Talk of the Tollywood :నిన్నూ.. సితారను చూడాలి.. గౌతమ్‌ తో గేమ్స్‌ ఆడాలి 

జక్కన్నా జబర్దస్తీ

On
Talk of the Tollywood :నిన్నూ.. సితారను చూడాలి.. గౌతమ్‌ తో గేమ్స్‌ ఆడాలి 

హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు

రాజమౌళి మూవీ అంటే అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమా అంటే ఏళ్ల తరబడి షూటింగ్‌ జరగాల్సిందే. నటీనటులు దగ్గర నుంచి సాంకేతిక సిబ్బంది వరకూ లాక్‌ అయిపోయినట్లే. ఎందుకంటే జక్కన్న మూవీ అంటే అంతే మరి. కొన్ని సంవత్సరాల తరబడి షూటింగ్‌ చేసే రాజమౌళి సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్‌ బద్దలు కావాల్సిందే. బాహుబలి రెండు పార్ట్‌ లు కానీ, తర్వాత ఖీఖీఖీ మూవీ కానీ ఏళ్ల తరబడి షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయినా సరే రికార్డులన్నీ బ్రేక్‌ చేసేశాయి. ర్ ర్ ర్  మూవీలో పాట కూడా ఆస్కార్‌ అవార్డు కొట్టేసింది. అలా ఉంటది జక్కన్నతో మరి. అందుకే వెరీ వెరీ స్పెషల్‌ జక్కన్న సినిమాకు ముందు నుంచే ప్రమోషన్స్‌ ప్లాన్‌ చేయడంలో ఆయనను మించిన వారు మరొకరు ఉండరు.తన సినిమాకు తాను హైప్‌ సృష్టించుకోవడంలో విన్నూత్నంగా జనంలోకి వెళ్లడంలో రాజమౌళి తర్వాతే ఎవరైనా. రాజమౌళి దర్శకత్వం వహించిన ఒక్క సినిమాలోనైనా నటించాలని చాలా మంది అగ్రహీరోలు కూడా కోరుకుంటారంటే ఇదే కారణం. ఇక తాజాగా రాజమౌళి ` సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కాంబినేషన్‌ లో మూవీ షూటింగ్‌ ప్రారంభమయింది. షూటింగ్‌ ప్రారంభమయినట్లు అఫిషియల్‌ న్యూస్‌ వచ్చేసింది. మహేష్‌ బాబు పాస్‌ పోర్టును స్వాధీనం చేసుకున్నట్లు వీడియో షేర్‌ చేయడంతో ఇక ఫ్యాన్స్‌ కు పూనకాలు వచ్చేశాయి. బోనులో సింహాన్ని బంధించినట్లు వచ్చిన ఈ వీడియో సో

images (5)

షల్‌ విూడియాలో వైరల్‌ అయింది. ఇక దీనపై నెట్టింట్‌ విూమ్స్‌ కూడా వస్తున్నాయి. పాపం పసివాడు సినిమాలో పాటను మహేష్‌ బాబుకు మార్చి పాడుతూ నమత్రా చూడాలి.. నిన్నూ.. సితారను చూడాలి.. గౌతమ్‌ తో గేమ్స్‌ ఆడాలి అంటూ వచ్చిన వీడియో కూడా వైరల్‌ అయింది. అయితే తాజాగా రాజమౌళి షూటింగ్‌ లో కొన్ని షరతులను విధించినట్లు చెబుతుంది. ఈ సినిమాలో రాజమౌళి ` మహేష్‌ బాబు కాకుండా మరొకరి పేరు బయటకు రాలేదు. ప్రియాంక చోప్రా పేరు బయటకు వచ్చినా అధికారికంగా చిత్ర యూనిట్‌ ప్రకటించలేదు. అలాగే మలయాళనటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటిస్తున్నాడంటూ వార్తలు హల్‌ చల్‌ చేసింది. అందులో నిజమెంతో తెలియదు. తాజాగా బాలివుడ్‌ నటుడు జాన్‌ అబ్రహాం పేరు కూడా బాగా వినిపిస్తుంది. అయితే ఇవన్నీ ఊహాగానాలే. రాజమౌళి ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతేకాదు ఆయన కొన్ని నెలలు ముందుగానే షూటింగ్‌ స్పాట్‌ లను చూసి వచ్చి కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారన్న నేపథ్యంలో కొన్ని షరతులు విధించారంటున్నారు. బాలీవుడ్‌ స్థాయిలో భారీగా ఖర్చు పెట్టి తీస్తున్న సినిమా కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  కొన్ని నెలల పాటు జరిగే షూటింగ్‌ కు వందల సంఖ్యలో సాంకేతిక సిబ్బంది, నటీనటులు వస్తారు. అయితే వీరెవ్వరూ సెల్‌ ఫోన్‌ తేవడానికి వీలులేదని రాజమౌళి షరతు విధించినట్లు ఇంగ్లీష్‌ విూడియాలో కథనాలు వస్తున్నాయి. చిత్రంలో నటించే వారి పేర్లు కానీ, సాంకేతిక నిపుణుల పేర్లు కానీ బయటకు వెల్లడిరచకూడదని ఒప్పందం కూడా అందరి చేత రాజమౌళి రాయించుకున్నారని చెబుతున్నారు. హీరో తో పాటు సెట్‌ లో ఉన్న అందరూ సెల్‌ ఫోన్లను తేవద్దని, అలా అతిక్రమించిన వారిపై చర్యలుంటాయని కూడా హెచ్చరించారు. సమాచారం ఏమాత్రం బయటకు పొక్కినా సహించేది లేదన్న హెచ్చరికను తొలి రోజు షూటింగ్‌ లోనే జక్కన్న ఇచ్చారని తెలిసింది. దీంతో ఇప్పుడు మహేష్‌ బాబు కూడా ఫోన్‌ తీసుకురాకపోవడంతో నమ్రతా చూడాలి.. నిన్నూ సితారను చూడాలి.. గౌతమ్‌ తో గేమ్స్‌ ఆడాలి అన్న పేరడీ సాంగ్‌ సోషల్‌ విూడియాలో వైరల్‌ అయింది.

Views: 0

Latest News

ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి
అక్రమవలసదారులను పంపించేయండి గౌహాతి-ప్రభాత సూర్యుడు అస్సాం రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడ్డ వారిని వారి స్వస్థలాలకు పంపించి...
AP POLITICS 2025 :మున్సిపాల్టీల్లో పట్టించుకోని కేడర్‌
TG RATION CARD UPDATE :కొత్త కార్డులతో పెరిగిన బియ్యం కోట...
TELANGANA AIRLINE UPDATE 2025 :కొత్తగూడెం ఎయిర్‌ పోర్టుకు లైన్‌ క్లియర్‌
AMARAVATHI NEWS 2025 :లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ!
DELHI ELECTION UPDATE : ఢిల్లీ ఎలక్షన్స్
AP HEALTH ALRET 2025 : ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి