AP Politics : విజయసాయిరెడ్డి బాటలో అయోధ్య రామిరెడ్డి
YSRCP Leader Ayodhya Rami Reddy on the Trail of Vijaya Sai Reddy | YSRCP Leader Ayodhya Rami Reddy Resign to YSRCP
విజయసాయిరెడ్డి బాటలో అయోధ్య రామిరెడ్డి
గుంటూరు- ప్రభాత సూర్యుడు
విజయసాయిరెడ్డితో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల రాజీనామాలు ఆగే సూచనలు కనిపించడం లేదు. వైసీపీ తెర వెనుక రాజకీయాల్లో కీలకంగా ఉండే మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా మిడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చే వారం రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా లేఖ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాంకీ గ్రూపునకు యజమాని అయిన అయోధ్య రామిరెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన కొన్ని కీలక జిల్లాల వైసీపీ బాధ్యతలు చూసుకుంటూ ఉంటారు. ఆయన కూడా రాజీనామా చేస్తున్నారు. ఆయన బీజేపీలో చేరుతారా లేకపోతే పదవికి మాత్రమే రాజీనామా చేసి వైసీపీలోనే ఉంటారా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉన్న సమయంలో వీరు ఇలా రాజీనామాల నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. పదవి కాలం ఇంకా ఐదేళ్ల వరకూ ఉన్నా వీరు హఠాత్తుగా ఎందుకు పదవులు వదులుకుంటున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వీరు ఇప్పుడు చేసే రాజీనామాల వల్ల ఆ పదవులన్నీ కూటమికే దక్కుతాయి కానీ వైసీపీ ఖాతాలో పడే అవకాశం లేదు. ఇప్పటికే వైసీపీ నుంచి ముగ్గురు రాజీనామా చేశారు. ఆ ముగ్గురిలో ఇద్దరు బీజేపీలో చేరి మళ్లీ ఎంపీలయ్యారు. మరొకరు టీడీపీలో చేరినా రాజ్యసభ సీటు వద్దనుకున్నారు. దాంతో ఆ సీటును సానా సతీష్ కు ఇచ్చారు. విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరమని చెబుతున్నారు. వైఎస్ కుటుంబంతో, జగన్ తో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయన వేరే పార్టీలో చేరకపోవచ్చు . అయితే ఆయన చేరినా బీజేపీ చేర్చుకునే అవకాశాలు ఉండవు. ఎదుకంటే జగన్ కేసులలో ఆయన సహ నిందితుడు. ఏ 2గా ఉన్నారు. ఆయనను బీజేపీ కూడా చేర్చుకునే అవకాశం ఉండదు. అందుకే ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే అయోధ్య రామిరెడ్డి మాత్రం బీజేపీలో చేరుతారని అంటున్నారు. ఆయన మళ్లీ ఆ పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికవుతారన్న ప్రచారం జరుగుతోంది. జగన్ మోహన్ రెడ్డికి ఈ రాజీనామాల అంశంపై స్పష్టత ఉందో లేదో వైసీపీ వర్గాలకు అంతు చిక్కడం లేదు. కుమార్తె గ్రాడ్యుయేషన్ డే కోసం వెళ్లిన ఆయన ఇంకా తిరిగి రాలేదు. ఎప్పుడు తిరిగి వస్తారో స్పష్టత లేదు. నెలాఖరులో వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే విజయసాయిరెడ్డి రాజీనామా ఖచ్చితంగా జగన్ కు తెలిసే జరిగి ఉంటుందని అంటున్నారు. లేకపోతే ఆయనకు చెప్పుకండా రాజీనామా చేసేంత పెద్ద కారణం ఉండబోదని అనుకుంటున్నారు. ఏమైనా వైసీపీలో వ్యవహారాలు మాత్రం పూర్తి స్థాయిలో చర్చనీయాంశం అవుతున్నాయి.