A STORY COMES TO AN END : వివాహ బంధానికి  సెహ్వాగ్‌..

On
A STORY COMES TO AN END : వివాహ బంధానికి  సెహ్వాగ్‌..

 వివాహ బంధానికి  సెహ్వాగ్‌..
ముంబై - ప్రభాత సూర్యుడు


భారత క్రికెట్‌ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్‌, ఆయన భార్య ఆర్తి అహ్లావత్‌ 20 ఏళ్ల వివాహ బంధం తర్వాత విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2004లో వివాహం చేసుకున్న ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వారు త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్లు ఊహాగానాలు చెలరేగాయి.సెహ్వాగ్‌, ఆర్తి చాలా నెలలుగా విడిగా నివసిస్తున్నారని, విడాకులు తీసుకోబోతున్నారని సమాచారం. దూకుడు బ్యాటింగ్‌ శైలికి పేరుగాంచిన వీరేంద్ర, ఆర్తి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ దంపతులకు 2007లో ఆర్యవీర్‌, 2010లో వేదాంత్‌ జన్మించారు. 20 ఏళ్లుగా అన్యూనంగా కలిసి ఉన్న సెహ్వాగ్‌ ఆర్తి ఇటీవల పలు పరిణామాలతో వారి మధ్య దూరం పెరుగినట్లు టాక్‌.దీపావళి వేడుకల సందర్భంగా వీరేంద్ర తన కుమారులు, తన తల్లితో కలిసి దిగిన ఫోటోలను సోషల్‌ విూడియాలో షేర్‌ చేశాడు. అయితే, ఆ పోస్ట్‌లో భార్య ఆర్తి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అలాగే, ఆమె పోస్ట్‌లో భార్య ఆర్తి ఫోటోలను షేర్‌ చేయలేదు వీరు. ఇలాంటి పలు చర్యలు వారి విడిపోయే ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.కాగా, రెండు వారాల క్రితం, వీరేంద్ర పాలక్కాడ్‌లోని విశ్వ నాగయక్షి ఆలయాన్ని సందర్శించి, ఆ ట్రిప్‌ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్‌. అయితే, ఆ పోస్ట్‌లో ఆర్తి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అది వారి సంబంధంలో మనస్పర్థలు ఉన్నట్లు మరింతగా సూచిస్తోంది.అయితే, భార్య ఆర్తితో విడిపోవడంపై క్రికెట్‌ దిగ్గజం సెహ్వాగ్‌ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ, ఈ జంట బహిరంగంగానే దూరంగా మెలగడం అటు క్రికెట్‌ వర్గాలు, ఇటు వారి అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది.ఇదిలా ఉంటే, న్యూ ఢల్లీికి చెందిన ఆర్తి అహ్లావత్‌ ఎక్కువగా సోషల్‌ విూడియాకు దూరంగా ఉంటారు. పెద్దగా ప్రజల అటెన్షన్‌ కోరుకోరు. డిసెంబర్‌ 16, 1980న జన్మించిన ఆర్తి అహ్లావత్‌ లేడీ ఇర్విన్‌ సెకండరీ స్కూల్‌, భారతీయ విద్యా భవన్‌లో చదువుకున్నారు. ఆ తర్వాత ఢల్లీి విశ్వవిద్యాలయంలోని మైత్రేయి కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌లో డిప్లొమా పూర్తి చేశారు.ఈ జంట ప్రేమకథ 2000 సంవత్సరం ప్రారంభంలో మొదలైంది. 2004లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నివాసంలో సెహ్వాగ్‌, ఆర్తి వివాహం ఘనంగా జరిగింది. 20 సంవత్సరాలుగా, వీరు అన్యూన్యమైన జంటగా కనిపించారు. వీరేంద్ర క్రికెట్‌ కమిట్‌మెంట్‌లు, వారి కుటుంబ జీవితాన్ని సమతుల్యం చేసుకున్నారు. అయితే, వారి సంబంధం కొంతకాలంగా ఇబ్బందుల్లో ఉందని, దీనివల్ల విడిపోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం. వీరేంద్ర 2015లో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నేషనల్‌ యాంటీ`డోపింగ్‌ ఏజెన్సీకి చెందిన యాంటీ`డోపింగ్‌ అప్పీల్‌ ప్యానెల్‌ సభ్యుడిగా వంటి వివిధ పాత్రలలో పనిచేస్తున్నారు. ఎక్కువగా ప్రైవేట్‌గా ఉన్న సెహ్వాగ్‌ వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఈ పరిణామాల నేపథ్యంలో హాట్‌ టాపిక్‌గా మారింది. కాగా, వీరేంద్ర, ఆర్తి ఇద్దరూ అధికారిక ప్రకటన చేయనప్పటికీ వారు విడిపోవడానికి సంకేతాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Views: 0

Latest News

ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి
అక్రమవలసదారులను పంపించేయండి గౌహాతి-ప్రభాత సూర్యుడు అస్సాం రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడ్డ వారిని వారి స్వస్థలాలకు పంపించి...
AP POLITICS 2025 :మున్సిపాల్టీల్లో పట్టించుకోని కేడర్‌
TG RATION CARD UPDATE :కొత్త కార్డులతో పెరిగిన బియ్యం కోట...
TELANGANA AIRLINE UPDATE 2025 :కొత్తగూడెం ఎయిర్‌ పోర్టుకు లైన్‌ క్లియర్‌
AMARAVATHI NEWS 2025 :లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ!
DELHI ELECTION UPDATE : ఢిల్లీ ఎలక్షన్స్
AP HEALTH ALRET 2025 : ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి