TALANGANA POLITICAL NEWS : మూడు హత్యలకు కేటీఆర్‌ కు లింకేంటీ

THREE SUSPICIOUS DEATHS IN TELANGANA

On
TALANGANA  POLITICAL NEWS  : మూడు హత్యలకు కేటీఆర్‌ కు లింకేంటీ

మూడు హత్యలకు కేటీఆర్‌ కు లింకేంటీ  

హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు

తెలంగాణలో మూడు అనుమానాస్పద మరణాలు చోటు చేసుకున్నాయని రేవంత్‌ రెడ్డి ఢల్లీిలో విూడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో చెప్పారు. ఒకరు మేడిగడ్డపై కేసులు వేసిన రాజలింగమూర్తి, రెండు సినీ నిర్మాత కేదార్‌, మూడు వీరిద్దరి కేసులను వాదిస్తున్న సంజీవరెడ్డి అనే లాయర్‌ అని చెప్పారు. సినీ నిర్మాత కేదార్‌ కేటీఆర్‌ బిజినెస్‌ పార్టనర్‌ అన్నారు. ఈ మరణాలపై కేటీఆర్‌ ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. కేదార్‌ అనే సినీ నిర్మాత విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండతో  గం గం గణేశా అనే సినిమా తీశారు. విజయ్‌ దేవరకొండతో ఓ సినిమా ప్లాన్‌ చేసుకుంటున్నారు. అయితే ఓ సినీ పైనాన్షియర్‌ ఇంట్లో పెళ్లి వేడుకల కోసం దుబాయ్‌ వెళ్లిన ఆయన అక్కడ చనిపోయారు. ఏం జరిగిందన్నదానిపై స్పష్టత లేదు.అయితే సీఎం  రేవంత్‌ రెడ్డి మాత్రం దుబాయ్‌ తో కేదార్‌ తో పాటు బీఆర్‌ఎస్‌ కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ఉన్నారని అక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్‌ కేసులు త్వరలో విచారణకు వస్తున్న సమయంలో ఇలాంటి మరణాలు అనుమానాస్పదమేనని స్పష్టం చేశారు.  తన వ్యాపార భాగస్వామి మరణంపై కేటీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్‌ ప్రశ్నించారు.  వీటిపై విచారణకు కేటీఆర్‌ ఎందుకు డిమాండ్‌ చేయరని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే తాము విచారణ చేయిస్తామన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఆలస్యం చేస్తోంది కేంద్రమేనని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. విదేశాల్లో ఉన్న వారిని తీసుకు రావాల్సింది ఎవరని రేవంత్‌ ప్రశ్నించారు. బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.  ప్రభాకర్‌ రావు, శ్రవణ్‌ రావును తీసుకు వస్తే నలభై ఎనిమిది గంటల్లో కేసీఆర్‌ , కేటీఆర్‌, హరీష్‌ రావులను అరెస్టు చేస్తామన్నారు.  కాళేశ్వరంపై నిపుణుల కమిటీ విచారణ జరుపుతోందని వారి విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఉపఎన్నికలు వస్తాయని కేసీఆర్‌, కేటీఆర్‌ అంటున్న విషయాన్ని విూడియా ప్రతినిధులు ప్రస్తావించారు. అయితే ఎలా వస్తాయని రేవంత్‌ ప్రశ్నించారు. పదేళ్ల పాటు ఎంతో మంది ఎమ్మెల్యేలను ఫిరాయించినా రాని ఉపఎన్నికలు ఇప్పుడు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ లేనే లేదని స్పష్టం చేశారు.ఈ ముగ్గురు మృతిచెందడంపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. ప్రభుత్వం తప్పకుండా విచారిస్తోందని అన్నారు. గతంలో కేటీఆర్‌ కు వ్యాపార భాగస్వామిగా ఉన్న కేదార్‌ కు డ్రగ్స్‌ టెస్ట్‌ చేయగా పాజిటివ్‌ వచ్చింది. అయితే కేదారి అధిక మోతాదులో డ్రగ్స్‌ సేవించడంతోనే మృతి చెందినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అయితే కేదార్‌ మృతిచెందినప్పుడు పక్కనే ఓ తెలంగాణ మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు సమాచారం. ఆ ఎమ్మెల్యే ఎవరో చెప్పాలని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. దుబాయిలో కేదార్‌ మరణ వెనుక ఓ పెద్ద మిస్టరీనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రీసెంట్‌ గా హైదరాబాద్‌ లో ఓ రాజకీయ ప్రముఖుడు ఇచ్చిన డ్రగ్స్‌ పార్టీ రాడిసన్‌ హోటల్‌ లో జరిగిందని? అందులో కేదార్‌ కూడా ఉన్నారని సీఎం చెప్పారుప్రధాన కేసుల్లో ఉన్న వారు ఇలా వరుసగా మృతిచెందడం వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏమిటి..? దీనిపై బీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు మాట్లాడడం లేదు. వీటిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే విచారణ జరిపిస్తాం’ అని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలతో పాటు, టాలీవుడ్‌లోనూ పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేటీఆర్‌ డ్రగ్స్‌ తీసుకుంటారని గతంలో సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు కేదార్‌ మృతిచెందడం, అది కూడా దుబాయిలో.. ఈ మరణాల వెనుక అసలు కారణాలేంటో పెద్ద చర్చే జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేయని పార్టీ రాజకీయాల కోసం మాట్లాడుతోందని.. కాంగ్రెస్‌, బీజేపీ మధ్యనే తెలంగాణలో పోటీ జరుగుతోందన్నారు. బీజేపీ కోసం బీఆర్‌ఎస్‌ పని చేస్తోందన్నారు. ప్రధానమంత్రితో జరిగిన భేటీలో రాష్ట్రానికి రావాల్సిన, కావాల్సిన అంశాలపై  నివేదికలు ఇచ్చామన్నారు.  ఎస్‌ఎల్బీసీ పనులు  కమిషన్లు రావన్న కారణంగా పదేళ్ల పాటు నిలిపివేశారని రేవంత్‌ మండిపడ్డారు. ఈ కారణంగానే అ ప్రమాదం జరిగిందన్నారు. కార్మికులను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలను కూడా ప్రధాని మోదీకి వివరించానని రేవంత్‌ రెడ్డి తెలిపారు.    

Views: 2

Latest News