TG Special Assembly Session : ఈ నెల 4వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

On
TG Special Assembly Session : ఈ నెల 4వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

ఈ నెల 4వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు

ఈ నెల 4వ తేదీన తెలంగాణ అసెంబ్లీ సమావేశం కానుంది. అదే రోజు కులగణన సర్వే నివేదికను సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఆ రోజు ఉదయం 11 గంటలకు సభ సమావేశం కానుంది. 11 గంటలకు కులగణన సర్వే నివేదికను సభలో ప్రవేశ పెట్టనుంది సర్కార్‌. అదేరోజు.. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌ లో క్యాబినెట్‌ సమావేశం కానుంది. క్యాబినెట్‌ లో ఆమోదం పొందిన కులగణన సర్వేను 11 గంటలకు శాసనసభలో ప్రవేశ పెట్టనున్న రేవంత్‌ ప్రభుత్వం.అటు కులగణన నివేదిక క్యాబినెట్‌ సబ్‌ కమిటీకి అందింది. కులగణన నివేదికను ప్లానింగ్‌ కమిషన్‌ అధికారులు సబ్‌ కమిటీకి అందజేశారు. తెలంగాణలో 50 రోజుల పాటు కులగణన సర్వే జరిగింది. 1,03,889 మంది అధికారులు ఈ సర్వేలో పాల్గొన్నారు. 96.9 శాతం కుటుంబాలను అధికారులు సర్వే చేశారు. 3.1శాతం కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదని కమిషన్‌ తెలిపింది.కులగణన సర్వేలో పాల్గొన్న సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. ఇది సువర్ణక్షరాలతో లిఖించదగిన రోజు అని ఆయన అన్నారు. ఈ సర్వేను అడ్డుకోవడానికి దుష్ప్రచారాలు చేశారని మంత్రి పొన్నం ఆరోపించారు.విపక్షాల కుట్రలను ఛేదించి ప్రభుత్వం ఈ సర్వేను పూర్తి చేసిందన్నారు. ఏడాదిలోనే సర్వే నివేదిక తయారు చేయడం మా చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారాయన. తెలంగాణ బలహీనవర్గాల గొంతుగా వారికి అండగా ఉండే కార్యక్రమం తమ ప్రభుత్వం చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌.కులగణన సర్వేకు సంబంధించిన రిపోర్టును ప్రణాళిక సంఘం ఇవాళ క్యాబినెట్‌ సబ్‌ కమిటీకి అందించింది. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నేతృత్వంలోనే సబ్‌ కమిటీ.. ఈ నివేదికపై చర్చించింది. దాదాపు 50 రోజులు పాటు ఈ కులగణన సర్వే జరగ్గా, కోటి 10 లక్షల కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి. ఏయే కులాలకు సంబంధించి ఎంతమంది ఉన్నారు అనేదానిపై ప్రభుత్వం ఈ సర్వేలో ప్రధానంగా దృష్టి సారించింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఎంత ఉండాలి అనే దానిపై ప్రభుత్వం దృష్టి సారించింది.55.85 శాతం మంది బీసీలు ఉన్నారని కులగణన సర్వేలో తేలినట్లుగా తెలుస్తోంది. సర్వే నివేదికపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. త్వరలో మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశం కానుంది. అందులో కులగణన సర్వే నివేదికపై చర్చించనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశంలో సర్వేకు సంబంధించిన నివేదికను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు, ఇతర కులాలకు ఎంత మేర శాతం రిజర్వేషన్లు కల్పించాలి అనేదానిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంత్రివర్గ ఉప సంఘానికి కులగణన సర్వే చేరింది. దీనిపై తెలంగాణ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, అధికారులు వివరాలు తెలిపారు. బలహీనవర్గాల అభ్యున్నతి కోసం అవసరమైన వివరాల సేకరణకు కులగణన చేసినట్లు ఉతమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.ఈ సర్వేలో 1,03,889 మంది ఎన్యుమరేటర్లు పాల్గొన్నట్లు వివరించారు. 96.9 శాతం (3.50 కోట్లు) మంది ఈ సర్వేలో పాల్గొని వివరాలు నమోదుచేసుకున్నారని తెలిపారు. 3.1 శాతం (16 లక్షల) మంది పలు కారణాలతో వివరాలు ఇవ్వలేదని చెప్పారు.
బీసీ జనాభా లెక్కించాలనేది తమ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ కోరిక అని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చెప్పారు. భారత్‌లో ఇటువంటి సర్వే ఎక్కడా జరగలేదని తెలిపారు. వెనుకబడ్డ తరగతుల వారికి న్యాయం చేయాలని తమ ఆకాంక్ష అని ఉత్తమ్‌ చెప్పారు.

కులగణన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో మొత్తం ఓసీల జనాభా  15.79 శాతం
ముస్లిం మైనారిటీల జనాభా 12.56 శాతం
ముస్లిం మైనారిటీ ఓసీల జనాభా  2.48 శాతం
బీసీల జనాభా 46.25 శాతం
ముస్లిం మైనారిటీ బీసీలు సహా మొత్తం బీసీల సంఖ్య  56.33 శాతం
ముస్లిం మైనారిటీల బీసీల జనాభా  10.08 శాతం
ఎస్టీల జనాభా 10.45 శాతం
ఎస్సీల జనాభా 17.43 శాతం

Views: 0

Latest News

ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి
అక్రమవలసదారులను పంపించేయండి గౌహాతి-ప్రభాత సూర్యుడు అస్సాం రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడ్డ వారిని వారి స్వస్థలాలకు పంపించి...
AP POLITICS 2025 :మున్సిపాల్టీల్లో పట్టించుకోని కేడర్‌
TG RATION CARD UPDATE :కొత్త కార్డులతో పెరిగిన బియ్యం కోట...
TELANGANA AIRLINE UPDATE 2025 :కొత్తగూడెం ఎయిర్‌ పోర్టుకు లైన్‌ క్లియర్‌
AMARAVATHI NEWS 2025 :లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ!
DELHI ELECTION UPDATE : ఢిల్లీ ఎలక్షన్స్
AP HEALTH ALRET 2025 : ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి