ఎలివేషన్స్ ఉంటాయి. ట్రైలరలో చాలా తక్కువ చూపించాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఫిబ్రవరి 16న మీ ముందుకు వస్తున్నాం" అన్నారు.
డి వెంకట్ మాట్లాడుతూ.. 'అమ్మ రాజశేఖర్ సినిమాల ఇది వరకే చూసి ఉన్నారు. చాలా గ్యాప్ తీసుకుని మీ ముందుకు వస్తున్నారు. చాలా కసితో తల తాకట్టు పెట్టెనా హిట్ కొట్టాలనుకున్నారు. ఈ సినిమాను నిర్మించిన శ్రీనివాస్ గానికి, క్రూకి ప్రత్యేక కృతఙ్ఞతలు. మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నా" అన్నాడు.
మ్యూజిక్ డైరెక్టర్ ధర్మతేజ " సినిమాకు చాగా ఎఫర్ట్స్ పెట్టి చేశాం. ఈ సినిమా ట్రైలర్ పై మించి ఉంటుంది. ఈ సినిమాని ఫిబ్రవరి 14న మీ ముందుకు తీసుకొస్తున్నందుకు దీపా ఆర్ట్స్ వారికి ధన్యవాదాలు రాగి రాజశేఖర్ చాలా బాగా యాక్ట్ చేశాడు. సినిమా అంతా చాలా నేచురల్ గా ఉంటాడు" అన్నారు.
సందీప్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించడాం ఆనందంగా ఉంది. సెట్లో చాలా కంపర్లబులెగా వర్క్ చేశాం. ఈ చాలా ఎంజాయ్ చేశాను. అమ్మ రాజశేఖర్ గారికి కృతఙ్ఞతలు, ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఇష్టపడతారు. రాగిన్ చాలా బాగా నటించారు" అన్నాడు.
ఎస్తర్ మాట్లాడుతూ.. ఈ క్యారెక్టర్ మీరే చేయాలని చెప్పి నాతో నటింపజేశారు. ఈ సినిమా రాగిన లుక్ చాలా బావుంది. ట్రైలర్ నచ్చింది. అంకితను కూడా చాలా బాగా చూపించారు. సినిమా సక్సెస్ కావాలంటే ఒక్కరు పని చేస్తే చాలడు. ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించిన సినిమా ఈ ఈ సినిమా మా మమ్మీని హైదరాబాద్ కు తీసుకొచ్చి ఆమెతో కలిసి చూడాలని ఉంది. ప్రతి ఒక్కరూ సినిమా చూడండి మీ బైస్సెంగ్స్ కావాలి. ఈ సినిమా పని చేసిన ప్రతి ఒక్కరికి టర్నింగ్ పాయింట్ అవ్వాలి. అందరికి కెరీర్ గ్రాఫ్ డబుల్, త్రిబుల్ అవ్వని నా కోరిక, ప్రొడ్యూసర్ గారికి స్పెషల్ థ్యాంక్స్, నన్ను తమిలంలో లాంచ్ చేస్తున్నారు" అని తెలిపాడు.
హీరోయిన్ అంకిత మాట్లాడుతూ.. నేను బెంగాలీ. ఇదినా ఫస్ట్ సినిమా ఫస్ట్ ఎక్స్పరియన్స్, ఈ అవకాశం ఇచ్చినందుకు అమ్మ రాజశేఖర్ సర్ కి థాంక్యూ. ఫిబ్రవరి 14న మా సినిమా వస్తోంది. వాలైంటైన్స్ డే. ప్రతి ఒక్కరూ సినిమా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అన్నారు.
హీరో రాగిన్ మాట్లాడుతూ.. మూవీలో అంతా చాలా కష్టపడ్డారు. క్లైమేట్ మారడంతో ఇబ్బంది పడ్డాం. మా అమ్మ, నాన్న ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సహాయం చేశారు. శ్రీనివాస్ గౌడ్ సర్ ఈ సినిమాను నిర్మించినంచుకు ధన్యవాదాలు" అన్నారు.
అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల అవుతుంది. వాలంటైన్స్ డేన ఈ చిత్రం అలచిస్తుందని కోరుకుంటున్నాం ఈ సినిమా మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళుతుంది. యాక్షన్, సాంగ్స్ అన్నీ కంటెంటీలో భాగమే" అన్నారు.
నటుడు రాజేష్ మాట్లాడుతూ.. రాగిన్ రాజ్ నాకు చిన్నప్పటి నుంచి తెలును అమ్మ రాజశేఖర్ ఫస్ట్ సినిమా రణం' చేస్తున్నప్పుడు నుంచి వేషం ఉండని చెప్పారు. ఆ సినిమాలో వేషం ఇవ్వలేదు. అదేం అడిగితే నెక్స్ట్ సినిమా అన్నారు. రెండు మూవీస్ తర్వాత అవకాశు ఇచ్చారు. ఒకసారి అనుకోకుండా మేం కలిశాం ఉదయం నుంచి సాయంత్రం వరకూ చెన్నై మొత్తం తిప్పి చూపించారు. రాగిన్ పుట్టినరోజుకి వెళ్లాను ఆ తరువాత నాకు ఫోన్ చేసి మా అబ్బాయి హీరో అంటే నేను ముసలి అవుతున్నట్టు అనిపించింది. హీరోకి ఉండాల్సిన లక్షణాన్నీ ఉన్నాయి. తల వైలెంట్ వాలెంటైన్స్ డేనాడు విడుదలవుతుంది. అంతా చూడండి' అన్నాడు.
