TG Congress : తెలంగాణలో అడుగు పెట్టిన తొలి రోజే మీనాక్షి నటరాజన్ కొరడా
Telangana State Congress Party New In charge Meenakshi Natarajan

గాంధీభవన్ లో నో బ్యానర్స్
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు
తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ కేడర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల నూతన ఇంఛార్జ్‌గా విూనాక్షి నటరాజన్‌ను హైకమాండ్ నియమించిన సంగతి తెలిసిందే. అయితే.. విూనాక్షి నటరాజన్.. హైదరాబాద్ విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా.. పార్టీ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో ఉన్న గాంధీ భవన్‌లో ఇకపై ఎలాంటి బ్యానర్లు గానూ, కటౌట్లు గానీ, ఫ్లెక్సీలు గానీ ఏర్పాటు చేయవద్దని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు.. పార్టీ నేతలకు, శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.అయితే.. గాంధీ భవన్ ఆవరణలో పార్టీ అగ్రనేతలైన సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ ఫొటోలు మాత్రమే కనిపించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గాంధీ భవన్ ఆవరణలో ఉన్న ఇతర నేతల ఫొటోలు, కటౌట్లను సిబ్బంది వెంటనే తొలగించేశారు. విూనాక్షి నటరాజన్ రావటానికి ముందే కఠిన నిర్ణయంతో వస్తున్న నేపథ్యంతో.. ఆమె వచ్చిన తర్వాత గాంధీ భవన్ రూపు రేఖలు మారనున్నాయన్న చర్చ మొదలైంది. అయితే.. విూనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ టీంలో ముఖ్యమైన లీడర్‌గా పేరుపొందగా.. ఆమె పని తీరు కూడా ప్రత్యేక శైలిలో ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌లో కొంత కాలంగా కొన్ని లుకలుకలు ఉన్నట్టుగా చర్చలు జరగుతున్న నేపథ్యంలో.. హైకమాండ్ విూనాక్షి నటరాజన్‌ను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి విూనాక్షి నటరాజన్ హాజరుకానున్నారు. అలాగే.. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు సీనియర్లు కూడా హాజరు కానున్నారు.పార్టీ ఇంఛార్జ్‌గా నియామకం అయిన తర్వాత తొలిసారి గాంధీ భవన్‌కు వస్తున్న విూనాక్షి నటరాజన్‌కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీలోని నేతలంతా సమాయత్తమవుతోన్నారు.
ఈ నేపథ్యంలోనే.. విూనాక్షి నటరాజన్ హైదరాబాద్ వస్తున్న సందర్భంగా గాంధీ భవన్ మొత్తం భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లతో నింపేయవద్దని.. అలాగే శాలువాలు, బోకేలు తీసుకురావద్దంటూ నేతలు, శ్రేణులకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.