TG Graduate MLC Elections: జీవన్ రెడ్డి స్థానంలో...నరేందర్ రెడ్డి
Jeevan Reddy Vs Narender Reddy
జీవన్ రెడ్డి స్థానంలో...నరేందర్ రెడ్డి
కరీంనగర్ - ప్రభాత సూర్యుడు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు అయినట్లేనా? గాంధీభవన్ పెద్దలు ఆ ఆశావహుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారా? ఇంతకాలం ప్రచారానికే పరిమితం అయిన ఆ క్యాండెట్ నాలుగు జిల్లాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కలుస్తూ.. మద్దతు కోరుతుండటంతో ఆయనకి లైన్ క్లియర్ అయినట్లే అంటున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రెస్టేజియస్‌గా తీసుకున్న కాంగ్రెస్ ఈ సారి సిట్టింగ్ ఎమ్మెల్సీని కాదని.. ఎన్నో వడపోతల తర్వాత ఆయనని ఓకే చేసిందంట. ఇంతకీ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేయబోయే అభ్యర్ధి ఎవరు?కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిష్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి పదవీ కాలం మార్చితో ముగియ నుంది. దాంతో ఆ స్థానానికి ఎన్నికల కమిషన్ త్వరలో షెడ్యూల్ విడుదల చేయనుంది. ఆ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఇప్పటికే బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. బీఅర్‌ఎస్ అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? లేదా? అన్నది క్లారిటీ లేదు. దానికి సంబంధించి కారు పార్టీలో ఆశావహులు కూడా కనిపించడం లేదు. పార్టీ ముఖ్య నేతలు కూడా దానిపై సడీ సప్పుడూ చేయడం లేదు.ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం పరిధిలోని నాలుగు పార్లమెంట్ సెగ్మెంట్లలో బీజేపీ ఎంపిలే ఉన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు . అటు బీజేపీ ఎంపీలు, ఇటు కేంద్ర మంత్రికి ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది.. ఆ క్రమంలో అసలు పొటీ బీజేపీతోనే అని భావిస్తున్న కాంగ్రెస్ బలమైన సామాజిక వర్గం, అన్ని విధాలా బలమైన అభ్యర్ధి కోసం పెద్ద కసరత్తే చేస్తుంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జీవన్‌రెడ్డి బీజేపీని ఎదుర్కోవడానికి సరిపోరని భావిస్తున్న కాంగ్రెస్ పెద్దలు కొత్త అభ్యర్ధి కోసం అన్వేషించి ఫైనల్ చేసినట్లు తెలిసింది.జీవన్ రెడ్డి సామాజిక వర్గానికే చెందిన నరేందర్ రెడ్డి పేరు కూడా పరిశీలించిన కాంగ్రెస్ ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అర్థికంగా అండదండలు అభ్యర్థి కావాలి కాబట్టి జీవన్ రెడ్డి కాకుండా నరేందర్ రెడ్డినే బరిలోకి దింపాలని భావిస్తున్నారంట. మొదటినుండి కుడా నరేందర్‌రెడ్డికి కాంగ్రెస్‌తో సత్సంబంధాలు ఉన్నయి. గత పదిహేను సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. గత ఎమ్మెల్యే , ఎంపి ఎన్నికలలో కూడా టికెట్ ఆశించారు. కాని సామజిక సవిూకరణాలు అనుకూలించక పోవడంతో అవకాశం దక్కలేదు.నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఖచ్చితంగా పొటీ చేయాలన్న ఉద్దేశంతో ఆరునెలల ముందు నుంచే అస్త్రాలని సిధ్ధం చేసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నాడు. గత ముప్పై ఏళ్లకి పైగా విద్యారంగంలో ఉండడం ఆయనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసివచ్చే అంశంగా మారింది. ఇప్పటికే తన పూర్వ విద్యార్థులు, తన స్టాఫ్‌తో దాదాపుగా అరునెలలుగా గ్రాడ్యుయేట్ ఓటర్లలో ప్రచారం కొనసాగిస్తున్నారు. అల్పోర్స్ విద్యాసంస్థల అధినేతగా వూట్కూరి నరేందర్ రెడ్డి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అందరికీ సుపరిచితులే.కరీంనగర్ లో అల్పోర్స్ కళాశాల ప్రారంభించిన నరేందర్‌రెడ్డి ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి అదిలాబాద్, ఉమ్మడి నిజామాబాదు జిల్లాల వ్యాప్తంగా అల్పోర్స్ శాఖలు నిర్వహిస్తున్నారు. నాలుగు జిల్లాలలో పరిచయం అక్కరలేని పేరు నరేందర్ రెడ్డిది. అరునెలల నుండి నాలుగు జిల్లాల పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ పట్టభద్రుల ఓటర్లు నమోదు చేపించడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పటికే పీసీసీ పెద్దలు, ఢల్లీి కాంగ్రెస్ పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారంట. ఇటీవల ముఖ్యమంత్రి వేములవాడ పర్యటనకి వచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ హోర్డింగ్‌లు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేసి అందరి దృష్టిలో పడ్డారు పట్టభద్రుల ఓటర్లని కలుస్తూ మద్దతూ కోరిన అయన ఇప్పుడు ట్రెండ్ మార్చి నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే లని కలుస్తూ మద్దతు కూడ గట్టుకునే పనిలో పడ్డారు. ఇప్పుడు అదే నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు అయిందన్న ప్రచారానికి బలం చేకూరుస్తుంది. అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడం వల్లే ఆయన వరుసగా ప్రజాప్రతినిధులను కలుసున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ కూడా నాలుగు జిల్లాల నేతల అభిప్రాయ సేకరణ చేపట్టారంట. దాంతో చాలా మంది కాంగ్రెస్ సీనియర్లు, ఎమ్మెల్యే లు నరేందర్ రెడ్డి పేరు ప్రతిపాదించారంట.మొదటి నుంచి సీనియార్టీ దృష్ట్యా ఎమ్మెల్సీ టికెట్ తిరిగి జీవన్ రెడ్డికే ఇస్తారని ప్రచారం జరిగింది. టీ పీసీసీ నాయకత్వం కూడా జీవన్ రెడ్డి పేరొక్కటే ఢల్లీి అధిష్టానానికి పంపిందంట. అయితే నెలరోజుల వ్యవధిలో సవిూకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఎమ్మెల్సీ సీటును ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని కాంగ్రెస్ భావిస్తుంది. సామజికంగా, అర్థికంగా బలం గా ఉన్న వారు అయితే ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధిస్తామని, ఎట్టి పరిస్థితిల్లో పట్టు సడల కూడదన్న పట్టుదలతో నరేందర్ రెడ్డి పేరుని ఒకే చేసినట్లు ప్రచారం జరుగుతుంది.కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి కూడా నరేందర్ రెడ్డి పేరుని కన్‌ఫర్మ్ చేస్తూ ఆయనకు సహకరించాలని ఆదేశాలు వెళ్లాయంట. అందుకే ఎమ్మెల్యేలు కూడా నరేందర్ రెడ్డి కే కన్ఫర్మేషన్ అవుతుందని క్యాడర్‌కి చెప్తున్నారంట. మరి అఫిషియల్ ప్రకటన ఎప్పుడుంటుందో చూడాలి.