నటుడు సోహైల్.. తల ఎవరిదో తెలియదు కానీ ముందు మోషన్ టీజర్ పంపాడు. అమ్మ రాజశేఖర్ నాకు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ నుంచి తెలుసు. తరువాత బిగ్బాస్ తో కలిశాం నిజంగానే అమ్మ రాజశేఖర్ పేరుకు తగ్గట్టే అందరికీ వండి పెట్టేవాడు. తినకున్నా అడిగి మరీ పుడ్ పెట్టేవారు. తను కింద కూర్చొని భోజనం చేస్తాడు. ఇప్పటికీ అదే మెయిన్టైన్ చేస్తారు. రణం సినిమా తర్వాత ఈ మూవీ కంబ్యాక్ గా అనిపిస్తోంది. తల టీజర్ చూడగానే అమ్మ రాజశేఖర్ బ్యాక్ అనిపించింది. రాగిన్ చిన్నోడి ల ఉన్నాడు. నెక్ట్స్ ధనుష్ అవుతాడు ఇండస్ట్రీకి" అన్నారు.
హీరో అశ్విన్ మాట్లాడుతూ.. "తల ట్రైలర్ చూశాను ఎక్స్ట్రార్డినరీగా ఉంది. రాగిన్ అదృష్టవంతుడు. నాన్న దర్శకుడు, అమ్మ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అక్క ఏడీ. ముగ్గురి చేతుల మీదుగా సినిమా లాంచ్ అవ్వడం లక్కీ. విజువల్స్ కంటెంట్ తక్కువ బడ్జెట్లో అద్భుతంగా చేశారు. ఆర్ఆర్ దాలా బాగుంది. దీపా ఆర్ట్స్ హ్యాండ్ పడితే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కరికీ బిగ్ కంగ్రాట్స్, తల మూవీని అవలించండి" అన్నాడు.
రాజశేఖర్ మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో అంతా అమ్మ రాజశేఖర్ ఫినిష్ అని చెప్పారు. ఇప్పుడు తలతో వచ్చా.. చెయ్యితో, కాలితో అన్నిటితో వస్తా అమ్మకు ఒంట్లో బాగోలేకపోవడాం వల్ల కాస్త గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం నేను ఫ్రీ. నా కొడుకుతో సినిమా చేయాలనేది చిన్నప్పటి నుంచి నా కోరిక. ఓ సిట్యూషన్లో వేరే అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా చేస్తానని చెప్పాను. అదెప్పుడనేది అందరికి తెలుసు. అప్పటి నుంచి నిద్ర లేదు. నలరియల్ లైఫ్ లవ్ ప్రపోజ్ చేసి నెక్స్ట్ డే పెళ్లి చేసుకున్నా కథ కాకుండా ఏం చేయాలని ఆలోచించి మాస్ తీయాలనుకున్నా, అబ్బాయితో ఎలా చేయాలని రెండేళ్లు ఆలోచించి ఒక పాయింట్ దానికి ఒక కొత్త పాయింట్ తీసుకున్నా, కొత్తదనం కావాలనుకునే వాడు సినిమా ఆనందంగా చూడవచ్చు. శ్రీనివాస్ గౌడ్ గారు నా దేవుడు. నా కుటుంబం మొత్తం రుణపడి ఉంటాల ఈ మూవీ కొని తెలుగు, తమిళ్ గ్రాండ్ గా రిలీస్ చేస్తున్నారంటే గట్స్ కావాలి. శ్రీనివాస్ గుడిలో దేవుడిని చూస్తున్నా. నా కొడుకు లక్కీ శ్యామ్ కే నాయుడు టీం రాగా ఇంపార్టెంట్. మా అబ్బాయి సినిమా ఇంత గ్రాండ్ వచ్చిందంటే శ్యామ్ కే నాయుడే కారణం. రెండు రోజూ ముందు మాత్రమే ఆయనకు ఫోన్ కలిసింది చెప్పడంతో ఆయన ఓకే అని వచ్చేశారు. నేనెప్పుడూ ఆయనను మరచిపోను రోహిత్, ఎస్తేర్, అంకిత, సత్యం రాజేశ్ అందరికీ ధన్యవాదాలు. అమ్మ రాజశేఖర్ మూవీలో మదర్ సెంటిమెంట్ సాంగ్ ఇచ్చిన తేజా గారికి థాంక్యూ. ఇంటి లోపలికి సినిమాను తీసుకొచ్చా. నా కూతురు, నా భార్య రాధిక థాంక్యూ, టెక్నిషియన్స్ అందరికీ థాంక్యూ" అన్నాడు.
దర్శకుడు: అమ్మ రాజశేఖర్
నిర్మాత : శ్రీనివాస గౌడ్
బ్యానర్: దీపా ఆర్ట్స్
నటీనటులు: అమ్మ రాగిన్ రాజ్, అంకిత నాస్కర్, రోహిత్, ఎస్తేర్ నోరోన్హ, ముక్కు అవినాశ్, సత్యం రాజేశ్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, శ్రవణ్
రైటర్స్: అమ్మ రాజశేఖర్
డీఓపీ: శ్యామ్ కె నాయుడు
సాంగ్: థమన్ ఎస్‌ఎస్
మ్యూజిక్ డైరెక్టర్: ధర్మ తేజ, అస్లాం కేఈ
బీజీఎం: అస్లాం కేఈ
డైలాగ్స్: అమ్మ రాజశేఖర్ అండ్ టీం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాధ రాజశేఖర్
ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ
డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్: అమ్మ రాజశేఖర్
లిరిసిస్ట్స్: ధర్మతేజ
ఎడిటర్ : శివ సామి
పీఆర్వో: మధు వీఆర్
డిజిటల్ మీడియా : డిజిట్ దుకాణం