Rajendra Prasad Apology : అరేయ్ వార్నర్..క్రికెట్ ఆడురా అంటే..సినిమా డైలాగులు చెప్తావా రా..దొంగ ముం* కొడక
రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ వార్నర్ పై చేసిన కామెంట్స్ వైరల్..నెటిజన్స్ సీరియస్
.jpg)
Actor Rajendra Prasad Apology to Cricketer Devid Warner
రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై పలువురి ఆగ్రహం
మూవీ డెస్క్ - ప్రభాత సూర్యుడు
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ వార్నర్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్, డేవిడ్ వార్నర్‌ను ఉద్దేశించి, ‘‘రేయ్ డేవిడ్, వచ్చి క్రికెట్ ఆడవయ్యా అంటే పుష్ప డైలాగులు వేస్తావా, దొంగ ములిలి కొడకా, నువ్వు మామూలోడివి కాదు రోయ్ వార్నరూ’’ అంటూ సరదాగా మాట్లాడారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వార్నర్ అభిమానులు తీవ్రంగా స్పందించారు. కొందరు ఈ వ్యాఖ్యలను హాస్యంగా తీసుకోగా, మరికొందరు రాజేంద్ర ప్రసాద్ మాటలను అనుచితంగా భావించి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టార్ క్రికెటర్ ను ఇలా అవమానించడం కరెక్ట్ కాదు అంటూ ఫైర్ అవుతున్నారు. వార్నర్ చాలా మంచి వ్యక్తి అని అతన్ని ఇలా సినిమా పేరుతో అవమానించడం సరికాదు అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. కాగా రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను వార్నర్ సీరియస్ గా తీసుకోలేదని దర్శకుడు వెంకీ కుడుముల తెలిపారు.